న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

మైదానంలో కోహ్లీ అతి చూశాక నేనో పంచింగ్ బ్యాగ్‌లా అనిపించింది!!

Australia coach Justin Langer reveals feeling like a ‘punching bag’ during Perth Test

సిడ్నీ: ఆస్ట్రేలియా టూర్‌లో టీమిండియా కెప్టెన్ విరాట్‌ కోహ్లీ అతి సంబరాలు చూశాక తానొక 'పంచింగ్‌ బ్యాగ్‌'లా అనిపించిందని ఆసీస్‌ కోచ్‌ జస్టిన్‌ లాంగర్‌ తెలిపాడు. కవ్వింపులకు, దూషణకు చాలా తేడా ఉందని, క్రికెట్‌లో దూషణకు తావు లేదని ఈ ఆసీస్ మాజీ ఓపెనర్ చెప్పుకొచ్చాడు.

చరిత్ర సృష్టించిన కోహ్లీ సేన..

చరిత్ర సృష్టించిన కోహ్లీ సేన..

కోహ్లీసేన 2018-19లో ఆస్ట్రేలియాలో పర్యటించగా.. అప్పటికే బాల్‌ ట్యాంపరింగ్‌ వివాదంలో చిక్కుకున్న ఆసీస్ జట్టు ఆత్మవిశ్వాసం కోల్పోయింది. పైగా స్టీవ్‌ స్మిత్‌, డేవిడ్‌ వార్నర్‌ నిషేధానికి గురవ్వడంతో బలహీనంగా మారింది. కేవలం బౌలింగ్‌ పరంగా పటిష్ఠంగా ఉన్న ఆసీస్‌పై కోహ్లీ సేన 2-1 తేడాతో గెలుపొంది ఆస్ట్రేలియా గడ్డపై తొలి టెస్ట్ సిరీస్ నెగ్గిన భారత జట్టుగా చరిత్ర సృష్టించింది. అలాగే 2-1తో వన్డే సిరీస్‌, 1-1తో టీ20 సిరీస్‌ సమం చేసి ఆ పర్యటనను ఘనంగా ముగించింది.

ఇక ఈ పర్యటన ఆద్యాంతం అభిమానులను అలరించింది. ఆటగాళ్లపై మధ్య మైదానంలో చోటు చేసుకున్న మాటల యుద్దం, ముఖ్యంగా ఆ జట్టు టెస్ట్ కెప్టెన్ టీమ్ పైన్, భారత వికెట్ కీపర్ రిషభ్ పంత్ మధ్య మైదానం సాగిన సరదా సంభాషణ యావత్ క్రికెట్ ప్రపంచాన్ని ఆకర్షించింది. కెప్టెన్ విరాట్ కోహ్లీ సెలెబ్రేషన్స్ కూడా చర్చనీయాంశమయ్యాయి.

‘మంకీ గేట్ వివాదం'.. నా కెప్టెన్సీలోనే అంత్యంత హీనమైన ఘటన!!

మేం ఏం చేయలేకపోయాం..

మేం ఏం చేయలేకపోయాం..

ఈ పర్యటనకు సంబంధించిన ఆసక్తికర విషయాలను ఆస్ట్రేలియా జట్టుపై అమెజాన్ రూపొందించిన డాక్యుమెంటరీ సిరీస్ 'ది టెస్ట్‌'లో లాంగర్ వెల్లడించాడు.

'పెర్త్ టెస్ట్‌లో భాగంగా నాలుగో రోజు మధ్యాహ్నం నేనో పంచింగ్‌ బ్యాగ్‌లా మారినట్టు అనిపించింది. మేం తిరిగి పోరాడలేకపోయాం. ఎందుకంటే అప్పటికే మేం ఓటమి దశకు చేరుకున్నాం. జరిగేదేదో జరుగుతుందని అనుకున్నాం. విరాట్ ప్రవర్తన చూస్తుంటే మాత్రం దంద్వ ప్రమాణాలు ఉన్నట్టు అనిపించింది. మేం జాగ్రత్తగా ఉండాలని భావించాం. అలాంటి పది సందర్భాల్లో మేం రెండుసార్లు చేస్తే ఎలా ఉంటుందో ఊహించండి. దూషణ, కవ్వింపులకు మధ్య తేడా ఉంటుంది. క్రికెట్లో దూషణకు తావులేదు. మేం కోహ్లీని దూషించొద్దని భావించాం. కవ్వింపులు కొనసాగించాలని అనుకున్నాం' అని లాంగర్‌ తెలిపాడు.

చాలానుకున్నాం..

చాలానుకున్నాం..

ఇక ఇదే మ్యాచ్ నాలుగో రోజు ఆటలో ఇరు జట్ల కెప్టెన్ల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.. అప్పుడే తానిక ఎక్కువ మాట్లాడొద్దని అనుకున్నానని పైన్‌ తెలిపాడు. 'ఇక చాలనుకున్నా. అయితే నాకోసం, జట్టు కోసం నిలవాలనుకున్నా. అందుకే కవ్విస్తూ మేం పోరాడుతున్నామని కోహ్లీ తెలియజేయాలనుకున్నా' అని పైన్‌ చెప్పుకొచ్చాడు.

Story first published: Wednesday, March 18, 2020, 16:46 [IST]
Other articles published on Mar 18, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X