న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

US Open 2020: అమ్మల జైత్రయాత్ర.. బోపన్న జోడీ నిష్క్రమణ.!

For first time in Grand Slam history, three Moms in US Open knockouts

న్యూయార్క్‌: ప్రతిష్ఠాత్మక యూఎస్‌ ఓపెన్‌లో అమ్మల జైత్రయాత్ర కొనసాగుతోంది. ఇప్పటికే అమెరికా స్టార్‌ సెరెనా విలియమ్స్‌ క్వార్టర్‌ ఫైనల్స్‌లో ప్రవేశించగా.. మరో ఇద్దరు అమ్మలు స్వెతానా పిరొంకోవా (బల్గేరియా), విక్టోరియా అజరెంకా (బెలారస్‌) కూడా టోర్నీలో ముందుంజ వేసారు. ఇలా.. ఒకేసారి ముగ్గురు అమ్మలు సింగిల్స్‌లో క్వార్టర్స్‌ చేరడం గ్రాండ్‌స్లామ్‌ చరిత్రలో ఇదే తొలిసారి కావడం విశేషం.

మమ్మీ త్రయం హవా

మమ్మీ త్రయం హవా

2016 డిసెంబర్‌లో మగ బిడ్డకు జన్మనిచ్చిన అజరెంకా ఆరు నెలలపాటు... 2018 ఏప్రిల్‌లో మగ బిడ్డకు జన్మనిచ్చిన పిరన్‌కోవా రెండేళ్లపాటు ఆటకు దూరమయ్యారు. యూఎస్‌ ఓపెన్‌తో పునరాగమనం చేసిన 33 ఏళ్ల పిరన్‌కోవా... అలీజి కార్నె (ఫ్రాన్స్‌)తో 2 గంటల 49 నిమిషాలపాటు జరిగిన ప్రిక్వార్టర్‌ ఫైనల్లో 6-4, 6-7 (5/7), 6-3తో గెలిచింది. 20వ సీడ్‌ ముకోవా (చెక్‌ రిపబ్లిక్‌)తో 2 గంటల 30 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్‌లో అజరెంకా 5-7, 6-1, 6-4తో నెగ్గింది. 2015 తర్వాత ఈ టోర్నీలో అజరెంకా క్వార్టర్‌ ఫైనల్‌ చేరింది. క్వార్టర్‌ ఫైనల్స్‌లో సెరెనాతో పిరన్‌కోవా; మెర్‌టెన్స్‌తో అజరెంకా తలపడతారు.

సోఫియాకు షాక్‌

సోఫియాకు షాక్‌

ప్రపంచ నాలుగో ర్యాంకర్, రెండో సీడ్‌ సోఫియా కెనిన్‌ (అమెరికా) ప్రిక్వార్టర్‌ ఫైనల్లోనే నిష్క్రమించింది. మంగళవారం జరిగిన ప్రిక్వార్టర్‌ ఫైనల్లో 16వ సీడ్‌ ఎలీసె మెర్‌టెన్స్‌ (బెల్జియం) 75 నిమిషాల్లో 6-3, 6-3తో సోఫియా కెనిన్‌కు షాక్‌ ఇచ్చి వరుసగా రెండో ఏడాది ఈ టోర్నీలో క్వార్టర్‌ ఫైనల్‌ చేరింది. సోఫియా ఓటమితో ప్రస్తుతం మహిళల సింగిల్స్‌లో టాప్‌-20 సీడింగ్స్‌లో ముగ్గురు మాత్రమే (సెరెనా-మూడో సీడ్, ఒసాకా-నాలుగో సీడ్, మెర్‌టెన్స్‌-16వ సీడ్‌) బరిలో మిగిలారు.

ఒకవైపు రెండో సీడ్‌ సోఫియా కెనిన్‌ (అమెరికా) ప్రిక్వార్టర్‌ ఫైనల్లో వెనుదిరగగా... అమెరికాకే చెందిన 28వ సీడ్‌ జెన్నిఫర్‌ బ్రేడీ తన కెరీర్‌లోనే తొలిసారి ఓ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీలో సెమీఫైనల్‌కు చేరింది. మంగళవారం జరిగిన మహిళల సింగిల్స్‌ తొలి క్వార్టర్‌ ఫైనల్లో ప్రపంచ 41వ ర్యాంకర్‌ బ్రేడీ 6-3, 6-2తో 23వ సీడ్, ప్రపంచ 35వ ర్యాంకర్‌ పుతింత్‌సెవా (కజకిస్తాన్‌)ను ఓడించింది.

థీమ్‌ తడాఖా...

థీమ్‌ తడాఖా...

ప్రపంచ నంబర్‌వన్‌ జొకోవిచ్‌ (సెర్బియా)పై అనర్హత వేటు పడటంతో పురుషుల సింగిల్స్‌ విభాగంలో ఈసారి కొత్త చాంపియన్‌ రావడం ఖాయమైంది. టైటిల్‌ ఫేవరెట్స్‌లో ఒకడైన రెండో సీడ్, డొమినిక్‌ థీమ్‌ (ఆస్ట్రియా) ప్రిక్వార్టర్‌ ఫైనల్లో పూర్తి ఆధిపత్యం చలాయిస్తూ 15వ సీడ్‌ ఫీలిక్స్‌ అగుర్‌ అలియసిమ్‌ (కెనడా)పై 7-6 (7/4), 6-1, 6-1తో నెగ్గి ఈ టోర్నీలో రెండోసారి క్వార్టర్‌ ఫైనల్లోకి ప్రవేశించాడు. ఇతర ప్రిక్వార్టర్‌ ఫైనల్స్‌లో మూడో సీడ్‌ మెద్వెదెవ్‌ (రష్యా) 6-4, 6-1, 6-0తో టియాఫో (అమెరికా)పై, పదో సీడ్‌ రుబ్లెవ్‌ (రష్యా) 4-6, 6-3, 6-3, 6-3తో ఆరో సీడ్‌ బెరెటిని (ఇటలీ)పై నెగ్గారు. క్వార్టర్‌ ఫైనల్స్‌లో రుబ్లెవ్‌తో మెద్వెదెవ్‌; మినార్‌తో థీమ్‌ ఆడతారు.

బోపన్న జోడీ ఔట్..

బోపన్న జోడీ ఔట్..

పురుషుల డబుల్స్‌లో రోహన్‌ బోపన్న (భారత్‌)-షపోవలోవ్‌ (కెనడా) జంట క్వార్టర్‌ ఫైనల్లో నిష్క్రమించింది. బోపన్న-షపోవలోవ్‌ ద్వయం 5-7, 5-7తో జీన్‌ జూలియన్‌ రోజర్‌ (నెదర్లాండ్స్‌)-హరియా టెకావ్‌ (రొమేనియా) జోడీ చేతిలో ఓడిపోయింది. గంటా 26 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో బోపన్న ద్వయం ఐదు డబుల్‌ ఫాల్ట్‌లు, 17 అనవసర తప్పిదాలు చేసింది. క్వార్టర్‌ ఫైనల్లో ఓడిన బోపన్న జంటకు 91 వేల డాలర్లు (రూ. 67 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి.

England vs Australia:ఆఖరి టీ20 ఆసీస్‌దే.. టాప్ ర్యాంక్ పదిలం!

Story first published: Wednesday, September 9, 2020, 11:03 [IST]
Other articles published on Sep 9, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X