టీ20 వరల్డ్ కప్ 2026 ఫైనల్ పోరు అహ్మదాబాద్ వేదికగా అత్యంత ఉత్కంఠభరితంగా జరుగుతోంది. ఈ కీలక మ్యాచ్‌ను చూసేందుకు స్టేడియంలోకి ప్రముఖులు, ఆటగాళ్ల కుటుంబ సభ్యులు, సన్నిహితులు భారీగా తరలివచ్చారు. వీరిలో భారత వికెట్ కీపర్-బ్యాటర్ ఇషాన్ కిషన్ ప్రియురాలు, ప్రముఖ మోడల్ అదితి హుండియా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
రెడ్ డ్రెస్‌లో మెరిసిన అదితి హుండియా
ఫైనల్ మ్యాచ్ సందర్భంగా అదితి హుండియా స్టాండ్స్‌లో కనిపించడంతో అందరి దృష్టి ఆమెపైనే పడింది. ఎంతో స్టైలిష్‌గా, ఎరుపు రంగు దుస్తుల్లో ఆమె మెరిసిపోతూ కెమెరాలకు చిక్కింది. అదితి హుండియా స్టేడియంలో ఉన్న ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. తన ప్రియుడు ఇషాన్ కిషన్, అలాగే టీమిండియాను ఉత్సాహపరిచేందుకు ఆమె స్టేడియానికి రావడం అభిమానుల్లో జోష్ నింపింది.

ఎవరీ అదితి హుండియా?
అదితి హుండియా రాజస్థాన్‌లోని జైపూర్‌కు చెందిన ప్రముఖ మోడల్, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్. 2017లో ఫెమినా మిస్ ఇండియా ఫైనలిస్ట్‌గా, 2018లో మిస్ దివా విజేతగా ఆమె మంచి గుర్తింపు తెచ్చుకుంది అదితి హుండియా. తనదైన ఫ్యాషన్ సెన్స్‌తో సోషల్ మీడియాలో దాదాపు 3 లక్షలకు పైగా ఫాలోవర్లను కలిగి ఉంది.
అఫీషియల్ అయిన లవ్ స్టోరీ
గత కొన్నేళ్లుగా ఇషాన్ కిషన్, అదితి హుండియా డేటింగ్‌లో ఉన్నారనే వార్తలు వినిపిస్తున్నా.. వారిద్దరూ అధికారికంగా ఎక్కడా వెల్లడించలేదు. అయితే ఈ టీ20 వరల్డ్ కప్ సమయంలో ఇషాన్ కిషన్ తాతయ్య స్వయంగా వీరిద్దరి ప్రేమ విషయాన్ని ధ్రువీకరించడంతో ఈ వార్తలకు ఫుల్ స్టాప్ పడింది. "ఇషాన్ ఎవరిని పెళ్లి చేసుకున్నా మాకు అంగీకారమే, అదితి అతని గర్ల్‌ఫ్రెండ్ అని మాకు తెలుసు" అని ఆయన ప్రకటించిన విషయం తెలిసిందే.
టీమిండియా ఫైనల్‌లో భారీ లక్ష్యాన్ని నిర్దేశించడంలో ఇషాన్ కిషన్ కీలక పాత్ర పోషించగా.. అతనికి మద్దతుగా అదితి హుండియా స్టేడియంలో ఉండి తన మద్దతును తెలపడం నెటిజన్లను ఆకట్టుకుంటోంది.