న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఓ కోహ్లీ ఒక కోటి ఇవ్వరాదు.. కోట్ల ఆదాయం ఉన్న క్రికెటర్లు విరాళలు ప్రకటించరే?

Bajrang Punia To Donate Six Months Salary What about Cricketers?

హైదరాబాద్: కరోనా మహమ్మారి దెబ్బకు ప్రపంచం స్థంభించింది. వందలాది దేశాలు వైరస్ బారిన పడి వణికిపోతున్నాయి. అన్ని రంగాలు దెబ్బతిన్నాయి. ఇళ్ల నుంచి అడుగు బయట పెట్టలేని స్థితి వచ్చింది. ప్రపంచ వ్యాప్తంగా నగరాలకు నగరాలే లాక్‌డౌన్ అయ్యాయి. పగలు పప్పు, ఉప్పు కోసం, రాత్రయితే మందుల కోసమే రోడ్డుపై తిరిగే పరిస్థితి వచ్చింది.

రెక్కాడితే కానీ డొక్కాడనీ జీవులకే..

రెక్కాడితే కానీ డొక్కాడనీ జీవులకే..

పైసలున్న మహరాజులకు ఎలాంటి సమస్య లేకున్నా.. రెక్కాడితే కానీ డొక్కాడనీ జీవులకే పెద్ద కష్టం వచ్చింది. ప్రభుత్వాలు సాయం చేస్తామని ప్రకటిస్తున్న అవి అందేది ఎంతమందికో.. అందని అభాగ్యులెందరో..! ఈ నేపథ్యంలో మనసున్న సెలబ్రిటీల అందరూ ముందుకు వస్తున్నారు. తమ వంతు సాయంగా విరాళలు ప్రకటిస్తూ.. గొప్ప మనసును చాటుకుంటున్నారు. కొంత మంది తమకు అందుబాటులో ఉన్న వారికి నేరుగా సాయం చేస్తుండగా.. మరికొంత మంది రాష్ట్ర ప్రభుత్వాల సహాయ నిధిలకు తోచిన సాయం చేస్తూ చేయుతనందిస్తున్నారు.

ట్వీట్‌లకే పరిమితమయ్యారు..

ట్వీట్‌లకే పరిమితమయ్యారు..

అయితే ఈ విషయంలో రాజకీయ, సినీ రంగం ముందుంజలో ఉండగా.. క్రీడా రంగం మాత్రం ట్వీట్‌లకే పరిమితమైంది. ఇండియా స్టార్ రెజ్లర్ బంజరంగ్ పూనియా ఒక్కడే తన 6 నెలల జీతాన్ని హర్యానా ప్రభుత్వ సహానిధికి విరాళంగా ప్రకటించాడు. రైల్వేలో స్పెషల్ ఆఫిసర్‌గా ఉద్యోగం చేస్తున్న అతను తన పెద్ద మనసు చాటుకోగా.. కోట్లకు కోట్లు ఆర్జించే క్రికెటర్లు, బ్యాడ్మింటన్ స్టార్లు మాత్రం ఇప్పటి వరకూ(మార్చి 24) ఒక్క రూపాయి కూడా ప్రకటించిందిలేదు.. సాయం చేసింది లేదు.

స్టార్ రెజ్లర్ ఔదార్యం.. కరోనాపై పోరాటానికి భారీ విరాళం!!

కోట్ల ఆదాయం ఆర్జించే క్రికెటర్లు కూడా..

కోట్ల ఆదాయం ఆర్జించే క్రికెటర్లు కూడా..

ముఖ్యంగా క్రికెట్‌నే దైవంగా భావించే ఈ దేశంలో ఆ ఆటకు సంబంధించిన ఆటగాళ్లకు బాధ్యత ఉండక్కర్లేదా? దేశ ప్రజలు క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్న సమయంలో వారిని ఆదుకోవాలనే సోయి లేదా? అనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది.

రూ.1690 కోట్ల బ్రాండ్‌ వాల్యూ ఉన్న టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఒక్క కోటీ రూపాయలు విరాళంగా ఇస్తే పోయేదేముందనే మాటలు వినపడుతున్నాయి. ఒక్క ట్వీట్, ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌కే కోట్లలో ఆర్జించే క్రికెటర్లకు సాయం చేయాలనే మనసు లేకపోవడం నిజంగా సిగ్గుచేటనే విమర్శలు వస్తున్నాయి.

 ఫ్యాన్సే లేకుంటే...?

ఫ్యాన్సే లేకుంటే...?

ఒక్క విరాటే కాదు.. రోహిత్, ధావన్, రాహుల్, ధోనీ, సచిన్, సెహ్వాగ్, పీవీ సింధు ఇలా కోట్ల ఆదాయం ఉన్న ఆటగాళ్లు బాధ్యతగా దేశానికి, రాష్ట్ర ప్రభుత్వాలకు అండగా నిలవాలనే వాదన వినపడుతోంది. అభిమానులే లేకుంటే వారికింత సంపాదనక్కెడిదనే ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి.

సొంత అభిమానులు కూడా తమ అభిమాన క్రికెటర్లు విరాళలు ప్రకటించకపోవడం పట్ల ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. రెండు మూడు రోజుల్లో తమ క్రికెటర్లు విరాళలు ప్రకటిస్తారని ఆశగా ఎదురుచూస్తున్నారు. ఇక కొందరైతే రెజ్లర్ బజరంగ్ పూనియాను చూసి బుద్ది తెచ్చుకోవాలని ఘాటుగానే వ్యాఖ్యానిస్తున్నారు.

బాయ్‌ఫ్రెండ్‌ ఉంటే బాగుంటుందన్న టెన్నిస్ భామ.. డేటింగ్ రెజ్యూమ్‌లతో ఎగబడ్డ ఫ్యాన్స్!!

Story first published: Tuesday, March 24, 2020, 15:04 [IST]
Other articles published on Mar 24, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X