For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Team India : టీ20ల్లో హీరోలైన టీమిండియా స్టార్లు.. వన్డేల్లో విఫలమైన జీరోలు!

star players failed in ODIs after making it big in T20Is

క్రికెట్‌లో అన్ని ఫార్మాట్లలో ఒకేలా ఆడటం కుదరదు. టీ20ల్లో తొలి బంతి నుంచే భారీ షాట్లు బాదాల్సి ఉంటుంది. అదే సమయంలో టెస్టుల్లో అయితే అద్భుతమైన డిఫెన్స్ ఉండాలి. ఇక వన్డేల్లో అయితే పరిస్థితికి తగినట్లు ఇన్నింగ్స్ నిర్మించాల్సి ఉంటుంది.

అలాగే అవసరం అయినప్పుడు ఇన్నింగ్స్ వేగం పెంచాలి. ఇది అందరి వల్ల కాదు. ఈ విషయం తాజాగా సూర్యకుమార్ విషయంలో తేటతెల్లం అయింది. ఇలా కేవలం సూర్యనే కాదు.. ఇంకొంత మంది కూడా పొట్టి ఫార్మాట్లో సక్సెస్ అయినా వన్డేల్లో ఫెయిలయ్యారు. వాళ్లెవరంటే..?

సూర్యకుమార్ యాదవ్

ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్ మూడు మ్యాచుల్లోనూ తొలి బంతికే అవుటైన సూర్యకుమార్ యాదవ్ తన పేరిట ఒక చెత్త రికార్డు రాసుకున్నాడు. టీ20ల్లో చాలా మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడిన సూర్య.. వన్డేల్లో మాత్రం పెద్దగా ఆకట్టుకోలేదు.

ఇప్పటి వరకు ఆడిన 22 మ్యాచుల్లో 433 పరుగులు మాత్రమే చేయగలిగాడు. ఇప్పటికైనా తన టెక్నిక్‌లో మార్పులు చేసుకొని, వన్డేలకు తగినట్లు అతను ఆడతాడేమో చూడాలి. అదే జరిగితే వన్డే వరల్డ్ కప్‌లో సూర్య కీలకంగా మారతాడు.

దినేష్ కార్తీక్

పొట్టి ఫార్మాట్లో ఎన్నో మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్సులు ఆడిన వెటరన్ వికెట్ కీపర్ బ్యాటర్ దినేష్ కార్తీక్ కూడా వన్డేల్లో పెద్దగా ఆకట్టుకోలేదు. తన కెరీర్‌లో మొత్తం 60 మ్యాచులు ఆడాడీ వికెట్ కీపర్. 48 ఇన్నింగ్సుల్లో బ్యాటింగ్ చేసిన అతను 142.61 స్ట్రైక్ రేటుతో 686 పరుగులు చేశాడు.

కేవలం ఒక్క హాఫ్ సెంచరీ మాత్రమే చేసిన అతను.. ఎన్నో ఇంపాక్ట్‌ఫుల్ ఇన్నింగ్సులు ఆడాడు. వన్డేల్లో మాత్రం అలాంటి ప్రభావం చూపించలేకపోయాడు. 94 మ్యాచులు ఆడిన అతను 30.2 సగటు, 75 స్ట్రైక్‌రేటుతో 1752 పరుగులు మాత్రమే చేయగలిగాడు.

దీపక్ హుడా

ఐర్లాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో సూపర్ సెంచరీతో అందరి దృష్టినీ ఆకర్షించిన ఆల్‌రౌండర్ దీపక్ హుడా. మొత్తం 17 టీ20 మ్యాచుల్లో బ్యాటింగ్ చేసిన అతను 147.2 స్ట్రైక్ రేటుతో 368 పరుగులతో ఆకట్టుకున్నాడు. దీంతో పొట్టి ఫార్మాట్లో టీమిండియాలో కీలకమైన ఆటగాడిగా మారాడు.

కానీ వన్డేల్లో మాత్రమే పెద్దగా రాణించలేదు. తన కెరీర్‌లో 10 వన్డేలు ఆడిన అతను 80.95 స్ట్రైక్ రేటుతో 153 పరుగులు మాత్రమే చేయగలిగాడు. అతని అత్యధిక స్కోరు కూడా కేవలం 33 మాత్రమే. ఇలా వరుసగా విఫలం అవడంతో అతన్ని వన్డే జట్టుకు సెలెక్టర్లు ఎంపిక చేయడం మానేశారు.

Story first published: Saturday, March 25, 2023, 12:19 [IST]
Other articles published on Mar 25, 2023
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+