The King of T20Is: విండిస్ పర్యటనలో రోహిత్ శర్మ రికార్డుల మోత

హైదరాబాద్: టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ ఆదివారం అంతర్జాతీయ టీ20ల్లో ఓ ప్రపంచ రికార్డుని బద్దలు కొట్టాడు. అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాడిగా అరుదైన ఘనత సాధించాడు. ఈ జాబితాలో ఇప్పటివరకు 105 సిక్సర్లతో అగ్రస్థానంలో ఉన్న క్రిస్ గేల్‌ను రోహిత్ శర్మ 107 సిక్సర్లతో అధిగమించాడు.
వెస్టిండిస్ పర్యటనకు ముందు రోహిత్ శర్మ 102 సిక్సర్లతో ఉన్నాడు. ప్లోరిడా వేదికగా శనివారం జరిగిన తొలి టీ20లో రెండు సిక్సర్లు బాదిన రోహిత్ శర్మ... ఆదివారం జరిగిన రెండో టీ20లో మూడు సిక్సర్లతో యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ రికార్డును బద్దలు కొట్టాడు. మార్టిన్ గుప్టిల్(103) ఈ జాబితాలో మూడో స్థానంలో ఉన్నాడు.

కోహ్లీ రికార్డుని బద్దలు కొట్టిన రోహిత్ శర్మ
టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో రోహిత్ శర్మ అగ్రస్థానంలో నిలిచాడు. ఇప్పటివరకు 96 మ్యాచ్‌లు ఆడిన రోహిత్ శర్మ 2422 పరుగులు చేయగా... 69 మ్యాచ్‌ల్లో 2310 పురుగులతో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. ఇక, న్యూజిలాండ్ ఓపెనర్ మార్టిన్ గుప్టిల్ (76 మ్యాచ్‌ల్లో 2272 పరుగులు) మూడో స్థానంలో ఉన్నాడు.

టీ20ల్లో అత్యధిక సెంచరీలు
నాలుగు సెంచరీలతో అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా రోహిత్ శర్మ నిలిచాడు. ఇక, టీ20ల్లో అత్యధిక హాఫ్ సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో కెప్టెన్ విరాట్ కోహ్లీని సైతం రోహిత్ శర్మ అధిగమించాడు. టీ20ల్లో విరాట్ కోహ్లీ 20కిపైగా హాఫ్ సెంచరీలు చేయగా... రోహిత్ శర్మ 21 హాఫ్ సెంచరీలు(17 హాఫ్ సెంచరీలు+4 సెంచరీలు)తో అగ్రస్థానంలో నిలిచాడు.
రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ సెంచరీ.. స్మిత్ అరుదైన రికార్డు

టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాట్స్‌మన్
మొత్తంగా టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాట్స్‌మన్‌గా సురేశ్ రైనా (8369)ను విరాట్ కోహ్లీ(8393) అధిగమించాడు. విండిస్‌తో ఆదివారం జరిగిన రెండో టీ20లో విరాట్ కోహ్లీ 23 బంతుల్లో 28 పరుగులు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సురేశ్ రైనా రికార్డుని కోహ్లీ అధిగమించాడు. దీంతో పాటు అంతర్జాతీయ టీ20ల్లో ఎక్కువ ఫోర్లు బాదిన ఆటగాడిగా కోహ్లీ (225). దిల్షాన్ (223)ను అధిగమించాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications