Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ధోనీని మరపించిన రిషబ్ పంత్: చప్పట్లు కొడుతూ అభినందించిన కోహ్లీ

IND vs WI 2019 : Rishabh Pant Makes Successful DRS Call In India V West Indies 1st T20I || Oneindia
Missing MS Dhoni? Rishabh Pant makes successful DRS call in India vs West Indies 1st T20I

హైదరాబాద్: భారత ఆర్మీకి రెండు నెలలు పాటు సేవలందించిందేకు గాను వెస్టిండిస్ పర్యటనకు టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని దూరమైన సంగతి తెలిసిందే. ఈ పర్యటనలో వికెట్ కీపర్‌గా ధోని స్థానంలో మూడు ఫార్మాట్లకు సెలక్టర్లు యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్‌ను ఎంపిక చేసిన సంగతి తెలిసిందే.

తొలి టీ20లో పంత్ అద్భుత ప్రదర్శన

తొలి టీ20లో పంత్ అద్భుత ప్రదర్శన

మూడు టీ20ల సిరిస్‌లో భాగంగా శనివారం జరిగిన తొలి టీ20లో యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్... ధోనీని మరిపించాడు. వెస్టిండిస్ ఆఖరి ఓవర్‌లో నవదీప్ సైనీ బౌలింగ్‌ చేస్తుండగా పొలార్డ్‌(49) క్రీజులో ఉన్నాడు. మూడో బంతి ఫుల్‌టాస్‌గా వేయగా భారత ప్లేయర్లు ఎల్బీకి అప్పీల్‌ చేశారు.

నాటౌట్‌గా ప్రకటించిన అంఫైర్

నాటౌట్‌గా ప్రకటించిన అంఫైర్

అయితే, అంపైర్‌ నాటౌట్‌‌గా ప్రకటించాడు. ఆ సమయంలో వికెట్ల వెనుకన ఉన్న రిషబ్ పంత్ కెప్టెన్‌ విరాట్ కోహ్లీని డీఆర్‌ఎస్‌ కోరమని చెప్పాడు. రివ్యూలో కీరన్ పొలార్డ్‌ ఔట్ అని తేలడంతో విరాట్ కోహ్లీ సంతోషంగా చప్పట్లు కొడుతూ రిషబ్ పంత్‌ను మెచ్చుకున్నాడు.

ఫీల్డర్లను సెట్‌ చేయడం

ఫీల్డర్లను సెట్‌ చేయడం

టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని మైదానంలో ఉన్నప్పుడు ఫీల్డర్లను సెట్‌ చేయడం, బౌలర్లకు సూచనలు లాంటివి చేస్తుంటాడు. ఇక, డీఆర్ఎస్‌ను అభిమానులు ముద్దుగా ధోని రివ్యూ సిస్టమ్ అని కూడా పిలుస్తుంటారు. ఇప్పుడు అచ్చం ధోనిలాగే రిషబ్ పంత్ కూడా ఎదుగుతుండటం విశేషం.

టీ20ల్లో ప్రపంచ రికార్డును బద్దలు కొట్టిన రోహిత్‌ శర్మ.. రైనాను దాటినా కోహ్లీ

పంత్‌పై సోషల్ మీడియాలో ప్రశంసలు

పంత్‌పై సోషల్ మీడియాలో ప్రశంసలు

ధోని గైర్హాజరుని యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్ చక్కగా వినియోగించుకోవాలని కెప్టెన్ విరాట్ కోహ్లీ తొలి టీ20కి ముందు నిర్విహించిన మీడియా సమావేశంలో పేర్కొన్నాడు. దీంతో తొలి టీ20లో ధోనీని మరిపించిన యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్‌పై సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

Story first published: Monday, August 5, 2019, 12:01 [IST]
Other articles published on Aug 5, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+