న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

శరీర రంగే కాదు.. మతం కారణంగా కూడా వివక్ష: ఇర్ఫాన్ పఠాన్

Irfan Pathan Says Racism Not Restricted To Skin Colour, Discrimination Based On Faith Is Also Racism

న్యూఢిల్లీ: అమెరికా నల్లజాతీయుడు జార్జ్ ఫ్లాయిడ్ హత్యోదంతం తర్వాత 'బ్లాక్‌ లైవ్స్ మాటర్స్'పేరుతో వర్ణ వివక్షపై తీవ్ర చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే. జాతి వివక్షకు వ్యతిరేకంగా ప్రపంచవ్యాప్తంగా నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. క్రీడాకారులు సైతం పెద్ద సంఖ్యలో ఈ విషయంపై స్పందిస్తున్నారు. తాజాగా టీమిండియా మాజీ ఆల్​రౌండర్​ ఇర్ఫాన్ పఠాన్ సైతం వివక్ష అంశంపై గళమెత్తాడు. వివక్ష కేవలం వర్ణానికే పరిమితం కాలేదని, మతం పేరిట కూడా వివక్షను ఎదుర్కొంటున్నారని మంగళవారం ట్వీట్ చేశాడు.

'శరీర రంగుకే వివక్ష పరిమితం కాలేదు. ఇతర మతస్థులనే కారణంతో సమాజంలో ఓ ఇల్లును కొననివ్వకపోవడం కూడా వివక్షలో భాగమే'అని ఇర్ఫాన్ ట్వీట్‌లో పేర్కొన్నాడు.

దక్షణాది ఆటగాళ్లు వర్ణ వివక్షకు గురవుతారు..

దక్షణాది ఆటగాళ్లు వర్ణ వివక్షకు గురవుతారు..

అంతకుముందు ఓ వార్తా సంస్థతో మాట్లాడుతూ.. దేశవాళీ క్రికెట్‌లో దక్షిణాది ప్లేయర్లు వర్ణ వివక్షకు గురవుతారని భారత మాజీ ఆల్‌రౌండర్‌ ఇర్ఫాన్‌ పఠాన్‌ తెలిపాడు. ఉత్తరాది, పశ్చిమ ప్రాంతాలకు మ్యాచ్‌ల నిమిత్తం వెళ్లినపుడు వారు వర్ణానికి సంబంధించిన వ్యాఖ్యల్ని ఎదుర్కోవాల్సి వస్తుందని పేర్కొన్నాడు. ఈ అంశంపై ప్రజల్లో అవగాహన కల్పించాల్సిన అవసరముందని పఠాన్‌ అభిప్రాయపడ్డాడు.

‘దక్షిణాది నుంచి వచ్చిన క్రికెటర్లలో కొందరు ఉత్తర భారతంలో వర్ణ వివక్షకు గురవుతుంటారు. అక్కడి ప్రజలు జాత్యహంకారులు కాదు కానీ ఏదో ఒకటి చేసి, ఎవరో ఒకర్ని వింత పేరుతో పిలవడం ద్వారా అందరిలో గుర్తింపు తెచ్చుకోవాలని అలా ప్రవర్తిస్తారు' అని పఠాన్‌ అన్నాడు.

 ఐపీఎల్‌లో వర్ణ వివక్ష..

ఐపీఎల్‌లో వర్ణ వివక్ష..

మరోవైపు ఐపీఎల్‌ సందర్భంగా వెస్టిండీస్ ప్లేయర్‌ డారెన్‌ సామీ వర్ణ వివక్ష వ్యాఖ్యలకు గురైన అంశం తనకు తెలియదని ఇర్ఫాన్‌ పఠాన్‌ పేర్కొన్నాడు. ‘2014లో సామీతో పాటు నేనూ సన్‌రైజర్స్‌కు ఆడాను. అప్పట్లో ఈ అంశంపై ఎలాంటి చర్చ జరుగలేదు. ఇది నిజంగా జరిగి ఉంటే కచ్చితంగా చర్చనీయాంశమయ్యేది. కాబట్టి నాకు దీనిపై అవగాహన లేదు' అని ఇర్ఫాన్‌ వివరించాడు. అప్పట్లో రైజర్స్‌కు ప్రాతినిధ్యం వహించిన పార్థివ్‌ పటేల్, వేణుగోపాలరావు కూడా సామీపై చేసిన వర్ణ వివక్ష వ్యాఖ్యలు తమ దృష్టికి రాలేదని పేర్కొన్నారు. ఇక తన కెరీర్​లో 29 టెస్టులు, 120 వన్డేలు, 24 టీ20లు ఆడిన పఠాన్.. జట్టుకు దూరమైన చాలా కాలం తర్వాత ఈ ఏడాది మొదట్లో క్రికెట్​కు రిటైర్మెంట్ ప్రకటించాడు.

కొడుకు చేతిలో హత్యకు గురైన మాజీ క్రికెటర్

క్షమాపణలు చెప్పండి..

క్షమాపణలు చెప్పండి..

వర్ణ వివక్షకు గురయ్యానంటూ వెస్టిండీస్‌ మాజీ కెప్టెన్‌ డారెన్‌ స్యామీ చేసిన వ్యాఖ్యల వివాదం ముదిరింది. 2013-14 సీజన్లలో సన్‌రైజర్స్‌కు ప్రాతినిధ్యం వహించినప్పుడు సహచర ఆటగాళ్లు తనను ‘కాలూ' (నల్లోడు) అంటూ పిలిచారని, అప్పట్లో దాని అర్థం తనకు తెలీదన్న సామీ... ఇప్పుడు వారంతా తనకు క్షమాపణ చెప్పాలని కోరుతున్నాడు.

‘నన్ను అప్పట్లో ఆ మాట ఎవరెవరు అన్నారో వారందరూ నాతో మాట్లాడే ప్రయత్నం చేయండి. మీలో చాలా మంది దగ్గర నా ఫోన్‌ నంబర్‌ ఉంది. ఇతర సోషల్‌ మీడియా కూడా ఉంది. మీరేం అన్నారో మీకు తెలుసు. రంగు గురించి మాట్లాడటం అంటే అది ఏ రూపంలోనైనా వివక్షగానే భావించాలి. నేను చాలా బాధపడుతున్నాను. వేర్వేరు జట్లకు ఆడిన సమయంలో డ్రెస్సింగ్‌ రూమ్‌కు సంబంధించి నాకు ఎన్నో మధుర జ్ఞాపకాలు ఉన్నాయి. అందరినీ నా సోదరుల్లా భావించాను. ఈ అంశంలో మీరు నాకు క్షమాపణ చెప్పడంలో తప్పు లేదు' అని సామీ ఓ వీడియోను పోస్ట్ చేశాడు.

నల్లోడా అంటూ ఇషాంత్ పోస్ట్..

నల్లోడా అంటూ ఇషాంత్ పోస్ట్..

అప్పటి సన్‌రైజర్స్ ఆటగాళ్లంతా సామీ వర్ణ వివక్షవ్యాఖ్యలు తమకు తెలియదంటున్నా.. పాత ఇన్‌స్టాగ్రామ్‌ పోస్ట్‌లను బట్టి చూస్తే వర్ణ వివక్ష వాస్తవమేనని తెలుస్తోంది. సహచరులతో కలిసి దిగిన నాటి ఫోటోలో ఇషాంత్‌ శర్మ... ‘నేను, భువీ, కాలూ, గన్‌ సన్‌రైజర్‌ (స్టెయిన్‌)' అంటూ పోస్ట్‌ చేశాడు. ఇక 2014లో వీవీఎస్ లక్ష్మణ్ బర్త్‌డే విషెస్ తెలియజేస్తూ సామీ తనను తాను కాలుగా అభివర్ణించుకున్నాడు.

బంతిపై ఉమ్మి రుద్దితే 5 పరుగుల ఫైన్‌.. కరోనా సబ్‌స్టిట్యూట్‌కు అనుమతి: ఐసీసీ

Story first published: Wednesday, June 10, 2020, 14:17 [IST]
Other articles published on Jun 10, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X