న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

చారిత్రాత్మక అడుగు: ఆర్టికల్ 370 రద్దుపై స్పందించిన సురేశ్ రైనా

 Article 370 scrapped: Landmark move, says cricketer Suresh Raina

హైదరాబాద్: జమ్మూకశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370 రద్దు చేయడం చారిత్రాత్మక అడుగు అని టీమిండియా క్రికెటర్ సురేశ్ రైనా అన్నాడు. ఈ మేరకు తన ట్విట్టర్‌లో "ఆర్టికల్ 370ని రద్దు చేయడం చారిత్రాత్మక అడుగు - సున్నితమైన, మరింత కలుపుకొని పోయే సమయం కోసం ఎదురు చూస్తున్నాను. జైహింద్" అంటూ ట్వీట్ చేశాడు.

పటిష్ట భద్రత కల్పిస్తాం.. భారత జట్టు కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నాం

జమ్మూ కాశ్మీర్‌కు స్వయంప్రతిపత్తి హోదా కల్పిస్తున్న ఆర్టికల్ 370ను రద్దు చేస్తూ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రాజ్యసభలో సోమవారం ప్రకటన చేశారు. ఈ సందర్భంగా ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370ను రద్దు చేస్తూ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఉత్తర్వులు జారీ చేశారు.

అసెంబ్లీతో కూడిన కేంద్రపాలిత ప్రాంతంగా జమ్మూ-కశ్మీర్ ఏర్పడగా, అసెంబ్లీ లేని కేంద్రపాలిత ప్రాంతంగా లడఖ్ ఏర్పడింది. దీంతో రాష్ర్టాల సంఖ్య 29 నుంచి 28కి తగ్గింది. కేంద్ర పాలిత ప్రాంతాల సంఖ్య 9కి చేరింది. ఈ రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా ఏర్పడక ముందు మొత్తం 7 కేంద్రపాలిత ప్రాంతాలు ఉండేవి.

ఆర్టికల్ 370 రద్దు, 35ఏ రద్దుపై

జమ్మూకశ్మీర్‌కు సంబంధించి ఆర్టికల్ 370 రద్దు, 35ఏ రద్దు, రాష్ట్ర విభజన అంశాలను వెనువెంటనే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రాజ్యసభలో ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఆర్టికల్ 370ను రద్దు చేస్తూ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆదేశాలు జారీ చేశారు. దీనికి సంబంధించి గెజిట్ కూడా విడుదలైంది.

The King of T20Is: విండిస్ పర్యటనలో రోహిత్ శర్మ రికార్డుల మోత

ఆగస్టు 7వ తేదీన మోడీ

మరోవైపు ఈ అంశంపై ప్రధాని నరేంద్ర మోడీ ఆగస్టు 7వ తేదీన ప్రకటన చేయనున్నారు. ఆర్టికల్ 370 రద్దు సందర్భంగా పీడీపీ సభ్యులు రాజ్యసభలో చొక్కాలు చించుకుని నిరసన వ్యక్తం చేశారు. కాగా, ఆర్టికల్ 370 రద్దును కొందరు స్వాగతిస్తుంటే.. మరికొందరు మాత్రం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.

తీవ్ర స్థాయిలో మండిపడ్డ ముప్తీ

ఆర్టికల్ 370 రద్దుపై జమ్మూకశ్మీర్ మాజీ సీఎం, పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ నాయకురాలు మెహబూబా ముఫ్తీ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. భారత ప్రజాస్వామ్యంలో ఈ రోజు అత్యంత చీకటి దినమని ఆమె తన ట్విట్టర్‌లో పేర్కొన్నారు. 1947 నాటి సంప్రదాయాన్ని మంటగలిపారు అని ఆవేదన వ్యక్తం చేశారు.

ధోనీని మరపించిన రిషబ్ పంత్: చప్పట్లు కొడుతూ అభినందించిన కోహ్లీ

ఆర్టికల్ 370ని రద్దు చేయడం రాజ్యాంగ విరుద్ధం

"ఆర్టికల్ 370ని రద్దు చేయడం రాజ్యాంగ విరుద్ధం. కశ్మీర్‌కు ఇచ్చిన మాట తప్పారు. ఆర్టికల్ 370 రద్దు ఏకపక్ష నిర్ణయం. భారత ప్రభుత్వం ఉద్దేశమేంటో ఇప్పుడు తేలిపోయింది. ప్రజలను భయపెట్టి కశ్మీర్‌ను లాక్కోవాలని చూస్తున్నారు. ప్రజలకిచ్చిన మాట నిలబెట్టుకోవడంలో భారత్ విఫలమైంది" అంటూ ఆమె మరో ట్వీట్ చేశారు.

ఒమర్ అబ్ధుల్లా తన ట్విట్టర్‌లో

ఆర్టికల్ 370, ఆర్టికల్ 35ఏని రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై జమ్మూ కశ్మీర్ మాజీ సీఎం, నేషనల్ కాన్ఫరెన్స్ ఉపాధ్యక్షుడు ఒమర్ అబ్దుల్లా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘రాజ్యాంగ విరుద్ధమైన'' ఈ నిర్ణయంపై తాము న్యాయపోరాటానికి సిద్ధంగా ఉన్నామనీ ఆయన కేంద్రానికి సవాల్ విసిరారు. "1947లో దేశంలో విలీనం అయినప్పుడు జమ్మూ కశ్మీర్ ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను విస్మరిస్తూ భారత ప్రభుత్వం దిగ్భ్రాంతికరంగా, ఏకపక్షంగా నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం వల్ల అత్యంత ప్రమాదకరమైన పరిణామాలు సంభవిస్తాయి. ఇది రాష్ట్ర ప్రజలకు వ్యతిరేకమని నిన్న జరిగిన అఖిపక్ష సమావేశం ద్వారా కూడా హెచ్చరించాం. ఆర్టికల్ 370, 35ఏలను రద్దు చేయడం రాష్ట్ర విలీనానికి సంబంధించిన నిబంధనలపై ప్రాథమిక ప్రశ్నలను లేవనెత్తుతుంది. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం చట్ట వ్యతిరేకం, రాజ్యాంగ విరుద్ధం. దీనిపై నేషనల్ కాన్ఫరెన్స్ న్యాయపోరాటం చేస్తుంది. సుదీర్ఘమైన గట్టి పోరాటం ముందుంది. మేము దానికి సిద్ధంగా ఉన్నాం" అంటూ అబ్దుల్లా ఓ లేఖను ట్విటర్లో పోస్టు చేశారు.

Story first published: Monday, August 5, 2019, 15:42 [IST]
Other articles published on Aug 5, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X