ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఐపీఎల్ 2026 సీజన్ షెడ్యూల్‌ను భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) అధికారికంగా ప్రకటించింది. మార్చి 28 నుంచి ఈ ధనాధన్ లీగ్ మొదలవ్వనుంది. తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ)తో మన సన్‌రైజర్స్ హైదరాబాద్(ఎస్‌ఆర్‌హెచ్) తలపడనుంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది.
పలు రాష్ట్రాల్లో ఎన్నికల దృష్ట్యా 20 మ్యాచ్‌ల షెడ్యూల్‌నే బీసీసీఐ ప్రకటించింది. పశ్చిమ బెంగాల్, తమిళనాడు, అస్సాం అసెంబ్లీ ఎన్నికల తేదీలు ఖరారైన తర్వాత మిగతా మ్యాచ్‌ల షెడ్యూల్‌ను ప్రకటిస్తామని బీసీసీఐ తమ ప్రకటనలో పేర్కొంది. తొలి దశ షెడ్యూల్ ప్రకారం.. మార్చి 28 నుంచి ఏప్రిల్ 12 వరకు 20 మ్యాచ్‌లు 10 వేదికల్లో జరగనున్నాయి.

బెంగళూరు, ముంబై, గువహటి, న్యూ చండీగఢ్, లక్నో, కోల్‌కతా, చెన్నై, ఢిల్లీ, అహ్మదాబాద్, హైదరాబాద్ వేదికగా ఈ 20 ఐపీఎల్ మ్యాచ్‌లు జరగనున్నాయి. ఈ తొలి దశ టోర్నీలో మొత్తం నాలుగు డబుల్ హెడర్స్ జరగనుండగా.. మధ్యాహ్నం మ్యాచ్‌లు 03:30 గంటలకు, రాత్రి మ్యాచ్‌లు 07:30 గంటలకు ప్రారంభమవుతాయి.
శనివారం ప్రారంభ మ్యాచ్ తర్వాత ఆదివారం ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్లు తలపడతాయి. ఏప్రిల్ 4న మొదటి డబుల్ హెడర్ జరగనుంది. మధ్యాహ్నం ఢిల్లీ క్యాపిటల్స్ vs ముంబై ఇండియన్స్, రాత్రి గుజరాత్ టైటాన్స్ vs రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్‌లు జరగనున్నాయి.
బెంగళూరు వేదికగా జరిగే మ్యాచ్‌లకు కర్ణాటక ప్రభుత్వం ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ క్లియరెన్స్ ఇవ్వాల్సి ఉంది. మార్చి 13న కమిటీ సభ్యులు చిన్నస్వామి స్టేడియాన్ని సందర్శించి, మ్యాచ్ నిర్వహణ ఏర్పాట్లపై మాక్ డెమో నిర్వహించిన తర్వాత తుది నిర్ణయం తీసుకుంటారని బీసీసీఐ తమ ప్రకటనలో స్పష్టం చేసింది.
మార్చి 28: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు vs సన్‌రైజర్స్ హైదరాబాద్
మార్చి 29: ముంబై ఇండియన్స్ vs కోల్‌కతా నైట్ రైడర్స్
మార్చి 30: రాజస్థాన్ రాయల్స్ vs చెన్నై సూపర్ కింగ్స్
మార్చి 31: పంజాబ్ కింగ్స్ vs గుజరాత్ టైటాన్స్
ఏప్రిల్ 01: లక్నో సూపర్ జెయింట్స్ vs ఢిల్లీ క్యాపిటల్స్
ఏప్రిల్ 02: కోల్‌కతా నైట్ రైడర్స్ vs సన్‌రైజర్స్ హైదరాబాద్
ఏప్రిల్ 03: చెన్నై సూపర్ కింగ్స్ vs పంజాబ్ కింగ్స్
ఏప్రిల్ 04: ఢిల్లీ క్యాపిటల్స్ vs ముంబై ఇండియన్స్ (మధ్యాహ్నం 3:30)
ఏప్రిల్ 04: గుజరాత్ టైటాన్స్ vs రాజస్థాన్ రాయల్స్ (రాత్రి 7:30)
ఏప్రిల్ 05: సన్‌రైజర్స్ హైదరాబాద్ vs లక్నో సూపర్ జెయింట్స్ (మధ్యాహ్నం 3:30)
ఏప్రిల్ 05: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు vs చెన్నై సూపర్ కింగ్స్ (రాత్రి 7:30)
ఏప్రిల్ 06: కోల్‌కతా నైట్ రైడర్స్ vs పంజాబ్ కింగ్స్
ఏప్రిల్ 07: రాజస్థాన్ రాయల్స్ vs ముంబై ఇండియన్స్
ఏప్రిల్ 08: ఢిల్లీ క్యాపిటల్స్ vs గుజరాత్ టైటాన్స్
ఏప్రిల్ 09: కోల్‌కతా నైట్ రైడర్స్ vs లక్నో సూపర్ జెయింట్స్
ఏప్రిల్ 10: రాజస్థాన్ రాయల్స్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు
ఏప్రిల్ 11: పంజాబ్ కింగ్స్ vs సన్‌రైజర్స్ హైదరాబాద్ (మధ్యాహ్నం 3:30)
ఏప్రిల్ 11: చెన్నై సూపర్ కింగ్స్ vs ఢిల్లీ క్యాపిటల్స్ (రాత్రి 7:30)
ఏప్రిల్ 12: లక్నో సూపర్ జెయింట్స్ vs గుజరాత్ టైటాన్స్ (మధ్యాహ్నం 3:30)
ఏప్రిల్ 12: ముంబై ఇండియన్స్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (రాత్రి 7:30)