
నేనేం చేయలేకపోయాను..
తన కెప్టెన్సీ కెరీర్‌లోనే ఈ వివాదం అత్యంత హీనమైన సంఘటనగా పాంటింగ్ అభివర్ణించాడు. ఈ వివాదం చోటుచేసుకున్న సమయంలో పరిస్థితులు తన అదుపులో లేవని స్కై స్పోర్ట్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.
‘బహుశా మంకీ గేట్ వివాదం నా కెప్టెన్సీ కెరీర్‌లోనే అత్యంత హీనమైన ఘటన. 2005 యాషెస్ సిరీస్ ఓటమి కూడా కఠినమైనదే. కానీ ఈ సిరీస్ ఓటమి అనేది నా నియంత్రణలో జరిగింది. కానీ మంకీగేట్ వివాదం చోటుచేసుకున్నప్పుడు మాత్రం నేనేం చేయలేకపోయాను.'అని పాంటింగ్ తెలిపాడు.
ధోనీలా నిర్లక్ష్యం వద్దు.. నన్ను ఫాలో అవ్వండి: భజ్జీ

చాలా రోజులు వెంటాడింది..
ఈ వివాదం తమను చాలారోజులు వెంటాడిందని, తుది నిర్ణయం కూడా తమని నిరాశకు గురిచేసిందన్నాడు. ‘ఇది చాలా రోజులు తమను వెంటాడింది. అడిలైడ్ టెస్ట్ మ్యాచ్ కోసం మైదానంలోకి వస్తుండగా.. క్రికెట్ ఆస్ట్రేలియా అధికారులు నాతో మాట్లాడటం నాకింకా గుర్తుంది. ఈ టెస్ట్ మ్యాచ్ ముగింపులో ఈ వివాదంపై విచారణ జరిగింది.'అని ఈ ఆసీస్ మాజీ కెప్టెన్ చెప్పుకొచ్చాడు. ‘ఈ మంకీగేట్ వివాదం తుది ఫలితంతో మేం తీవ్ర నిరాశకు గురయ్యాం. ఇది మా తదుపరి మ్యాచ్ ఫలితాలపై ప్రభావం చూపింది. పెర్త్ వేదికగా భారత్‌తో జరిగిన మ్యాచ్‌లు గెలుస్తామనుకున్నాం. కానీ ఓటమి తప్పలేదు. ఆ తర్వాత మా పరిస్థితి మరింత దిగజారింది'అని పాంటింగ్ తెలిపాడు.

ఆ ఓటములు హర్ట్ చేశాయి..
ఇక పాంటింగ్ కెప్టెన్సీలో ఆస్ట్రేలియా 2005,2009, 2010-11 యాషెస్ సిరీస్‌లు ఓడింది. ‘తొలి రెండు యాషెస్ సిరీస్‌ల ఓటమైతే తమను తీవ్రంగా బాధించింది. ఎందుకంటే ఈ రెండు సిరీస్‌లు మేం గెలుస్తామనుకున్నాం'అని ఈ ఆసీస్ దిగ్గజం చెప్పుకొచ్చాడు.

మంకీ అన్నాడని...
2007-08 ఆస్ట్రేలియాలో పర్యటనలో భాగంగా జరిగిన సిడ్నీ టెస్ట్‌లో హర్భజన్ తనను మంకీ అని జాతివివక్ష వ్యాఖ్యలు చేశాడని ఆండ్రూ సైమండ్స్ మ్యాచ్ రిఫరీకి ఫిర్యాదు చేయడంతో ఈ వివాదం చెలరేగింది. దీంతో రిఫరీ హర్భజన్‌పై 50 శాతం మ్యాచ్ ఫీజు కోతతో పాటు మూడు టెస్ట్‌ల నిషేధం విధించాడు. అయితే వ్యవహారంలో భజ్జీ తప్పులేదని స్పష్టం చేసిన అప్పటి భారత్ ఆటగాళ్లు.. నిషేధం ఎత్తేయకపోతే సిరీస్ నుంచి తప్పుకుంటామని హెచ్చరించారు. అప్పీల్స్ కమిషనర్ జాన్ హనెసన్ ముందు హర్భజన్‌కు సచిన్ మద్దతుగా నిలవడంతో, అతను ఈ శిక్షను రద్దు చేశారు.


Click it and Unblock the Notifications












