న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

కొడుకు చేతిలో హత్యకు గురైన మాజీ క్రికెటర్

Son Aswin held for killing his father and ex-Kerala cricketer Jayamohan Thampi

తిరువనంతపురం: కేరళ మాజీ రంజీ క్రికెటర్ కె. జయమోహన్ తంపి కొడుకు చేతిలో దారుణ హత్యకు గురయ్యాడు. గత శనివారం అనుమానస్పద స్థితిలో ఇంట్లో శవమైన కనిపించిన జయమోహన్.. మధ్యం మత్తులో ఉన్న కుమారుడితో నెలకొన్న గొడవతో హత్యకు గురయ్యాడని పోలీసులు వెల్లడించారు.

తిరువనంతపురంలోని ఆయన నివాసం నుంచి దుర్వాసన వెలువడుతున్నట్లు స్థానికులు సమాచారం ఇవ్వడంతో కుళ్ళిన స్థితిలో ఉన్న జయమోహన్ శవాన్ని పోలీసులు గుర్తించారు. అనుమానంతో అతని కొడుకు అశ్విన్‌ను అదుపులోకి తీసుకొని విచారించగా అసలు వ్యవహారం బయటపడింది. ఆ వివరాలను పోలీసులు మీడియాకు తెలిపారు.

'తండ్రీ కొడుకులకు ప్రతీరోజు ఇంట్లోనే మద్యం తాగే అలవాటు ఉంది. శనివారం కూడా మధ్యం సేవించారు. మరింత లిక్కర్ కోసం జయమోహన్ డెబిట్ కార్డ్ నుంచి మరిన్ని డబ్బులు విత్‌డ్రా చేస్తానని అశ్విన్ చెప్పాడు. దీనికి జయమోహన్ అంగీకరించకపోవడంతో ఇద్దరి మధ్య గొడవనెలకొంది. ఇంటి వరండాలో వాగ్వాదానికి దిగడంతో తంపి కిందపడిపోయాడు.

ఆగ్రహంతో ఉన్న అశ్విన్ అతని తలను నేలకు గట్టిగా కొట్టాడు. ఇంట్లోకి లాక్కెళ్లి పక్కకు పడేశాడు. జయమోహన్ మరణించేవరకు అక్కడే ఉండి పూటుగా మద్యం సేవించి అక్కడే పడుకున్నాడు.' అని ఈ కేసును విచారిస్తున్న ఓ పోలీస్ అధికారి చెప్పుకొచ్చారు. వికెట్ కీపర్-బ్యాట్స్‌మన్ అయిన తంపి.. కేరళ తరఫున 1979-182 రంజీ ట్రోఫీ ఆడాడు. ఆరు ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లకు ప్రాతినిథ్యం వహించాడు.

నల్లోడా అని పిలిచిందెవరో వారికి తెలుసు.. పేర్లు బయట పెట్టకముందే క్షమాపణలు చెప్పండి: డారెన్ సామీనల్లోడా అని పిలిచిందెవరో వారికి తెలుసు.. పేర్లు బయట పెట్టకముందే క్షమాపణలు చెప్పండి: డారెన్ సామీ

Story first published: Wednesday, June 10, 2020, 14:15 [IST]
Other articles published on Jun 10, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X