న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఖబర్దార్ అఫ్రిది.. ఇది సర్జికల్ స్ట్రైక్స్ జరిపిన మోదీ ప్రభుత్వం

UP minister lashes out at Shahid Afridi
Shahid Afridi POK Remarks || ఖబడ్దార్ అఫ్రిది.. త్వరలోనే POK భారత్‌లో భాగం కానుంది...!!

లక్నో: కశ్మీర్ అంశాన్ని ప్రస్తావిస్తూ భారత ప్రధాని నరేంద్రమోదీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిదిపై ఉత్తరప్రదేశ్ మంత్రి ఆనంద్ స్వరూప్ శుక్లా ఆగ్రహం వ్యక్తం చేశారు. అతి తర్వలోనే పాక్ ఆక్రమిత కశ్మీర్(పీఓకే)ను స్వాదీనం చేసుకుంటామన్నారు. కరోనా వైరస్ కారణంగా రోడ్డున పడ్డ అభాగ్యులకు అఫ్రిది అండగా నిలిచిన విషయం తెలిసిందే.అఫ్రిది ఫౌండేషన్ ద్వారా నిత్యవసర సరకులు అందేజేస్తూ సాయంగా నిలుస్తున్నాడు. పాక్ మొత్తం తన సేవలను విస్తరించిన ఈ మాజీ క్రికెటర్.. వారం రోజుల క్రితం పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్‌లో కూడా పర్యటించాడు. ఈ సందర్భంగా అక్కడి ప్రజలతో మాట్లాడుతూ భారత్‌పై తనకున్న విద్వేశాన్ని చాటుకున్నాడు. ఆర్టికల్ 370 రద్దు చేయడాన్ని ఉద్దేశించి భారత ప్రధాని నరేంద్ర మోదీ, భారత ప్రభుత్వంపై అనుచిత వ్యాఖ్యలు చేశాడు.

విద్వేశపూరిత వ్యాఖ్యలు..

విద్వేశపూరిత వ్యాఖ్యలు..

‘పాకిస్థాన్‌‌ సైనిక బలం మొత్తం 7 లక్షలు ఉంటే.. దానికి మించిన సంఖ్యలో భారత బలగాలను మోదీ కేవలం కశ్మీర్‌లోనే మోహరించారు. ప్రపంచం కరోనా అనే మహమ్మారితో పోరాడుతుంది. కానీ నరేంద్ర మోదీ మనస్సులో దానికి మించిన వ్యాధి ఉంది'అని వివాదాస్పద రీతిలో వ్యాఖ్యానించాడు. అంతేకాకుండా వచ్చే పాకిస్థాన్ సూపర్ లీగ్ (పీఎస్‌ఎల్)‌లో కశ్మీర్ పేరిట ఓ జట్టును తీసుకోవాలని పీసీబీకి సూచించాడు. ఆ జట్టుకు తానే కెప్టెన్‌గా ఉంటానని తెలిపాడు. ఈ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో నెట్టింట హల్‌ ‌‌చల్ చేయడంతో తీవ్ర దుమారం రేగింది.

ఫైర్ అయిన క్రికెటర్లు

ఫైర్ అయిన క్రికెటర్లు

భారత క్రికెటర్లంతా అఫ్రిదిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చివరకు అతని ఫౌండేషన్‌కు విరాళాలు అందించాలని పిలుపునిచ్చిన యువరాజ్ సింగ్, హర్భజన్ సింగ్‌లు సైతం అఫ్రిదిపై మండిపడ్డారు. భవిష్యత్తులో అతనితో ఎలాంటి స్నేహం ఉండదని స్పష్టం చేశారు. ఇక తాజాగా ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ వ్యవహారాల శాఖ మంత్రి ఆనంద్ స్వరూప్ శుక్లా అఫ్రిది వ్యాఖ్యలపై తీవ్రంగా మండిపడ్డారు.

అనుష్కశర్మకు విరాట్ విడాకులివ్వాలి: బీజేపీ ఎమ్మెల్యే

పీఓకేను స్వాధీనం చేసుకుంటాం..

పీఓకేను స్వాధీనం చేసుకుంటాం..

‘అతి త్వరలోనే పాక్ ఆక్రమిత కశ్మీర్ భారత్‌లో భాగం కానుంది. అక్కడ భారత మువ్వెన్నల పతాకం కూడా రెపరెపలాడనుంది. భారత్‌ను బలహీనం చేయాలని ప్రయత్నిస్తున్న షాహిద్ అఫ్రిది లాంటి వ్యక్తులకు నేను చెప్పాలనుకుంటుంది ఒక్కటే.. ఇది సర్జికల్ స్ట్రైక్స్ జరిపిన నరేంద్ర మోదీ ప్రభుత్వం.. ఖబర్దార్. పీఓకే‌ను స్వాదీనం చేసుకునే సమయం ఆసన్నమైంది. అది చేసి పాక్ పాత మ్యాప్‌కు పరిమితం చేస్తేనే ప్రపంచంలో శాంతి నెలకొంటుంది.'అని శుక్లా హెచ్చరించాడు.

 రాజకీయాల్లోకి రాను..

రాజకీయాల్లోకి రాను..

అఫ్రిది రాజకీయాల్లోకి వెళ్లాలని ఆశించి.. పాకిస్థాన్‌లో తన పాపులారిటీని పెంచుకునేందుకే రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నాడనే ప్రచారం తెరపైకి వచ్చింది.

ఈ రూమర్లపై తాజాగా షాహిద్ అఫ్రిది క్లారిటీ ఇచ్చాడు. తనకు రాజకీయాల్లోకి వెళ్లే ఉద్దేశం లేదని స్పష్టం చేశాడు.‘ఒకవేళ రాజకీయాల్లోకి వెళ్లాలనుకుంటే.. ఎప్పుడో వెళ్లేవాడిని. మా పార్టీలో చేరమంటే మా పార్టీ చేరమని చాలా రాజకీయ పార్టీలు నన్ను సంప్రదించాయి. ఇప్పటికే నేను పొలిటీషియన్ చేసే సేవా కార్యక్రమాలను చేస్తున్నా. దానికి అన్ని పార్టీల నుంచి మద్దతు కూడా లభిస్తోంది. కానీ రాజకీయాల్లోకి వెళ్లే ఆలోచన నాకు లేదు. ప్రస్తుతం ప్రధాని ఇమ్రాన్ ఖాన్ బాగా పనిచేస్తున్నాడు. మేమందరం అతనికి మద్దతు ఇస్తాం' అని అఫ్రిది చెప్పుకొచ్చాడు.

వార్నర్ మైండ్‌బ్లాక్‌తో చంపేసావ్.. మీకు అర్థం అవుతుందా: రష్మిక

Story first published: Thursday, May 28, 2020, 7:10 [IST]
Other articles published on May 28, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X