న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఆ ముగ్గురికి బౌలింగ్ చేయడం చాలా కష్టం: బ్రెట్ లీ

Brett Lee picks three toughest batsmen he ever bowled to

సిడ్నీ: అత్యంత వేగవంతమైన బౌలింగ్‌తో మేటి బ్యాట్స్‌మన్‌నే గజగజలాడించిన ఆస్ట్రేలియా మాజీ పేసర్ బ్రెట్‌లీ.. ఓ ముగ్గురు బ్యాట్స్‌మెన్‌ను ఎదుర్కోవడం మాత్రం చాలా కష్టమని తెలిపాడు. తాజాగా క్రిక్‌బజ్ ఆధ్వర్యంలో జింబాబ్వే బౌలర్ పొమి ఎంబాంగ్వే‌తో నిర్వహించిన చిట్‌చాట్‌లో లీ ఈ విషయాన్ని వెల్లడించాడు. ఇక ఆ ముగ్గురిలో టీమిండియా స్టార్ బ్యాట్స్‌మన్ సచిన్ టెండూల్కర్ మొదటి వాడని, ఆల్‌టైమ్ అతనే తన బెస్ట్ బ్యాట్స్‌మన్ అని చెప్పుకొచ్చాడు.

సచిన్, లారాతో కష్టం..

సచిన్, లారాతో కష్టం..

‘సచిన్ టెండూల్కర్‌కు బౌలింగ్ చేయడం చాలా కష్టం. అతను కొంత సమయం తీసుకొని షాట్స్ ఆడుతుంటాడు. అతనిలా మరే బ్యాట్స్‌మన్ బ్యాటింగ్ చేయలేడు. ఆల్‌టైమ్ అత్యుత్తమ బ్యాట్స్‌మన్ అతనే'అని బ్రెట్‌లీ చెప్పుకొచ్చాడు. ఇక రెండో బ్యాట్స్‌మన్ వెస్టిండీస్ లెజెండ్ బ్రియాన్ లారా అని తెలిపిన ఈ ఆసీస్ మాజీ పేసర్.. ఆరు బంతులను ఆరు ప్రాంతాల్లోకి తరలిస్తాడని చెప్పాడు.‘కఠినమైన రెండో బ్యాట్స్‌మన్ బ్రియాన్ లారా. మనం ఆరు బంతులను ఒకే ప్లే‌స్‌లో వేసినా అతను మాత్రం మైదానంలోని వివిధప్రాంతాల్లోకి తరలిస్తాడు.'అని తెలిపాడు.

నేనూ చూసిన అత్యుత్తమ ప్లేయర్..

నేనూ చూసిన అత్యుత్తమ ప్లేయర్..

ఇక మూడో వ్యక్తి సౌతాఫ్రికా ఆల్‌రౌండర్ జాక్వస్ కల్లీస్ అని బ్రెట్‌లీ చెప్పుకొచ్చాడు. తాను చూసిన అత్యుత్తమ ఆటగాడు కల్లీస్ అని తెలిపాడు.‘నేనెప్పుడు సచినే బెస్ట్ బ్యాట్స్‌మన్ అని చెబుతుంటా. కానీ నేను చూసిన అత్యుత్తమ క్రికెటర్ మాత్రం జాక్వస్ కల్లీస్. బౌలింగ్, బ్యాటింగ్‌లో అద్భుతంగా రాణించేవాడు. స్లిప్ క్యాచ్‌లు సూపర్‌గా అందుకునేవాడు'అని తెలిపాడు.

తొలి బంతికే సిక్స్ బాదగలరు..

తొలి బంతికే సిక్స్ బాదగలరు..

ఆటగాళ్ల టెక్నిక్ గురించి మాట్లాడుతూ.. భారత స్టార్ ప్లేయర్ల‌ు, తన సహచర ఆటగాడు ఆడమ్ గి‌ల్‌క్రిస్ట్‌పై ప్రశంసల జల్లు కురిపించాడు. ‘ఎంతో మంది స్పిన్నర్లు, వికెట్ కీపర్లను చూశాను. గిల్ క్రిస్ట్ కూడా గొప్ప కీపర్, బ్రిలియంట్ బ్యాట్స్‌మన్. కానీ జాక్వస్ కల్లీస్ టెక్నిక్ మాత్రం సూపర్. టెక్నిక్ గురించే మాట్లాడితే.. రాహుల్ ద్రవిడ్, వీవీఎస్ లక్ష్మణ్, వీరేంద్ర సెహ్వాగ్ కూడా అద్భుతం. టెస్ట్ మ్యాచ్‌లో తొలి బంతికే వీరు సిక్స్ కొట్టగలరు'అని లీ కొనియాడాడు.

కోహ్లీ, స్మిత్‌లో ఎవరు బెస్ట్ అంటే..

కోహ్లీ, స్మిత్‌లో ఎవరు బెస్ట్ అంటే..

ఈ తరంలో గొప్ప క్రికెటర్లైన విరాట్‌ కోహ్లీ, స్టీవ్‌ స్మిత్‌లో ఎవరు అత్యుత్తమో ఎంచుకోవడం చాలా కష్టమని బ్రెట్‌ లీ అన్నాడు. ఇద్దరూ అద్భుతంగా ఆడతారన్నాడు. ఇప్పటికిప్పుడు ఎంచుకోమంటే మాత్రం స్మిత్‌కే ఓటేస్తానని, అదే రేపు అడిగితే కోహ్లీ పేరు చెప్పొచ్చని వెల్లడించాడు.

'స్మిత్, కోహ్లీలలో ఒకర్ని ఎంచుకోవడం చాలా కష్టం. ఎందుకంటే.. వారిద్దరిలోని చాలా లక్షణాలను నేను ఇష్టపడతాను. అయితే బౌలింగ్‌ దృష్టికోణం నుంచి వివరిస్తే మాతరం.. స్మిత్, కోహ్లీ భిన్నమైన ఆటగాళ్లు. కోహ్లీ గురించి చెప్పాలంటే.. సాంకేతికంగా బలమైనవాడు. కెరీర్‌ తొలినాళ్లలో ఎక్కువగా ఆఫ్‌సైడ్‌ ది ఆఫ్‌స్టంప్‌ బంతులకు దొరికిపోయేవాడు. ఇప్పుడెంతో మెరుగయ్యాడు. ఎంతో సాధన చేసి తన బలహీతనను అధిగమించాడు. కోహ్లీ చాలా క్రమశిక్షణతో ఆడతాడు. దేహదారుడ్యంలో తిరుగులేదు. అతని సారథ్యం అమోఘం' అని బ్రెట్ ‌లీ అన్నాడు.

ఖబర్దార్ అఫ్రిది.. ఇది సర్జికల్ స్ట్రైక్స్ జరిపిన మోదీ ప్రభుత్వం

Story first published: Thursday, May 28, 2020, 14:59 [IST]
Other articles published on May 28, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X