న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

INDvsNZ : ఇంకొక్క ఛాన్స్ ఇవ్వండి.. దీపక్ హుడాకు దిగ్గజం మద్దతు!

Dinesh Karthik wants Team India to give Deepak Hooda a last chance

టీమిండియాలో వరుసగా విఫలం అవుతున్న ఆటగాళ్లలో దీపక్ హుడా ఒకడు. ఫినిషర్ రోల్‌లో అతన్ని వినియోగించుకోవాలని టీమిండియా భావిస్తోంది. అయితే ఆ పాత్రలో దీపక్ హుడా ఒకటో రెండో సందర్భాల్లో మాత్రమే మెరిశాడు. ఇక మిగతా ఏ ఒక్క మ్యాచులోనూ కనీస స్థాయి ప్రదర్శన కూడా చేయలేదు. ఐపీఎల్‌లో కూడా టాప్ 4 స్థానాల్లోనే బ్యాటింగ్‌కు వచ్చే హుడా.. మిడిలార్డర్‌లో ఇమడలేకపోతున్నాడని దిగ్గజ బ్యాటర్ దినేష్ కార్తీక్ అన్నాడు.

 ఆ ఛాన్స్ ఇవ్వండి..

ఆ ఛాన్స్ ఇవ్వండి..

టీమిండియాలో ఆరో స్థానంలో కచ్చితంగా దీపక్ హుడానే ఆడతాడని తేల్చేసిన డీకే.. అతను ఈ స్థానంలో తీవ్రమైన ఒత్తిడికి గురవుతున్నాడని వివరించాడు. 'ఈ ఒత్తిడి నుంచి హుడా బయటకు రావాలంటే అతనికి మూడో స్థానంలో అవకాశం ఇవ్వాలి. అసలు పూర్తిగా జట్టు నుంచి తొలగించే ముందే ఆ అవకాశం ఇవ్వాలని కోరుకుంటున్నా. ఎందుకంటే అతను మూడో స్థానంలో అద్భుతంగా రాణించాడు. అతనికి ఇలాంటి అవకాశాలు ఇవ్వడం చాలా ముఖ్యం' అని డీకే స్పష్టం చేశాడు.

 టాపార్డర్‌లో రాణించాడు..

టాపార్డర్‌లో రాణించాడు..

టాపార్డర్‌లో చక్కగా బ్యాటింగ్ చేసే దీపక్ హుడా.. ఓపెనర్‌గా కూడా రాణించాడు. ఐర్లాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో సెంచరీతో ఆకట్టుకున్నాడు. ఆ తర్వాతనే అతనికి జట్టులో మరిన్ని అవకాశాలు ఇస్తున్నారు. గతేడాది టీ20 వరల్డ్ కప్ ముగిసిన తర్వాత నుంచి అతను జట్టులో రెగ్యులర్‌గా మారాడు. కానీ తనకు వచ్చే అవకాశాలకు న్యాయం చేయలేకపోతున్నాడు. శ్రీలంకపై కూడా పెద్దగా రాణించని అతను.. కివీస్‌తో తొలి టీ20లో జట్టును గెలిపించడంలో విఫలమయ్యాడు. ఒకపక్క వాషింగ్టన్ సుందర్ పోరాడుతుంటే.. అతనికి సహకారం ఇవ్వడంలో కూడా విఫలమయ్యాడు.

 అతను చేయాల్సింది అదే..

అతను చేయాల్సింది అదే..

అనవసర షాట్‌కు ప్రయత్నించి వికెట్ పారేసుకున్నాడు. ఈ క్రమంలోనే అతనికి అచ్చొచ్చిన మూడో నెంబర్ స్థానాన్ని అతనికి ఇవ్వాలని డీకే సూచించాడు. 'ఆరో నెంబర్‌లో వచ్చే ఆటగాడు చేయగిగేది ఇంపాక్ట్ క్రియేట్ చేయడం ఒక్కటే. ఆ పనినే నిరంతరం చేస్తూ ఉండాలి. 8 బంతులే ఆడామా? లేక ఆరు బంతులే ఎదుర్కున్నామా? అనేది సమస్యే కాదు. ఇలా బ్యాటింగ్‌కు వచ్చిన ప్రతిసారీ దీపక్ హుడా ఇంపాక్ట్ క్రియేట్ చేయడానికి ప్రయత్నించాలి. అదే అతని లక్ష్యం కావాలి. ఆట తీరును మార్చే ఇన్నింగ్స్ ఆడాలి. అదే ఒక మిడిలార్డర్ బ్యాటర్ చేయగలిగే పని' అని వివరించాడు.

Story first published: Sunday, January 29, 2023, 18:21 [IST]
Other articles published on Jan 29, 2023
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X