For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IPL 2026: సన్‌రైజర్స్ హైదరాబాద్ షెడ్యూల్ ఇదే!

ఐపీఎల్ 2026 సీజన్ షెడ్యూల్‌ను భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) అధికారికంగా ప్రకటించింది. పలు రాష్ట్రాల్లో ఎన్నికల నేపథ్యంలో 20 మ్యాచ్‌ల షెడ్యూల్‌నే వెల్లడించింది. మార్చి 28 నుంచి ఈ ధనాధన్ లీగ్ మొదలవ్వనుంది.

పశ్చిమ బెంగాల్, తమిళనాడు, అస్సాం అసెంబ్లీ ఎన్నికల తేదీలు ఖరారైన తర్వాత మిగతా మ్యాచ్‌ల షెడ్యూల్‌ను ప్రకటిస్తామని బీసీసీఐ తమ ప్రకటనలో పేర్కొంది. ఈ తొలి దశ షెడ్యూల్ ప్రకారం.. మార్చి 28 నుంచి ఏప్రిల్ 12 వరకు 20 మ్యాచ్‌లు 10 వేదికల్లో జరగనున్నాయి. ఫస్ట్ ఫేజ్ షెడ్యూల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ మొత్తం నాలుగు మ్యాచ్‌లు ఆడనుంది. ఇందులో మూడు మ్యాచ్‌లు ఇతర జట్ల వేదికల్లో ఆడనుండగా.. ఒకే ఒక్క మ్యాచ్ హైదరాబాద్ వేదికగా లక్నో సూపర్ జెయింట్స్‌తో తలపడనుంది.

మార్చి 28న జరిగే తొలి మ్యాచ్‌లోనే డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ)తో జరిగే మ్యాచ్‌తో మన సన్‌రైజర్స్ హైదరాబాద్(ఎస్‌ఆర్‌హెచ్)తమ క్యాంపైన్‌ను ప్రారంభించనుంది. అయితే చిన్నస్వామి స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్‌ల నిర్వహణకు కర్ణాటక ప్రభుత్వం ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ క్లియరెన్స్ ఇవ్వాల్సి ఉంది.

ఆర్‌సీబీతో తొలి మ్యాచ్ ఆడనున్న సన్‌రైజర్స్ హైదరాబాద్.. కోల్‌కతాతో ఏప్రిల్2న, లక్నో సూపర్ జెయింట్స్ ఏప్రిల్ 3న, ఏప్రిల్ 11న పంజాబ్ కింగ్స్‌తో ఆడనుంది. హైదరాబాద్‌ వేదికగా లక్నోతో జరిగే మ్యాచ్‌ మధ్యాహ్నం 3.30 గంటలకు ప్రారంభం కానుంది. పంజాబ్ కింగ్స్‌తో జరిగే మ్యాచ్ కూడా మధ్యాహ్నం 3.30 గంటలకు జరగనుంది.

SRH IPL 2026 Schedule Sunrisers Hyderabad to Face RCB in Season Opener at Chinnaswamy Stadium

సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫస్ట్ ఫేజ్ షెడ్యూల్

మార్చి 28: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు vs సన్‌రైజర్స్ హైదరాబాద్ (రాత్రి 7:30, బెంగళూరు)

ఏప్రిల్ 02: కోల్‌కతా నైట్ రైడర్స్ vs సన్‌రైజర్స్ హైదరాబాద్ (రాత్రి 7:30, కోల్‌కతా)

ఏప్రిల్ 05: సన్‌రైజర్స్ హైదరాబాద్ vs లక్నో సూపర్ జెయింట్స్ (మధ్యాహ్నం 3:30, హైదరాబాద్) - హోమ్ మ్యాచ్

ఏప్రిల్ 11: పంజాబ్ కింగ్స్ vs సన్‌రైజర్స్ హైదరాబాద్ (మధ్యాహ్నం 3:30, న్యూ చండీగఢ్)

ఐపీఎల్ 2026 వేలంలో సన్‌రైజర్స్ కొనుగోలు చేసిన ఆటగాళ్లు:

సలీల్ అరోరా(రూ.1.50 కోట్లు), శివాంగ్ కుమార్(రూ.30 లక్షలు), క్రెయిన్స్ ఫులెట్రా(రూ.30 లక్షలు), సాకిబ్ హుస్సేన్(రూ.30 లక్షలు), ఓంకార్ తర్మలె(రూ.30 లక్షలు), ప్రఫుల్ హింగే(రూ.30 లక్షలు), అమిత్ కుమార్(రూ.30 లక్షలు), లియామ్ లివింగ్ స్టోన్(రూ.13 కోట్లు), శివమ్ మావి(రూ.75 లక్షలు), జాక్ ఎడ్వర్డ్స్(రూ.3 కోట్లు).

సన్‌రైజర్స్ హైదరాబాద్ రిటైన్ లిస్ట్:

ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, అనికేత్ వర్మ, ఆర్ సమరన్, ఇషాన్ కిషన్, హెన్రీచ్ క్లాసెన్, నితీష్ కుమార్ రెడ్డి, హర్ష్ దూబే, కామిందు మెండీస్, హర్షల్ పటేల్, బ్రైడన్ కార్స్, ప్యాట్ కమిన్స్, జయదేవ్ ఉనాద్కత్, ఇషాన్ మలింగా, జీషన్ అన్సారీ.

Story first published: Wednesday, March 11, 2026, 20:40 [IST]
Other articles published on Mar 11, 2026
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+