Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

హార్దిక్ పాండ్యా చెత్త కెప్టెన్సీనే టీమిండియా కొంపముంచింది: వసీం జాఫర్

 Wasim Jaffer says India probably could have used 2 more overs of Deepak Hooda

న్యూఢిల్లీ: హార్దిక్ పాండ్యా చెత్త కెప్టెన్సీ కారణంగానే న్యూజిలాండ్‌తో తొలి టీ20లో టీమిండియా ఓటమి పాలైందని మాజీ క్రికెటర్ వసీం జాఫర్ అన్నాడు. పరిస్థితులకు తగ్గట్లు బౌలర్లను ఉపయోగించుకోవడంలో హార్దిక్ విఫలమయ్యాడని తెలిపాడు. న్యూజిలాండ్‌తో శుక్రవారం జరిగిన తొలి టీ20లో సమష్టిగా విఫలమైన టీమిండియా 21 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఈ మ్యాచ్ ఫలితంపై ఈఎస్‌పీఎన్‌ క్రిక్‌ఇన్‌ఫోతో మాట్లాడిన వసీం జాఫర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. స్పిన్‌కు అనుకూలిస్తున్న రాంచీ వికెట్‌పై దీపక్ హుడాతో మరో రెండు ఓవర్లను హార్దిక్ బౌలింగ్ చేయించాల్సిందని అభిప్రాయపడ్డాడు.

స్పిన్నర్లతో వేయించాల్సింది..

స్పిన్నర్లతో వేయించాల్సింది..

'దీపక్ హుడాతో మరిన్ని ఓవర్లు వేయించాల్సింది. స్పిన్‌కు అనుకూలిస్తున్న వికెట్‌పై కుల్దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. ఇరు జట్లలోని స్పిన్నర్లు రాణించారు. అయితే టీమిండియా స్పిన్నర్లును ఇంకాస్త ఎక్కువగా ఉపయోగించుకుంటే మెరుగైన ఫలితం వచ్చేదేమోననిపించింది. ఎందుకంటే ఈ వికెట్‌పై పేసర్లు ధారళంగా పరుగులిచ్చారు.'అని వసీం జాఫర్ చెప్పుకొచ్చాడు.

 బ్యాటింగ్ ఈజీ అవుతుందని..

బ్యాటింగ్ ఈజీ అవుతుందని..

ఇక టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోవడం కూడా హార్దిక్ చేసిన ఘోర తప్పిదమని జాఫర్ అభిప్రాయపడ్డాడు. పిచ్‌ను సరిగ్గా రీడ్ చేయలేకపోయాడని చెప్పాడు. చేజింగ్‌లో బ్యాటింగ్ ఈజీ అవుతుందని హార్దిక్ భావించాడని, కానీ ప్రతికూల పరిస్థితులు ఎదురయ్యాయని తెలిపాడు. 'డ్యూ ప్రభావం నేపథ్యంలో సెకండ్ బ్యాటింగ్ ఈజీగా ఉంటుందని టీమిండియా భావించినట్లుంది. కానీ డ్యూ పెద్దగా కనిపించలేదు. బంతి బాగా స్పిన్ అయ్యింది. పిచ్ అలా ఉంటుందని భారత్ ఊహించలేకపోయింది. ప్రతీ విభాగంలో న్యూజిలాండ్.. భారత్ కంటే మెరుగైన ప్రదర్శన కనబర్చింది.

పృథ్వీ షాకు అవకాశం ఇవ్వాలి..

పృథ్వీ షాకు అవకాశం ఇవ్వాలి..

రెండో టీ20లో టీమిండియా బ్యాటింగ్ డెప్త్ పెంచుకోవాలని జాఫర్ సూచించాడు. టీ20 ఫార్మాట్‌లో తడబడుతున్న ఉమ్రాన్ మాలిక్ స్థానంలో పృథ్వీ షా, జితేశ్ శర్మలను తీసుకోవాలని జాఫర్ సలహా ఇచ్చాడు. 'బౌలింగ్‌లో వేగం మినహా ఉమ్రాన్ మాలిక్ టీ20 ఫార్మాట్‌లో తడబడుతున్నాడు. తొలి టీ20లోనూ పిచ్‌కు సూట్ అయిన కట్టర్స్‌ వేయలేకపోయాడు. ఇలాంటి పిచ్‌లపై ఎవరైనా గంటకు 145 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేస్తుంటే ఆడటానికి బ్యాటర్లు ఇష్టపడుతారు. ఎందుకంటే బంతి బ్యాట్‌పైకి సులువుగా వస్తుంది. కాబట్టి ఉమ్రాన్‌కు బదులు జితేశ్ శర్మ, పృథ్వీ షాలను జట్టులోకి తీసుకోవడం ముఖ్యం. జితేశ్ శర్మ అయితే టీమ్ బ్యాటింగ్ డెప్త్ పెరుగుతుంది. ఈ వైఫల్యం నుంచి టీమిండియా గట్టెక్కాలంటే ఎక్స్‌ట్రా బ్యాటర్‌తో బరిలోకి దిగాలన్నాడు.'అని వసీం జాఫర్ అభిప్రాయపడ్డాడు.

Story first published: Saturday, January 28, 2023, 16:45 [IST]
Other articles published on Jan 28, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+