న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

బుమ్రాను ఎదుర్కోవడం అంత ఈజీ కాదు : గప్టిల్

Martin Guptill Says Never Easy to Face Jasprit Bumrah

ఆక్లాండ్‌: టీమిండియా స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా బౌలింగ్‌ను ఎదుర్కోవడం అంత సులువు కాదని న్యూజిలాండ్ ఓపెనర్ మార్టిన్ గప్టిల్ అభిప్రాయపడ్డాడు. తొలి వన్డేలో 32 పరుగులే చేసిన ఈ స్టార్ ఓపెనర్.. బుమ్రా బౌలింగ్‌లో తడబడ్డాడు. ఇక శనివారం జరగనున్న రెండో వన్డే నేపథ్యంలో గప్టిల్ మీడియాతో మాట్లాడాడు.

కొత్త బంతితో మరీ కష్టం..

కొత్త బంతితో మరీ కష్టం..

బుమ్రా బౌలింగ్ ఎదుర్కోవడం అంత సులువు కాదన్న గప్టిల్.. కొత్తబంతితో అయితే మరీ కష్టమని తెలిపాడు. ‘జస్‌ప్రీత్ బుమ్రాని సమర్థవంగా ఎదుర్కోవడం ఎలాగే ఇప్పటికీ తెలియడం లేదు. అతనిది యూనిక్ యాక్షన్. అద్భుత నైపుణ్యం కలిగిన బౌలర్. అయితే తొలి వన్డేలో అతని బౌలింగ్‌లో మా జట్టు పరుగులు రాబట్టగలిగింది. కొత్త బంతితో అతను బౌలింగ్ చేసే సమయంలో బౌండరీలు రాబట్టాలంటే చాలా కష్టం. అయితే.. మిడిల్ ఓవర్లలో మాత్రం అతడికి ఏమాత్రం వికెట్ అవకాశమివ్వకుండా తొలి వన్డేలో మా జట్టు పరుగులు రాబట్టగలిగింది' అని గప్టిల్ చెప్పుకొచ్చాడు.

శ్రీశాంత్‌కు భజ్జీ బర్త్‌డే విషెస్.. ఆ చెంప దెబ్బ గిఫ్టా అంటున్న అభిమానులు

సిన్నర్లను ఆడుకున్నాం..

సిన్నర్లను ఆడుకున్నాం..

‘చాలా రోజుల తర్వాత గత వన్డేలో భారత స్పిన్నర్లను మేం సమర్థవంతంగా ఎదుర్కోన్నామని భావిస్తున్నా. ఇది మా ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. సిరీస్‌లో మరింత పోరాడే శక్తినిచ్చింది.'అని గప్టిల్ తెలిపాడు.

తక్కువ అంచనా వేయడం లేదు..

తక్కువ అంచనా వేయడం లేదు..

తొలి వన్డే విజయంతో భారత్ వెనుకబడిందని ఏ మాత్రం అనుకోవడం లేదని గప్టిల్ స్పష్టం చేశాడు. ఇంకా అద్భుత ప్రదర్శనివ్వాలని భావిస్తున్నామని తెలిపాడు. ‘ఇండియా వెనుకబడిందని ఏ మాత్రం అనుకోవడం లేదు. భారత్ వరల్ట్ క్లాస్ ప్లేయర్లతో కూడిన జట్టు. బ్యాటింగ్, బౌలింగ్‌లో మ్యాచ్ విన్నర్స్ ఉన్న టీమ్. కాబట్టి మేం ఇంకా అద్భుతంగా ఆడి సిరీస్ గెలవాలి. రేపు కచ్చితంగా అద్భుత ప్రదర్శన కనబరుస్తామని ఆశిస్తున్నా.'అని గప్టిల్ చెప్పుకొచ్చాడు.

13 వైడ్లు వేసిన బుమ్రా..

13 వైడ్లు వేసిన బుమ్రా..

ఇక తొలి వన్డేలో బుమ్రా తేలిపోయాడు. 10 ఓవర్లు బౌలింగ్ చేసిన అతను 5.30 ఎకానమీతో 53 పరుగులిచ్చాడు. కానీ.. మ్యాచ్‌లో ఏకంగా 13 పరుగులు వైడ్స్ రూపంలోనే ఇవ్వడం ఆశ్చర్యానికి గురిచేసింది. గత ఏడాది వెన్ను గాయంతో మూడు నెలలు క్రికెట్‌కి దూరంగా ఉన్న బుమ్రా.. రీ ఎంట్రీలో త్వరగానే లయనందుకున్నాడు. కానీ మునుపటిలా స్థిరంగా రాణించలేకపోతున్నాడు.

Story first published: Friday, February 7, 2020, 19:26 [IST]
Other articles published on Feb 7, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X