Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

విరుష్కా మీరెప్పుడంటూ.. హార్దిక్ పాండ్యా తండ్రికావడంపై పేలుతున్న జోకులు, మీమ్స్!

Fans React to Hardik Pandya, Natasa Stankovics Pregnancy Announcement with Memes

న్యూఢిల్లీ: ఎంకి పెళ్లి సుబ్బి చావు కొచ్చినదన్నట్టుంది టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ పరిస్థితి. స్టార్ ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా తండ్రి కాబోతున్న విషయం తెలిసిందే. తన కాబోయే భార్య నటాషా స్టాన్‌కోవిచ్‌ త్వరలోనే ఓ బిడ్డకు జన్మనివ్వనుందని ఆదివారం ఇన్‌స్టాగ్రామ్‌లో పాండ్యా ప్రకటించాడు. జనవరి 1న దుబాయ్‌లో సెర్బియా నటి, మోడల్‌ అయిన నటాషా, పాండ్యా నిశ్చితార్థం జరిగింది. అప్పటి నుంచి వీరిద్దరూ సహజీవనం చేస్తున్నారు. అయితే ఆదివారమే విడుదల చేసిన మరో ఫొటోలో పాండ్యా, నటాషా పూలదండలతో కనిపిస్తున్నారు. ఇది పెళ్లికి సంబంధించిన ఫొటోనా కాదా అనే విషయంపై స్పష్టత లేదు.

ఆశీర్వదించండి..

ఆశీర్వదించండి..

‘మా జీవితాల్లో కొత్త జీవితానికి స్వాగతం పలికేందుకు మేమిద్దరం ఉత్సుకతతో ఎదురుచూస్తున్నాం. మా జీవితంలోని కొత్త దశలో అడుగుపెడుతున్నందుకు ఆనందంగా ఉంది. మీ అందరి ఆశీర్వాదం, దీవెనలు కావాలి. నటాషాతో నా ప్రయాణం గొప్పగా సాగుతోంది. మున్ముందు మా బంధం మరింత బలపడుతుంది' అని నటాషాతో కలిసి దిగిన ఫొటోలను పాండ్యా పోస్ట్‌ చేశాడు.

సూపర్ స్టార్ మహేశ్ బాబు ఫేవరేట్ క్రికెటర్ ఎవరో తెలుసా?

మా ప్రయాణం అపురూపం కానుంది..

మా ప్రయాణం అపురూపం కానుంది..

నటాషా కూడా తాను గర్భవతిననే విషయాన్ని ఇన్‌స్టాలో తెలిపింది. హార్దిక్‌తో ఉన్న ఫొటోను పోస్టు చేసింది. ‘మా ఇద్దరి ప్రయాణం మరింత అపురూపంగా మారనుంది. మా జీవితాల్లోకి కొత్త ప్రాణి రానుంది. ఇద్దరం ఎంతో ఉత్కంఠతో ఉన్నాం. మీ ఆశీర్వాదం కావాల'ని నటాషా రాసింది. గుజరాత్‌కు చెందిన 26 ఏళ్ల హార్దిక్‌ పాండ్యా 2016లో భారత్‌ తరఫున అరంగేట్రం చేశాడు. ఇప్పటివరకు అతను 11 టెస్టులు, 54 వన్డేలు, 40 టీ20 మ్యాచ్‌ల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించాడు.

విరుష్కా మీరెప్పుడూ..?

ఇక పాండ్యా తండ్రి కావడంపై సోషల్ మీడియాలో జోకులు పేలుతున్నాయి. ఫన్నీ మీమ్స్ ట్రెండ్ అవుతున్నాయి. ముఖ్యంగా కెప్టెన్ విరాట్ కోహ్లీ, అతని సతీమణి అనుష్క శర్మకు ఇబ్బందిగా మారింది. లాక్‌డౌన్‌ను సద్వినియోగం చేసుకున్న పాండ్యా తండ్రి అయ్యాడని, మరీ మీరెప్పుడూ విరుష్కా? అంటూ అభిమానులు సరదాగా కామెంట్ చేస్తున్నారు. ఈ విషయాన్నే ఫన్నీ కామెంట్స్, మీమ్స్‌తో ట్రెండ్ చేస్తున్నారు. పాండ్యా తండ్రైన వార్త విని.. విరాట్ కోహ్లీ వాళ్ల కుటుంబంలో గొడవలు జరుగుతున్నాయని, వాళ్ల అమ్మ ఒత్తిడి తీసుకొస్తుందనే ఉద్దేశంతో ఉన్న మీమ్స్ వైరల్ అవుతున్నాయి.

నువ్వు మగాడ్రా పాండ్యా..!

ఇక ఏంగేజ్ మెంట్ చేసుకున్న ఐదు నెలలకే తండ్రి అవుతున్న పాండ్యాపై అభిమానులు ప్రశంసలతో కూడిన వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. మహేంద్ర సింగ్ ధోనీ, సాక్షి ఐదేళ్లకు జీవాను కంటే.. పాండ్యా ఐదు నెలలకే నటాషాను ప్రెగ్నెంట్ చేశాడని కామెంట్ చేస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ వంటి కొడుకు కోసం నటాషా-పాండ్యా కలలు కంటున్నారని కామెంట్ చేస్తున్నారు. ఐపీఎల్ లేకపోవడంతో హార్దిక్ పాండ్యా ఇంట్లో బ్యాటింగ్ చేశాడని వ్యంగ్యస్త్రాలు సంధిస్తున్నారు.

Story first published: Monday, June 1, 2020, 15:18 [IST]
Other articles published on Jun 1, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+