న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

INDvsNZ : టీమిండియాలో అతిపెద్ద ఫ్రాడ్.. యువ బ్యాటర్‌పై ఫ్యాన్స్ ఆగ్రహం!

Fans call Deepak Hooda fraud of Team India after first INDvsNZ T20I

న్యూజిల్యాండ్‌తో జరిగిన తొలి టీ20లో భారత జట్టు చిత్తుగా ఓడింది. రాంచీ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో భారత టాపార్డర్ దారుణంగా విఫలమైంది. ఇషాన్ కిషన్, శుభ్‌మన్ గిల్ ఇద్దరూ సింగిల్ డిజిట్ స్కోరుకే పరిమితం అయ్యారు. రాహుల్ త్రిపాఠీ అయితే కనీసం ఖాతా తెరవలేకపోయాడు. ఇలాంటి సమయంలో సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా మరో వికెట్ కోల్పోకుండా కొంత జాగ్రత్తగా ఆడారు. వీళ్లు కూడా అవుటైన తర్వాత దీపక్ హుడా క్రీజులోకి వచ్చాడు.

మ్యాచ్ పరిస్థితిని బట్టి ఆడాల్సిన అతను ఏమాత్రం ఆకట్టుకోలేదు. ఒక పక్క వాషింగ్టన్ సుందర్ జట్టును గెలిపించేందుకు ప్రయత్నిస్తుంటే.. కనీసం అతనికి సహకారం కూడా ఇవ్వలేకపోయాడు హుడా. స్పెషలిస్టు బ్యాటర్ అయిన అతను కివీస్ బౌలర్లను ఏమాత్రం ఎదుర్కోలేకపోయాడు. క్రీజులో కుదురుకోవడానికి టైం తీసుకున్న అతను.. 10 బంతులు ఎదుర్కొని కేవలం పది పరుగులే చేశాడు. అయితే ఆ తర్వాత బ్యాటు ఝుళిపిస్తాడని అభిమానులు ఆశించారు. కానీ అలా జరగలేదు.

అప్పుడెప్పుడో ఐర్లాండ్‌పై సెంచరీ చేసిన దీపక్ హుడా.. ఆ తర్వాత అంతగా చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఒక్కటంటే ఒక్కటి కూడా ఆడలేదు. శ్రీలంకపై ఒక మ్యాచ్‌లో ఫర్వాలేదనిపించినా.. మిగతా మ్యాచుల్లో ఆడలేదు. ఇప్పుడు కివీస్‌పై జట్టును గెలిపించడంలో కూడా విఫలమయ్యాడు. శాంట్నర్ వేసిన బంతిని సరిగా అంచనా వేయలేకపోయాడు. ముందుకొచ్చి అనవసరమైన షాట్ ఆడేందుకు ప్రయత్నించి మిస్ అయ్యాడు. దీన్ని అందుకున్న కీపర్ వికెట్లను కూల్చడంతో పెవిలియన్ చేరాడు.

ఇది చూసిన అభిమానులు దీపక్ హుడాపై మండి పడుతున్నారు. టీమిండియాలో అతి పెద్ద ఫ్రాడ్ ఆటగాడు హుడానే అంటూ తిట్టిపోస్తున్నారు. ఐర్లాండ్‌పై సెంచరీ తర్వాత అతను ఆడిన మ్యాచుల వివరాలను సోషల్ మీడియాలో పోస్టు చేస్తూ ఏకిపారేస్తున్నారు. ఆ సెంచరీ తర్వాత మొత్తం 12 మ్యాచులు ఆడిన హుడా.. 20 సగటుతో 182 పరుగులు మాత్రమే చేయడం గమనార్హం. ఇలాంటి వాడిని అసలు జట్టులోకి ఎలా తీసుకుంటారని ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు.

Story first published: Saturday, January 28, 2023, 9:19 [IST]
Other articles published on Jan 28, 2023
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X