న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

INDvsNZ : రెండు నెలల్లో అంతా మారిపోయింది.. టీమిండియాకు దూరమైన స్టార్లు వీళ్లే!

These players fail to get place in INDvsNZ ODI Squad

శ్రీలంకపై టీ20, వన్డే సిరీసులను నెగ్గిన భారత జట్టు.. ఇప్పుడు కివీస్‌తో సిరీస్‌కు రెడీ అవుతోంది. అయితే సరిగ్గా రెండు నెలల క్రితం కూడా ఈ రెండు జట్లు తలపడ్డాయి. టీ20 వరల్డ్ కప్ ముగిసిన తర్వాత న్యూజిల్యాండ్ పర్యటనకు భారత జట్టు వెళ్లిన సంగతి తెలిసిందే. ఆ పర్యటనలో భారత జట్టులో కీలక పాత్ర పోషించిన కొందరు ఆటగాళ్ల తలరాత ఈ రెండు నెలల్లోనే మారిపోయింది. ఇప్పుడు వాళ్లు టీమిండియాకు దూరమైపోయారు. మళ్లీ జట్టులో పునరాగమనం చేయడం కూడా అసాధ్యంగా కనిపిస్తోంది.

శిఖర్ ధవన్

శిఖర్ ధవన్

చివరగా భారత్, న్యూజిల్యాండ్ ఆడినప్పుడు భారత జట్టుకు సారధ్యం వహించిన ప్లేయర్ శిఖర్ ధవన్. ఆ సిరీస్‌లో అంతంతమాత్రంగానే రాణించిన ధవన్ ఆ తర్వాత పూర్తిగా ఫామ్ కోల్పోయాడు. వన్డే వరల్డ్ కప్ ఉన్న ఏడాదిలో ఫామ్‌లో లేని ఓపెనర్ వల్ల ఏం జరుగుతుందో గతేడాది టీ20 వరల్డ్ కప్‌లో కనిపించింది.

అదే తప్పు మళ్లీ రిపీట్ చేయకుండా ఉండేందుకు భారత సెలెక్టర్లు ప్రయత్నిస్తున్నారు. అదే సమయంలో అద్భుతంగా రాణిస్తూ వచ్చిన గిల్ ఈ అవకాశాన్ని రెండు చేతులా అందిపుచ్చుకున్నాడు. దీంతో ధవన్ జట్టుకు దూరమయ్యాడు. ఇప్పుడు కివీస్‌తో సిరీస్‌లో కూడా అతను ఆడటం లేదు.

 దీపక్ హుడా

దీపక్ హుడా

న్యూజిల్యాండ్‌లో ఆడి ఇప్పుడు మళ్లీ వన్డే జట్టుకు దూరమైన మరో ఆటగాడు దీపక్ హుడా. గతేడాది మొత్తం పది వన్డేల్లో హుడాకు అవకాశం వచ్చింది. వీటిలో ఏడు ఇన్నింగ్స్‌లలో బ్యాటింగ్ చేసిన అతను 153 పరుగులు చేశాడు. అలాగే మూడు వికెట్లు కూడా తీసుకున్నాడు. అయితే హార్దిక్ పాండ్యా, వాషింగ్టన్ సుందర్, షాబాజ్ అహ్మద్ తదితరులు జట్టులో ఉండటంతో హుడా అవసరం లేకుండా పోయింది. ఈ క్రమంలో అతన్ని వన్డే జట్టు నుంచి సెలెక్టర్లు తప్పించారు. అయితే టీ20 జట్టులో మాత్రం అతనికి అవకాశం దక్కింది.

అర్షదీప్ సింగ్

అర్షదీప్ సింగ్

భారత్, కివీస్ చివరగా తలపడిన సిరీస్‌లోనే అర్షదీప్ సింగ్ కూడా వన్డే అరంగేట్రం చేశాడు. ఆ సిరీస్‌లో మూడు మ్యాచుల్లోనూ ఆడిన అతను తొలి వికెట్ తీసుకోవడంలో మాత్రం విఫలమయ్యాడు. దానికితోడు పరుగులు కూడా బాగానే ఇచ్చాడు. దీంతో అతన్ని వన్డేలకు దూరంగా ఉంచాలని టీం మేనేజ్‌మెంట్ భావించినట్లు కనిపిస్తోంది.

చివరి అవకాశం అన్నట్లుగా శ్రీలంక సిరీస్‌కు కూడా అతన్ని ఎంపిక చేశారు. కానీ ఈ వన్డే సిరీస్‌లో ఒక్క మ్యాచ్‌లో కూడా ఆడే ఛాన్స్ అర్షదీప్‌కు దక్కలేదు. షమీ, సిరాజ్, ఉమ్రాన్ ఉండగా వన్డేల్లో అర్షదీప్‌కు అవకాశం రావడం కష్టంగానే కనిపిస్తోంది.

Story first published: Monday, January 16, 2023, 22:24 [IST]
Other articles published on Jan 16, 2023
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X