న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఆ ఆటగాడే బుకీల దగ్గరకు తీసుకెళ్లేవాడు.. ఖరీదైన కార్లు, డాలర్లు ఇస్తామనేవారు: పాక్ మాజీ క్రికెటర్

Former Pakistan pacer Aaquib Javed names teammate who approached him for fixing

కరాచీ: పాకిస్థాన్ మాజీ క్రికెటర్ ఆకిబ్ జావెద్ తన సహచర ఆటగాడైన సలీమ్ పెర్వెజ్‌పై సంచలన ఆరోపణలు చేశాడు. పెర్వెజ్ ఆటగాళ్లను బుకీల దగ్గరకు తీసుకువెళ్లేవాడని తెలిపాడు. తనను కూడా అతనే తీసుకెళ్లాడని, కాకపోతే తాను ఫిక్సింగ్ చేయనని తెగేసి చెప్పానన్నాడు. దాంతో తన కెరీర్ అర్ధంతరంగా ముగిసిందని ఈ పాక్ మాజీ పేసర్ చెప్పుకొచ్చాడు.

ఖరీదైన కార్లు.. మిలియన్ల రూపాయలు..

ఖరీదైన కార్లు.. మిలియన్ల రూపాయలు..

తాజాగా పాకిస్థాన్ చెందిన ఓ చానెల్‌తో మాట్లాడిన ఆకిబ్.. ఫిక్సింగ్‌కు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలు వెల్లడించాడు.‘మ్యాచ్ ఫిక్సింగ్ చేయడం కోసం క్రికెటర్లకు ఖరీదైన కార్లు, మిలియన్ల రూపాయలు ఆఫర్ చేసేవారు. నన్ను కూడా మ్యాచ్ ఫిక్స్ చేయమన్నారు. చెప్పినట్లు చేయకుంటే కెరీర్‌ను ముగించేస్తామని కూడా హెచ్చరించారు. కానీ నేను ఆ బెదిరింపులను లెక్క చేయలేదు.

నా కెరీర్ ముగిసింది..

నా కెరీర్ ముగిసింది..

మాజీ క్రికెటర్ సలీమ్ పెర్వెజ్ ద్వారానే ఆటగాళ్లు బుకీలను కలిసేవారు. ఫిక్సింగ్‌కు వ్యతిరేకంగా నేను నిర్ణయం తీసుకోవడంతో నా కెరీర్ అర్దాంతరంగా ముగిసింది. దానికి నేనేం చింతించడం లేదు. ఎందుకంటే నేను నా విలువలకు కట్టుబడి ఉన్నా. వారు చెప్పినట్టు చేయలేదని నన్ను జట్టు నుంచి తీసేశారు. ఒంటరివాడిని చేశారు. నాతో మాట్లాడే వారిని కూడా మందలించారు.'అని ఆకిబ్ చెప్పుకొచ్చాడు. 2013లోనే మరణించిన సలీమ్ పెర్వెజ్.. పాక్ తరఫున ఏకైక వన్డే ఆడాడు.

ఐపీఎల్‌లో అవినీతి..

ఐపీఎల్‌లో అవినీతి..

ఇక గత నెలలో ఐపీఎల్‌ను ఉద్దేశించి ఈ పాక్ పేసర్ భారత్‌పై సంచలన ఆరోపణలు చేశాడు. మ్యాచ్ ఫిక్సింగ్ కు సంబంధించి ముఖ్య స్థావరం భారత్ లోనే ఉందన్నాడు. ‘ఐపీఎల్‌లో అవినీతిపై ఎన్నో ఆరోపణలున్నాయి. బుకీల అడ్డా కూడా భారత్‌లోనే ఉంది. ఫిక్సింగ్ వ్యతిరేకంగా మాట్లాడినందుకు ముక్కలు ముక్కలుగా నరికేస్తామంటూ బెదిరింపులు కూడా వచ్చాయి. కెరీర్ లో ఓ దశకు వచ్చిన తర్వాతే ఫిక్సింగ్ వంటి తీవ్ర అంశాలపై మాట్లాడాల్సి ఉంటుందన్న విషయం అర్థమైంది.

అందుకే సచిన్ కెప్టెన్సీ వదులుకున్నాడు: మాజీ చీఫ్ సెలెక్టర్

అందుకే కోచ్ కాలేదు..

అందుకే కోచ్ కాలేదు..

ఇలాంటి కారణాలతోనే నేను పాక్ జట్టు కోచ్ పదవి కూడా దక్కించుకోలేకపోయాను. మ్యాచ్ ఫిక్సింగ్ మాఫియా ఎంతో బలమైనది. ఒకసారి అందులో ప్రవేశిస్తే తిరిగి రాలేరు. అయితే ఫిక్సింగ్ లో ఆటగాళ్లే శిక్షలకు గురవుతున్నారు. ఫిక్సింగ్ మాఫియాను కూడా కఠినంగా శిక్షించాలి'అని ఆకిబ్ అభిప్రాయపడ్డాడు. 90వ దశకంలో పాకిస్థాన్ జట్టులో ప్రధాన పేసర్లలో ఒకడిగా పేరుగాంచిన ఆకిబ్ జావెద్.. పాక్ తరఫున 22 టెస్ట్‌లు, 162 వన్డేలు ఆడాడు. టెస్టుల్లో 54, వన్డేల్లో 182 వికెట్లు పడగొట్టాడు.

బార్డర్ టెన్షన్స్ చూస్తుంటే.. కరోనా చైనా కుట్రే అనిపిస్తోంది: రైనా

Story first published: Monday, June 22, 2020, 15:56 [IST]
Other articles published on Jun 22, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X