న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

శ్రీశాంత్‌కు భజ్జీ బర్త్‌డే విషెస్.. ఆ చెంప దెబ్బ గిఫ్టా అంటున్న అభిమానులు

Fans reactions after Harbhajan Singh wishes Sreesanth on his birthday

హైదరాబాద్: టీమిండియా వెటరన్ స్పీడ్ స్టార్ శ్రీశాంత్ మైదానంలో చేసే సందిడి మాములుగా ఉండదు. వికెట్ తీసిన ఆనందంలో అతిగా ప్రవర్తించి చాలాసార్లు వివాదాలకు గురయ్యాడు. ఇక 2013 ఐపీఎల్‌లో స్పాట్‌ ఫిక్సింగ్‌ ఆరోపణలతో టీమిండియాకు దూరమైన శ్రీశాంత్‌ బీసీసీఐ నిషేధంలో ఆటకు దూరమయ్యాడు. అనంతరం కోర్టు నుంచి శ్రీశాంత్ క్లీన్ చీట్ తెచ్చుకోవడంతో తన నిషేధాన్ని బీసీసీఐ అంబుడ్స్‌మన్‌ డీకే జైన్‌ ఏడేళ్లకు కుదించాడు. ఇప్పటికే ఆరేళ్ల నిషేధం పూర్తిచేసుకున్న శ్రీశాంత్ శిక్ష ఈ ఏడాది ఆగస్టులో ముగియనుంది.

అభిమానుల కుళ్లు జోకులు

ఇక భారత్ గెలిచిన రెండు వరల్డ్‌కప్‌లో సభ్యుడైన ఈ లక్కీ బౌలర్ గురువారం 38వ ఏట అడుగుపెట్టాడు. ఈ సందర్భంగా టీమిండియా వెటరన్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ ఈ కేరళ క్రికెటర్‌కు బర్త్‌డే విషెస్ తెలియజేశాడు. ‘హ్యాపీ బర్త్ డే శెంట (శ్రీశాంత్ ముద్దు పేరు).. ఈ ఏడాది నీకు మంచి జరగాలి'అని ట్వీట్ చేశాడు. అయితే భజ్జీ బర్త్‌డే ట్వీట్‌పై అభిమానులు కుళ్లు జోకులు పేల్చుతున్నారు. ఐపీల్ తొలి సీజన్‌లో ఈ ఇద్దరి మధ్య మైదానంలో జరిగిన వాగ్వాదాన్ని ప్రస్తావిస్తూ ఫన్ క్రియేట్ చేస్తున్నారు. సరదా కామెంట్స్, మీమ్స్, ఫన్నీ వీడియోలతో ట్వీట్లు చేస్తున్నారు.భజ్జీ నీ చెంప దెబ్బ అతని బర్త్‌డే గిఫ్టా? అని ఒకరంటే.. అమ్మా.. హర్భజన్ అంతా మరిచిపోయినట్టున్నాడని మరొకరు, చెంపదెబ్బతో భయపడరని గ్రహించిన భజ్జీ ప్రేమతో వచ్చాడని ఇంకొకరు కామెంట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫన్నీ ట్వీట్స్ నెట్టింట హల్‌చల్ చేస్తున్నాయి.

సంజయ్.. నాన్ క్రికెటర్స్‌తో ఎలా భోజనం చేస్తున్నారు?

చెంప చెళ్లు మనిపించిన భజ్జీ..

ఐపీఎల్ తొలి సీజన్‌లో ముంబై ఇండియన్స్‌-కింగ్స్ లెవ‌న్ పంజాబ్ జ‌ట్ల మ‌ధ్య జ‌రిగిన మ్యాచ్‌లో హ‌ర్భ‌జ‌న్ సింగ్‌, శ్రీశాంత్ మ‌ధ్య వివాదం నెల‌కొంది. ఈ మ్యాచ్‌లో భ‌జ్జీ ముంబైకీ ఆడ‌గా.. శ్రీశాంత్ పంజాబ్‌కు ప్రాతినిథ్యం వ‌హించాడు. మ్యాచ్ ముగిశాక భ‌జ్జీ.. శ్రీశాంత్‌ను చెంప‌దెబ్బ కొట్టాడు. దీంతో కెమేరాల్లో శ్రీ ఏడుస్తూ క‌న్పించాడు. అప్ప‌ట్లో ఇది సంచ‌ల‌న‌మైంది. దీనిపై ఐపీఎల్ యాజ‌మాన్యం ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. భ‌జ్జీని మిగ‌తా టోర్నీ మొత్తానికి బ్యాన్ చేసింది. అయితే త‌న ప‌రిస్థితి చేయి దాట‌డంతోనే తాను శ్రీశాంత్‌ను కొట్టాన‌ని భ‌జ్జీ త‌ర్వాత వివరణ ఇచ్చుకున్నాడు. అప్ప‌ట్లో త‌న‌కు విధించిన శిక్ష స‌రైన‌దే అని కూడా అంగీకరించాడు.

చివరిగా 2011లో..

ఐపీఎల్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌ తరఫున ప్రాతినిధ్యం వహిస్తూ.. పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో తన రెండో ఓవర్‌లో ఉద్దేశపూర్వకంగా 14 పరుగులు ఇచ్చినందుకు రూ.10 లక్షలు తీసుకున్నాడని శ్రీశాంత్‌పై ఆరోపణలు ఉన్నాయి. భారత జట్టు తరఫున శ్రీశాంత్ 27 టెస్టులు, 53 వన్డేలు, 10 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. టెస్టుల్లో 87, వన్డేల్లో 75, టీ20ల్లో ఏడు వికెట్లు తీసాడు. చివరిగా 2011లో టీమిండియాకు ప్రాతినిధ్యం వహించాడు. 2007 టీ20, 2011 వన్డే ప్రపంచకప్‌లు గెలిచిన భారత జట్టులో శ్రీశాంత్‌ ఉన్నాడు.

Story first published: Friday, February 7, 2020, 14:12 [IST]
Other articles published on Feb 7, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X