Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఊరి క్రికెట్ డీఆర్ఎస్ చూశారా? కడుపుబ్బా నువ్వుతారు..!

Ravichandran Ashwin Posts Funny Video Of Kids Enacting DRS

హైదరాబాద్: ఊరి క్రికెట్ డీఆర్ఎస్ ఏంటనుకుంటున్నారా? అదేనండి అంతర్జాతీయ క్రికెటర్‌లో ఉపయోగించే అంపైర్ డిసిషన్ రివ్యూ సిస్టమ్(డీఆర్ఎస్)ను ఊరి క్రికెట్‌లో ఉపయోగించడమే. అబ్బా..ఊరి క్రికెట్‌లో డీఆర్ఎస్ టెక్నాలజీ కూడా ఉందా? ఎక్కడా? అదే ఊరని మాత్రం అడగకండి? ఎందుకంటే.. డీఆర్ఎస్‌పై ఫన్నీగా రూపొందించిన టిక్‌టాక్ వీడియో మాత్రమే ఇది. ప్రస్తుతం నెట్టింట వైరల్ అయిన ఈ వీడియో ప్రతి ఒక్కరిని కడుపుబ్బా నవ్విస్తుంది. ఆఖరికి టీమిండియా సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కూడా ఇది చూసి నవ్వు ఆపుకోలేకపోయాడు.

లాక్‌డౌన్‌తో కాలేజీలు, స్కూళ్లు లేకపోవడంతో చాలా మంది టిక్‌టాక్‌లో మునిగితేలుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఓ ఐదుగురు కుర్రాళ్లు క్రియేటివ్‌గా డీఆర్‌ఎస్‌ స్పూఫ్ చేస్తూ ఫన్నీగా రూపొందించిన వీడియో అందరిని ఆకట్టుకుంటుంది. అంతర్జాతీయ క్రికెట్‌లోకి డీఆర్‌ఎస్ (అంపైర్ డిసిషెన్ రివ్యూ సిస్టమ్)ని 2008లో ఐసీసీ ప్రవేశపెట్టింది.

ఫీల్డ్ అంపైర్ ఇచ్చే ఔట్ లేదా నాటౌట్ నిర్ణయంపై సందేహాలుంటే ఆటగాళ్లు ఆ నిర్ణయాన్ని డీఆర్‌ఎస్ ద్వారా సవాల్ చేయచ్చు. బ్యాటింగ్ టీమ్ నుంచి స్ట్రైకింగ్‌లో ఉన్న బ్యాట్స్‌మెన్.. ఫీల్డింగ్ టీమ్ నుంచి ఆ జట్టు కెప్టెన్ డీఆర్‌ఎస్ కోరేందుకు అర్హుడు. అయితే.. డీఆర్‌ఎస్ ద్వారా నిర్ణయాన్ని ప్రకటించడానికి స్లో మోషన్ కెమెరా, స్నికో మీటర్, స్టంప్ మైక్రోఫోన్ ఉపయోగిస్తారు.

అయితే ఇవేవి లేకుండానే ఈ ఊరి క్రికెట్‌లో అంపైర్ నిర్ణయాన్ని సమీక్షించారు. ఆఫ్ స్టంప్‌కి వెలుపలగా పడిన బంతిని బ్యాట్స్‌మెన్ డిఫెన్స్ చేసేందుకు ప్రయత్నించాడు. కానీ.. బ్యాట్‌కి అందని బంతి నేరుగా వికెట్ కీపర్ చేతుల్లోకి వెళ్లగా.. ఔట్ అంటూ ఫీల్డింగ్ టీమ్ అప్పీల్ చేసింది. దాంతో.. అంపైర్ ఔటని వేలెత్తేశాడు. కానీ.. ఆ ఔట్ నిర్ణయంపై సందేహం వ్యక్తం చేసిన బ్యాట్స్‌మెన్ డీఆర్‌ఎస్ కోరగా.. ఫన్నీగా స్లో మోషన్‌లో పరిశీలించిన అంపైర్ తన ఔట్ నిర్ణయాన్ని మార్చుకున్నాడు. ఆ స్లోమోషన్‌లో చూపించే విధానం అందరిని కడుపుబ్బా నవ్విస్తుంది. ఈ వీడియోను షేర్ చేసిన అశ్విన్.. నవ్వు ఆపుకోలేకపోతున్నాననే ఎమోజీని జత చేశాడు.

Story first published: Monday, June 1, 2020, 14:08 [IST]
Other articles published on Jun 1, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+