న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఆ ఘనత సాధించిన నాలుగో ఇండియన్.. తన సక్సెస్ కారణాలేంటో చెప్పిన దీపక్ హుడా

Inida vs Ireland T20I series: Deepak Hooda Became Fourth Indian to Achieve Century in T20Is

టీ20 ఇంటర్నేషనల్లో సెంచరీ చేసిన నాలుగో ఇండియా ప్లేయర్‌గా దీపక్ హుడా నిలిచాడు. నిన్న ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో హుడా ఈ ఫీట్ సాధించాడు. ఇక ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ఎలాగైతే సత్తా చాటానో.. ఇంటర్నేషనల్ స్థాయిలో అలాగే ఆడాలనుకుంటున్నా అని దీపక్ హుడా తెలిపాడు. ఈ ఏడాది ఫిబ్రవరిలో శ్రీలంకపై దీపక్ హుడా టీ20ల్లో అరంగేట్రం చేశాడు. ఇక మంగళవారం ఐర్లాండ్‌తో జరిగిన రెండో టీ20లో ఐర్లాండ్‌పై సెంచరీ బాదాక.. టీమిండియా తరఫున సురేష్ రైనా, రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ తర్వాత సెంచరీ చేసిన నాలుగో ఆటగాడిగా నిలిచాడు. ఇక హార్దిక్ పాండ్యా నేతృత్వంలోని భారత్ రెండు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో ఐర్లాండ్‌పై క్లీన్ స్వీప్ చేసింది.

ఐపీఎల్లో రాణించినట్లే ఇంటర్నేషనల్లో కూడా..

ఐపీఎల్లో రాణించినట్లే ఇంటర్నేషనల్లో కూడా..

'నిజం చెప్పాలంటే.. నేను ఐపీఎల్లో బాగా రాణించి ఇండియా జట్టులోకి వచ్చాను. ఐపీఎల్ లాంటి ప్రదర్శననే ఇక్కడ కూడా అనుసరించాలనుకుంటున్నాను. నా ఇంటెంట్ ప్రకారం నేను హ్యాపీగా ఉన్నాను' అని హుడా మ్యాచ్ అనంతరం జరిగిన ప్రజెంటేషన్ కార్యక్రమంలో చెప్పాడు. ఇక ఈ సిరీస్లో అతను ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు అందుకున్నాడు. ఇక తాను సక్సెస్ కావడానికి అతను రీజన్ పేర్కొంటూ.. 'నాకు దూకుడుగా ఆడటం ఇష్టం. అవసరమైనంత మేరకు హిట్టింగ్ చేస్తా. అలాగే ఈ మధ్య నా బ్యాటింగ్ ఆర్డర్లో మార్పులు జరిగాయి. నేను కాస్త ముందే బ్యాటింగ్‌కు దిగుతున్నాను. కాబట్టి క్రీజులో కుదురుకోవడానికి తగినంత టైం కూడా దొరుకుతుంది.' అని హుడా పేర్కొన్నాడు. ఇక ఐర్లాండ్‌‌తో సిరీస్లో అతను రెండు మ్యాచ్‌లలో 151పరుగులు చేశాడు. హుడా ఈ ఏడాది ఐపీఎల్‌లో లక్నో సూపర్ జెయింట్స్ తరఫున అద్భుతంగా ఆడాడు. అతను 15 మ్యాచ్‌ల్లో 136.67 స్ట్రైక్ రేట్‌తో 451పరుగులు చేశాడు. ఐపీఎల్లో ఆకట్టుకునే ప్రదర్శన ద్వారా హుడా భారత జట్టులోకి ఎంపికయ్యాడు.

ఉత్కంఠగా సాగిన రెండో టీ20

ఉత్కంఠగా సాగిన రెండో టీ20

ఐర్లాండ్ పర్యటనలో భాగంగా మంగళవారం రాత్రి ఉత్కంఠగా సాగిన హై స్కోరింగ్ రెండో టీ20లో భారత్ 4పరుగుల తేడాతో గెలుపొందింది. ఓటమి ఖాయమనుకున్న పరిస్థితుల్లో కశ్మీర్ సంచలనం ఉమ్రాన్ మాలిక్ అద్భుతంగా బౌలింగ్‌ చేయడంతో భారత్ విజయాన్నందుకుంది. చిన్న బౌండరీలు కలిగిన మైదానం కావడంతో ఇరు జట్ల బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగారు. దాంతో అభిమానులు సిక్సర్లు, ఫోర్ల వర్షంతో తడిసి ముద్దయ్యారు.

YS Jagan పదవుల పంపకం... బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డికి కీలక పదవి *Politics | Telugu Oneindia
దీపక్ హుడా, సంజూ శాంసన్ రికార్డ్ భాగస్వామ్యం

దీపక్ హుడా, సంజూ శాంసన్ రికార్డ్ భాగస్వామ్యం

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 225 పరుగుల భారీ స్కోరు సాధించింది. చేసింది. దీపక్ హుడా (57 బంతుల్లో 9 ఫోర్లు, 6 సిక్స్‌లతో 104) సెంచరీతో రాణించగా.... సంజూ శాంసన్ (42 బంతుల్లో 9 ఫోర్లు, 4 సిక్స్‌లతో 77) హాఫ్ సెంచరీతో రాణించాడు. ఈ ఇద్దరు (రెండో వికెట్‌కు 176 పరుగుల) రికార్డు భాగస్వామ్యాన్ని అందించారు. అనంతరం ఐర్లాండ్ 221పరుగులు చేసి ఓటమిపాలైంది. ఆ జట్టులో ఓపెనర్లు పాల్ స్టిర్లింగ్(18 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్‌లతో 40), ఆండీ బాల్‌బిర్నీ(37 బంతుల్లో 3 ఫోర్లు, 7 సిక్స్‌లతో 60)టాప్ స్కోరర్లుగా నిలిచారు. హరీ టెక్టర్(28 బంతుల్లో 5 ఫోర్లతో 39), జార్జ్ డాక్‌రెల్(16 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లతో 34 నాటౌట్) చివర్లో చెలరేగారు. భారత బౌలర్లలో భువనేశ్వర్ కుమార్, హర్షల్ పటేల్, రవి బిష్ణోయ్, ఉమ్రాన్ మాలిక్ తలో వికెట్ తీసారు.

Story first published: Wednesday, June 29, 2022, 8:13 [IST]
Other articles published on Jun 29, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X