న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బాయ్‌ఫ్రెండ్‌ ఉంటే బాగుంటుందన్న టెన్నిస్ భామ.. డేటింగ్ రెజ్యూమ్‌లతో ఎగబడ్డ ఫ్యాన్స్!!

Genie Bouchard Says Need To Stop As Fans Email Dating Resumes


హైదరాబాద్ : ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ కల్లోలం కారణంగా ఆటలన్నీ ఆగమాగమయ్యాయి. దీంతో ఇంటికే పరిమితమైన స్టార్ క్రీడాకారులంతా సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్‌ను అలరిస్తున్నారు. కొందరూ తమ కుటుంబ సభ్యులతో క్వారంటైన్ కాలాన్ని ఎలా ఎంజాయ్ చేస్తున్నామో తెలుపుతుండగా.. మరికొంత మంది ఫ్యాన్స్‌తో చిట్‌చాట్ చేస్తున్నారు. ఇక కరోనా సూచనలు, జాగ్రత్తలు సరేసరి.

అయితే ఈ నేపథ్యంలో ట్విటర్‌లో చేసిన సరదా వ్యాఖ్యలతో ఓ టెన్నిస్‌ తారకు వింత అనుభవం ఎదురైంది. కెనడాకు చెందిన టెన్నిస్‌ స్టార్, 2014 వింబుల్డన్‌ రన్నరప్‌ గినీ బౌచర్డ్‌ చేసిన ఒక సరదా ట్వీట్‌ ఇప్పుడు నెట్టింట హల్‌చల్ చేస్తోంది.

బాయ్ ఫ్రెండ్ ఉంటే..

నెటిజెన్లతో చాటింగ్‌ చేద్దామని భావించిన గినీ శుక్రవారం ట్విటర్‌లో ఎవరున్నారో చెప్పండి అంటూ తన ముచ్చట మొదలుపెట్టింది. శనివారం ఇంకాస్త సరదాగా.. 'ఎవరినీ ఉద్దేశించట్లేదు కానీ, క్వారెంటైన్‌లో బాయ్‌ఫ్రెండ్‌తో ఉంటే మరింత బాగుంటుంది' అని మరో ట్వీట్‌ చేసింది.

టీమిండియా బ్యాడ్‌ డేను గుర్తు చేసిన పాంటింగ్

డేటింగ్ రెజ్యూమ్‌లు

దీంతో ఇంట్లో ఖాళీగా కూర్చున్న నెటిజెన్లు ఈ టెన్నిస్ స్టార్‌కు పెద్ద ఎత్తున స్పందించారు. తమ కోసమే గినీ ఈ ట్వీట్ చేసిందనుకున్నారో ఏమో కానీ.. ఆమె మెయిల్‌కు డేటింగ్ రెజ్యూమ్‌లు పంపిచారు. వీటి సంఖ్య రోజురోజుకి పెరుగుతుండటంతో ఆమె మేనేజర్ ఈ వ్యవహారాన్ని గినీకి తెలియజేశాడు. దీంతో కళ్లు తెరిచిన ఈ టెన్నిస్ బామ.. హవ్వా నేనేదో సరదాగా అంటే.. మీరు ఇంత సీరియస్‌గా తీసుకుంటారా? అన్నట్లు.. దయచేసి అలాంటి రెజ్యూమ్‌లు పంపకండని మరో ట్వీట్‌తో విజ్ఞప్తి చేసింది.

టెన్నీస్ టోర్నీలన్నీ వాయిదా..

ఈ ప్రాణాంతక వైరస్‌ కారణంగా ఏటీపీ, డబ్ల్యూటీఏ టోర్నీలు రద్దయిన విషయం తెలిసిందే. అంతకుముందు ఫ్రెంచ్‌ ఓపెన్‌ కూడా వాయిదా పడింది. దీంతో టెన్నిస్‌ క్రీడాకారులంతా ఇళ్లకే పరిమితమయ్యారు.

ధోనీ వ్యూహం.. పాండ్యా సూపర్ బౌలింగ్.. ఆ ఒక్క పరుగు విజయం గుర్తుందా?

Story first published: Monday, March 23, 2020, 22:19 [IST]
Other articles published on Mar 23, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X