న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

నువ్వు పాములాంటోనివి.. ఈ కరోనా వైరస్ కన్నా డేంజర్.. సహచర ఆటగాడిపై గేల్ ధ్వజం

Chris Gayle lashes out at former West Indian teammate

న్యూఢిల్లీ: తన సహచర ఆటగాడు, మాజీ క్రికెటర్ రామ్‌నరేశ్ శర్వాన్ ‌పై వెస్టిండీస్ విధ్వంసకర బ్యాట్స్‌మన్ క్రిస్ గేల్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తాడు. రామ్‌నరేశ్ పాములాంటోడని, ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ కన్నా డేంజర్ అని విరుచుకుపడ్డాడు. కరేబీయ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (సీపీఎల్‌)లో జమైకా త‌ల్ల‌వాస్ జట్టు నుంచి త‌న‌ను త‌ప్పించ‌డంలో శర్వాన్ కుట్ర ఉందని, అతని వల్లే జమైకా తల్లవాస్ తనను రిటైన్ చేసుకోలేదని ఆరోపించాడు.

శర్వాన్ కుట్రపన్నాడు..

శర్వాన్ కుట్రపన్నాడు..

తన యూట్యూబ్ చానెల్ వేదికగా మూడు విభాగాలు విడుదల చేసిన వీడియోలో ఈ యూనివర్సల్ బాస్ తన సహచర ఆటగాడిపై ధ్వజమెత్తాడు. ఇక 2020 సీజన్ సీపీఎల్‌ కోసం తల్లవాస్ టీమ్ గేల్‌ను రిటైన్ చేసుకోలేదు. దీంతో ఈ విండీస్ వీరుడు.. డారెన్ సామీ నేతృత్వంలోని సెయింట్ లూసియా జట్టుతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. సీపీఎల్ తొలి నాలుగు సీజన్లలో గేల్ తల్లావాస్‌కే ప్రాతినిధ్యం వహించాడు.

వెన్ను పోటు..

వెన్ను పోటు..

త‌ల్ల‌వాస్ టీమ్ స‌హాయా కోచ్‌గా ప‌నిచేస్తున్న శ‌ర్వాన్‌.. జ‌ట్టు ప్ర‌ధాన కోచ్‌గా ఎద‌గాలని కుట్ర ప‌న్నిన‌ట్లు గేల్ ఆరోపించాడు. అందరిలోకెల్లా మంచివానిగా న‌టిస్తూ, వెన్నుపోటు పొడిచిన వ్య‌క్తని శ‌ర్వాన్‌పై గేల్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ‘తల్లావాస్ జట్టులో ఏం మార్పు. శర్వాన్.. ఈ కుట్రలో నీదే పెద్ద పాత్ర. నా జన్మదిన వేడుకల్లో మన స్నేహం గురించి పెద్ద స్పీచ్‌లు ఇచ్చావు. కానీ నువ్వో పాములాంటోడివి. నమ్మించి వెన్నుపోటు పొడిచావ్. ఈ కరేబీయన్ గడ్డ మీద నిన్ను ఎవరు ఇష్టపడరని నీకు తెలుసు. నీకు ఇప్పటికీ పరిపక్వత రాలేదు. ఈ కుట్రకు ఎప్పుడు ప్రణాళిక రచించావ్?'అని గేల్ మండిపడ్డాడు.

ప్రధాని మోదీని ప్రశంసించిన పాక్ మాజీ పేసర్

ఓర్వలేకనే..

ఓర్వలేకనే..

తన సక్సెస్‌ను సహచర ఆటగాళ్లు ఓర్వలేకపోతున్నారని గేల్ పేర్కొన్నాడు. తనతో అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టినప్పుడు ఉన్న ఆటగాళ్లలో ఏ ఒక్కరు ప్రస్తుతం ఆడటంలేదని, దీంతోనే తనపై కుట్ర పన్నుతున్నారని ఆరోపించాడు. ‘1996 శకంలో అంతర్జాతీయ క్రికెట్‌లోకి వచ్చిన వారిలో నేనొక్కడినే ఇంకా క్రికెట్ ఆడుతున్నా .అప్పటి వారందరూ వీడ్కోలు పలికారు. నేను ఇంకా స్ట్రాంగ్‌గా ఆడుతుండటం.. సక్సెస్ అవుతుండటం చూసి ఓర్వలేకపోతున్నారు. నేను కేవలం అప్పటి ఆటగాళ్ల గురించే మాట్లాడటం లేదు.. ప్రస్తుత క్రికెటర్లు కూడా నన్ను సహించడం లేదంటున్నా. కానీ శర్వాన్ ప్రస్తుతం నీ గురించే చెబుతున్నా. టైమ్ వచ్చినప్పుడు వారి గురించి కూడా మాట్లాడుతా'అని గేల్ తెలిపాడు. ఇక రామ్‌నరేశ్ శర్వాన్ విండీస్ తరఫున 87 టెస్టులు, 181 వన్డేలు, 18 టీ20లు ఆడాడు.

సీపీఎల్‌‌కు కరోనా దెబ్బ..

ఇక షెడ్యూల్ ప్రకారం సీపీఎల్ 2020 సీజన్ ఆగస్టు 19 నుంచి సెప్టెంబర్ 26 మధ్య జరగనుంది. కానీ కరోనా కారణంగా ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం నెలకొన్ని పరిస్థితుల నేపథ్యంలో ఈ షెడ్యూల్‌లో మార్పులు సంభవించవచ్చు. ఒకవేళ ఈ టోర్నీ జరిగినా.. ఓవర్సీస్ ప్లేయర్లు లేకుండా ఖాళీ మైదానాల్లో జరిగే అవకాశం ఉంది. లేకుంటే డిసెంబర్‌కు వాయిదా పడవచ్చు. లీగ్ నిర్వాహకులు ఎప్పటికప్పుడూ పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.

6 బంతుల్లో 6 సిక్స్‌లు కొట్టిన తర్వాత స్టువర్ట్ బ్రాడ్ తండ్రి యూవీతో ఏమన్నాడంటే.?

Story first published: Tuesday, April 28, 2020, 16:46 [IST]
Other articles published on Apr 28, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X