న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పటిష్ట భద్రత కల్పిస్తాం.. భారత జట్టు కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నాం

Davis Cup 2019: Pakistan tennis chief Salim Saifullah Khan promises India full-proof security

న్యూఢిల్లీ: పాకిస్తాన్‌లో పర్యటించే భారత జట్టు కోసం పటిష్ట భద్రత కల్పిస్తాం. భారత జట్టు కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నాం అని పాకిస్థాన్ టెన్నిస్ సంఘం అధ్యక్షుడు సైఫుల్లా ఖాన్ స్పష్టం చేశారు. డేవిస్ కప్‌లో భాగంగా భారత టెన్నిస్ జట్టు సెప్టెంబర్‌లో పాకిస్థాన్‌లో పర్యటించాల్సి ఉంది. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతల పరిస్థితుల నేపథ్యంలో.. ఇస్లామాబాద్ చేరుకోవడానికి ముందే పటిష్ట భద్రత కల్పిస్తేనే పాక్‌లో ఆడతామని ఇప్పటికే ఆటగాళ్లు స్పష్టం చేశారు.

సర్ఫరాజ్‌ను కెప్టెన్‌గా తొలగించండి.. నన్ను కొనసాగించండి!!

ఈ నేపథ్యంలో సైఫుల్లా ఖాన్ భారత ప్లేయర్లకు పూర్తిస్థాయి భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చారు. 'భారత జట్టు కోసం ఆత్రంగా ఎదురుచూస్తున్నాము. భారతీయ అభిమానులకు మరియు ఆటగాళ్లకు మంచి ఏర్పాట్లు చేసాం. టోర్నీని చాలా సురక్షితమైన వాతావరణంలో హోస్ట్ చేస్తున్నాం. ఇరు దేశాలు బాంబులకు బదులు టెన్నిస్ బంతులు విసురుకుంటే బాగుంటది. పాకిస్తాన్ ఆతిథ్యంతో భారత జట్టు సంతోషంగా ఉంటుందని నాకు నమ్మకం ఉంది' అని సైఫుల్లా ఖాన్ పేర్కొన్నాడు.

టెన్నిస్ వరల్డ్‌కప్‌లో భాగంగా సెప్టెంబర్‌ 14న ఇస్లామాబాద్‌ వేదికగా భారత్‌-పాక్‌ మధ్య ఆసియా, ఓసియానియా గ్రూప్‌ సమరం ప్రారంభం కానుంది. ప్రజ్నేష్ గున్నేశ్వరన్ నాయకత్వం వహించే భారత జట్టు డేవిస్‌కప్‌ కోసం 55 ఏళ్ల సుదీర్ఘ కాలం తర్వాత పాకిస్థాన్‌ వెళ్లబోతోంది. 1964 తర్వాత భారత డేవిస్‌కప్‌ జట్టు పాక్‌లో పర్యటించనుండటం ఇదే తొలిసారి.

యువీని బాధిస్తున్న వెన్నునొప్పి.. రిటైర్డ్‌ హర్ట్‌గా పెవిలియన్‌కు

పాక్‌లో చివరిగా ఆడినప్పుడు భారత్‌ 4-0తో విజయం సాధించింది. డేవిస్‌ కప్‌లో పాకిస్థాన్‌పై భారత్‌ 6-0తో తిరుగులేని ఆధిక్యంలో ఉంది. పాకిస్థాన్‌ వెళ్లబోతున్న భారత జట్టును ఈ నెల 5న (ఈ రోజు) ఎంపిక చేయనున్నారు. గత ఫిబ్రవరిలో కోల్‌కతాలో ఇటలీతో తలపడిన జట్టే దాదాపు బరిలోకి దిగే అవకాశం ఉంది.

Story first published: Monday, August 5, 2019, 15:12 [IST]
Other articles published on Aug 5, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X