Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2023 : గతేడాది హీరోలు.. ఈ సీజన్ జీరోలు.. ఐపీఎల్‌లో ఫ్లాప్ ప్లేయింగ్ XI వీళ్లే!

రెండు నెలల పాటు అన్‌లిమిటెడ్ ఎంటర్‌టైన్‌మెంట్ పంచిన ఐపీఎల్ ముగిసింది. ఎవరూ ఊహించని, ఇప్పటి వరకు పేరు కూడా తెలియని చాలా మంది ఆటగాళ్లు ఈ సీజన్ ద్వారా స్టార్లుగా ఎదిగారు. అదే సమయంలో స్టార్లుగా పేరొందిన చాలా మంది ఏమాత్రం రాణించకుండా విమర్శల పాలయ్యారు. ఇలా ఫెయిలైన ఆటగాళ్లతో ఒక టీం తయారు చేస్తే..

ఎన్నో అంచనాలతో ఈ ఐపీఎల్ ప్రారంభించిన ఓపెనర్ పృథ్వీ షా. గతేడాది అతను ఆడిన ఆట చూసిన చాలా మంది అర్జెంటుగా అతన్ని టీమిండియా టీ20 సెటప్‌లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. కానీ ఈ ఏడాది అతని ఆట చూసిన వాళ్లు నోరెళ్లబెట్టారు. ఇలాంటి ప్లేయర్ అసలు జట్టులో ఉండకూడదని అన్నారు. ఢిల్లీ క్యాపిటల్స్ కూడా అదే చేసింది. కొన్ని మ్యాచులు అతన్ని భరించి, ఆ తర్వాత పక్కన పెట్టేసింది.

IPL 2023 Flop playing XI of this season these stars failed miserably

మినీ వేలంలో ఏకంగా రూ. 13 కోట్ల ధర పలికి అందరి దృష్టినీ ఆకర్షించిన మరో బ్యాటర్ హ్యారీ బ్రూక్. సన్‌రైజర్స్ తరఫున ఆడిన అతను కూడా ఈ ఏడాది ఐపీఎల్‌లో ఏమాత్రం రాణించలేదు. కేవలం ఒక్క మ్యాచ్‌లో మాత్రమే సెంచరీ చేశాడు. మిగతా మ్యాచులన్నింట్లో చేతులెత్తేశాడు. ఇక మిడిలార్డర్ విషయానికొస్తే.. గతేడాది సన్‌రైజర్స్ మిడిలార్డర్‌లో కీలకంగా మారిన రాహుల్ త్రిపాఠీ.. ఈ ఏడాది తేలిపోయాడు.

సన్‌రైజర్స్‌కు ఒంటి చేత్తో విజయాలు అందించిన అతను.. ఈ సీజన్‌లో కనీసం పరుగులు చేయడానికి ఇబ్బంది పడ్డాడు. ఇక దీపక్ హుడా గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. గతేడాది అద్భుతమైన ఆటతో టీమిండియాలో చోటు సంపాదించిన అతను.. ఈ ఏడాది అత్యంత దారుణంగా ఫెయిలయ్యాడు. లక్నో టీంకు కూడా భారంగా మారాడు.

ఇదే కోవలోకి ఆర్సీబీ వికెట్ కీపర్ బ్యాటర్ దినేష్ కార్తీక్ కూడా చేరతాడు. గతేడాది అద్భుతమైన ఫినిషర్‌గా పేరొందిన అతను.. ఈ ఏడాది కనీసం బంతిని సరిగా టచ్ చేయలేకపోయాడు. గోల్డెన్ డక్‌లు అవుతూ చెత్త రికార్డులు తన పేరిట రాసుకున్నాడు. ఇక ఆల్‌రౌండర్లలో ముందుగా చెప్పుకోవాల్సింది రియాన్ పరాగ్ గురించి.

ఐపీఎల్ సీజన్ ప్రారంభానికి ముందు తను ఒకే ఓవర్లో నాలుగు సిక్సర్లు కొడతానంటూ ప్రగల్భాలు పలికిన పరాగ్.. ఈ సీజన్‌లో ఏమాత్రం రాణించలేదు. దీంతో తీవ్రమైన విమర్శలపాలయ్యాడు. అలాగే ఆర్సీబీ స్టార్ షాబాజ్ అహ్మద్ కూడా అంతే. చాలా దారుణమైన ఆటతో జట్టులో స్థానం కోల్పోయాడు. ఇక ఎన్నో అంచనాలు పెట్టుకున్న జేసన్ హోల్డర్ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది.

బౌలర్లలో అత్యంత దారుణంగా ఫెయిలైన వారిలో ముంబై పేసర్ క్రిస్ జోర్డాన్ ముందుంటాడు. అతను బంతితో రాణించకపోగా సొంత టీం ప్లేయర్ల గాయాలకు కారణమై తెగ విమర్శలు ఎదుర్కొన్నాడు. ఎన్నో అంచనాలతో ఈ సీజన్ ప్రారంభించిన ఉమ్రాన్ మాలిక్ కూడా పెద్దగా రాణించలేదు. ఆడింది తక్కువ మ్యాచులే అయినా దారుణంగా తేలిపోయాడు. ఉమేష్ యాదవ్ కూడా సీజన్‌ తొలి మ్యాచ్‌లో ఫర్వాలేదనిపించి ఆ తర్వాత చేతులెత్తేశాడు.

ప్లాప్ ప్లేయింగ్ XI: పృథ్వీ షా, హ్యారీ బ్రూక్, రాహుల్ త్రిపాఠీ, దీపక్ హుడా, దినేష్ కార్తీక్, రియాన్ పరాగ్, షాబాజ్ అహ్మద్, జేసన్ హోల్డర్, క్రిస్ జోర్డాన్, ఉమ్రాన్ మాలిక్, ఉమేష్ యాదవ్

Story first published: Thursday, June 1, 2023, 9:40 [IST]
Other articles published on Jun 1, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+