Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ICC T20I Rankings: టాప్ లేపిన ఇషాన్ కిషన్.. దూసుకొచ్చిన సంజూ శాంసన్!

ఐసీసీ టీ20 బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో టీమిండియా విధ్వంసకర బ్యాటర్ ఇషాన్ కిషన్ దుమ్మురేపాడు. ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026లో మెరుగైన ప్రదర్శనతో కెరీర్‌ బెస్ట్ ర్యాంక్ అందుకున్నాడు. రెండు స్థానాలు ఎగబాకి 871 రేటింగ్ పాయింట్స్‌తో రెండో స్థానంలో నిలిచాడు. మెగా టోర్నీలో ఇషాన్ కిషన్ 9 మ్యాచ్‌లు ఆడి 317 పరుగులు చేశాడు. పాకిస్థాన్, నమీబియా, న్యూజిలాండ్‌పై మూడు హాఫ్ సెంచరీలు ఉన్నాయి.

న్యూజిలాండ్‌తో ఫైనల్లో హాఫ్ సెంచరీతో సత్తా చాటిన అభిషేక్ శర్మ.. తన అగ్రస్థానాన్ని కాపాడుకున్నాడు. 875 రేటింగ్ పాయింట్స్‌తో నెంబర్ వన్ బ్యాటర్‌గా కొనసాగుతున్నాడు. ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మకు మధ్య 4 రేటింగ్ పాయింట్సే ఉన్నాయి. పాకిస్థాన్ ఓపెనర్ షాహిబ్జాదా ఫర్హాన్ ఒక స్థానం దిగజారి మూడో స్థానంలో నిలవగా.. ఫిల్ సాల్ట్, పాతుమ్ నిస్సంక, టీమ్ సీఫెర్ట్ వరుసగా టాప్-6లో కొనసాగుతున్నారు. తెలుగు తేజం తిలక్ వర్మ ఒక స్థానం దిగజారి 7వ స్థానంతో సరిపెట్టుకున్నాడు. టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ 9వ స్థానంలో నిలిచాడు.

ICC T20I Rankings Abhishek Sharma and Ishan Kishan Claim Top Two Spots Sanju Makes Huge Leap After World Cup Glory

దూసుకొచ్చిన సంజూ శాంసన్..

టీమిండియా విధ్వంసకర ఓపెనర్, టీ20 ప్రపంచకప్ 2026లో ప్లేయర్ ఆఫ్ ది టోర్నీగా నిలిచిన సంజూ శాంసన్ టీ20 ర్యాంకింగ్స్‌లో దూసుకొచ్చాడు. ఏకంగా 18 స్థానాలు ఏగబాకి 22వ స్థానంలో నిలిచాడు. ఈ టోర్నీకి ముందు 65వ స్థానంలో ఉన్న సంజూ శాంసన్.. మ్యాచ్ విన్నింగ్ ప్రదర్శనలతో 43 స్థానాలు ఎగబాకి 637 రేటింగ్ పాయింట్స్‌తో 22వ స్థానాన్ని అందుకున్నాడు. ఈ టోర్నీలో సంజూ శాంసన్ 5 ఇన్నింగ్స్‌ల్లో80.25 సగటు, 199.37 స్ట్రైక్‌రేట్‌తో 321 పరుగులు చేశాడు. వెస్టిండీస్ 97 నాటౌట్, ఇంగ్లండ్‌తో సెమీస్‌లో 89, న్యూజిలాండ్‌తో ఫైనల్లో 89 పరుగులు చేశాడు. ఒకే ఎడిషన్‌లో అత్యధిక పరుగులు చేసిన రెండో బ్యాటర్‌గా సంజూ నిలిచాడు.

అగ్రస్థానం కోల్పోయిన వరుణ్ చక్రవర్తీ..

టీమిండియా మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తీ తన అగ్రస్థానాన్ని కోల్పోయాడు. సూపర్-8 దశ నుంచి వరుణ్ తడబడటంతో 740 రేటింగ్ పాయింట్స్‌తో ఒక స్థానం దిగజారి రెండో స్థానంలో నిలిచాడు. 753 రేటింగ్ పాయింట్స్‌తో అఫ్గానిస్థాన్ స్పిన్నర్ రషీద్ ఖాన్ అగ్రస్థానాన్ని అందుకున్నాడు. జస్‌ప్రీత్ బుమ్రా ఒక స్థానం ఎగబాకి టాప్-6లో నిలిచాడు. అర్ష్‌దీప్ సింగ్ మూడు స్థానాలు దిగజారి 16వ స్థానానికి పడిపోగా.. అక్షర్ పటేల్ 6 స్థానాలు ఎగబాకి 17వ స్థానాన్ని సరిపెట్టుకున్నాడు.

ఆల్‌రౌండర్ ర్యాకింగ్స్‌లో హార్దిక్ పాండ్యా రెండో స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. సికిందర్ రాజా టాప్‌లో కొనసాగుతున్నారు. శివమ్ దూబే రెండు స్థానాలు దిగజారి 11వ స్థానానికి పడిపోయాడు.

Story first published: Wednesday, March 11, 2026, 15:06 [IST]
Other articles published on Mar 11, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+