న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

మహ్మద్ షమీ దాతృత్వం.. వలస కూలీలకు సాయంగా..

Mohammed Shami sets up food distribution centers in UP to help migrant workers

లక్నో: టీమిండియా స్టార్‌ పేసర్ మహ్మద్‌ షమీ తన పెద్ద మనసు చాటుకున్నాడు. సజీవమైన గుండెను పిడికిట పిసికినట్టు గత రెండున్నర నెలలుగా బాధపెడుతున్న వలస కూలీల గాథలకు చలించిపోయాడు. కరోనా తెచ్చిన కష్టంతో ఊరుబాట పట్టిన వలస కూలీల కోసం తన వంతు సాయాన్ని అందిస్తున్నాడు. మాస్క్‌లు, ఆహారాన్ని అందజేస్తున్నాడు.

ఇంటి దగ్గరే సహాయక శిభిరం..

ఉత్తరప్రదేశ్‌లోని సాహస్‌పూర్‌కు చెందని షమీ తన ఇంటి దగ్గర వలసదారుల కోసం సహాయక శిబిరాన్నే ఏర్పాటు చేశాడు. ఈ విషయాన్ని బీసీసీఐ తన అధికారిక ట్విటర్‌లో పేర్కొంది. అంతేకాకుండా వలసదారులకు షమీ సహాయం అందిస్తున్న వీడియోను కూడా షేర్‌ చేసింది. ప్రసుత్తం ఈ వీడియో నెటిజన్లను తెగ ఆకట్టుకుంది. అంతేకాకుండా షమీ గొప్ప మనసుకు అభిమానులు ఫిదా అవుతున్నారు.

వలస కూలీల కోసం వంటవాడిగా మారిన సెహ్వాగ్!

కడుపు తరుక్కుపోతుంది..

కడుపు తరుక్కుపోతుంది..

రెండు నెలల క్రితమే వలస కూలీల బాధలను చూస్తే కడుపు తరక్కు పోతుందని షమీ తెలిపాడు. ఏప్రిల్‌లో టీమిండియా లెగ్ స్పిన్నర్ యుజ్వేంద్ర చహల్‌తో ఇన్‌స్టాగ్రామ్ లైవ్ సెషన్‌లో పాల్గొన్న షమీ.. లాక్‌డౌన్ వల్ల దేశంలో నెలకొన్న దుర్భర స్థితిని, తన ఇంటి ముందే ఓ వలస కూలి పడ్డ కష్టం తనను కదిలించందని చెప్పుకొచ్చాడు.

‘దేశంలో విధించిన లాక్‌డౌన్‌తో రవాణ సౌకర్యం లేక ఓ కూలి రాజస్థాన్ నుంచి బీహార్‌కు కాలినడకన బయల్దేరాడు. అతని ఊరు చాలా దూరమనే విషయం తెలిసినా గత్యంతరంలేక తన ప్రయాణాన్ని మొదలుపెట్టాడు. అయితే అతను మా ఇంటి సమీపంలోకి రాగానే సొమ్మసిల్లి పడిపోయాడు. నా ఇంటి సీసీ కెమెరాల్లో అతను పడిపోవడాన్ని నేను గమనించా. వెంటనే ఆకలితో అలమటించే అతడు పడిపోయాడని గ్రహించి ఆహారం అందించా. అలాగే నాకు తోచిన సాయం చేశా.

ప్రతీ ఒక్కరికి తోచిన సాయం చేస్తున్నా..

ప్రతీ ఒక్కరికి తోచిన సాయం చేస్తున్నా..

నాకు సాధ్యమైనంతలో ఇలా కనిపించిన ప్రతీ ఒక్కరికి సాయం చేస్తున్నా. ఈ లాక్‌డౌన్ వల్ల వలస కూలీలు చాలా బాధపడుతున్నారు. వారి గోస చూస్తే కడుపుతరుక్కుపోతుంది. హైవేకు సమీపంలోనే మా ఇళ్లు ఉండటంతో వారి కష్టాలను నా కళ్లారా చూస్తున్నా. వారికి ఎలాగైనా సాధ్యమైనంత సాయం చేయాలని భావించా.'అని అప్పట్లో వలస కూలీల బాధను షమీ వివరించాడు.

క్రికెటర్లంతా అండగా..

క్రికెటర్లంతా అండగా..

కరోనా లాక్‌డౌన్‌ కారణంగా క్రికెట్‌ కార్యకలాపాలు పూర్తిగా స్తంభించిపోవడంతో ఆటగాళ్లంతా ఇంటికే పరిమితమయ్యారు. అయితే ఈ కష్ట కాలంలో భారత క్రికెటర్లు తమవంతు సాయాన్ని అందించారు. ప్రధాని పీఎం కేర్స్‌కు విరాళాలు ప్రకటించారు. ఇంకొందరు వలస కూలీలకు నేరుగా సాయం చేస్తున్నారు.

ఇక కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌ సడలింపులు ఇస్తున్న వేళ త్వరలోనే ఆటగాళ్లు మైదానంలోకి దిగే అవకాశం ఉంది. తొలుత ఆటగాళ్ల ఫిట్‌నెస్‌, ట్రైయినింగ్‌ సెషన్స్‌పై బీసీసీఐ ప్రత్యేక దృష్టి సారించే అవకాశం ఉంది.

దళితుల పట్ల యువరాజ్ సింగ్ అనుచిత వ్యాఖ్యలు

Story first published: Tuesday, June 2, 2020, 16:07 [IST]
Other articles published on Jun 2, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X