న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

England vs Australia:ఆఖరి టీ20 ఆసీస్‌దే.. టాప్ ర్యాంక్ పదిలం!

Mitchell Marsh Stars As Australia Beat England By 5 Wickets In 3rd T20I

సౌతాంప్టన్: ఇంగ్లండ్ గడ్డపై మూడు టీ20ల సిరీస్‌‌ను 2-1తో చేజార్చుకున్న ఆస్ట్రేలియా.. ఆఖరి టీ20లో గెలిచి పరువు దక్కించుకుంది. అలాగే టీ20 ఫార్మాట్‌ ర్యాంకింగ్స్‌లో తమ అగ్రస్థానాన్ని అందుకుంది. మంగళవారం రాత్రి జరిగిన మూడో టీ20లో ఆసీస్ 5 వికెట్ల తేడాతో ఆతిథ్య ఇంగ్లండ్‌పై విజయం సాధించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 145 పరుగులు చేసింది. ఓపెనర్ బెయిర్‌స్టో (55) హాఫ్ సెంచరీతో చెలరేగగా.. మొయిన్ అలీ (23), జో డెన్లీ (29 నాటౌట్) రాణించారు. ఆసీస్ బౌలర్లలో ఆడమ్ జంపా రెండు వికెట్లు తీయగా.. స్టార్క్, హజల్‌వుడ్, రిచర్డ్‌సన్, అగర్ తలో వికెట్ తీశారు.

అనంతరం లక్ష్య చేధనకు దిగిన ఆసీస్ 19.3 ఓవర్లలో 5 వికెట్లకు 146 పరుగులు చేసి 3 బంతులు మిగిలుండగానే గెలుపొందింది. కెప్టెన్ అరోన్ ఫించ్ (39) దూకుడుగా ఆడగా.. మిచెల్ మార్ష్ (39 నాటౌట్), మార్కస్ స్టోయినిస్ (26) బాధ్యతాయుత ఇన్నింగ్స్‌తో విజయంలో కీలకపాత్ర పోషించారు. ఇంగ్లండ్ బౌలర్లలో ఆదిల్ రషీద్ మూడు వికెట్లు తీయగా.. టామ్ కరన్, మార్క్ వుడ్ తలో వికెట్ తీశారు. ఇక శుక్రవారం నుంచి మూడు వన్డేల సిరీస్‌ మాంచెస్టర్ వేదికగా ప్రారంభంకానుంది.

బెయిర్‌స్టో సూపర్ ఫిఫ్టీ..

బెయిర్‌స్టో సూపర్ ఫిఫ్టీ..

తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్‌కు ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. ఓపెనర్ టామ్ బాంటన్(2)ను హజల్‌వుడ్ కీపర్ క్యాచ్‌గా పెవిలియన్ చేర్చాడు. ఇక గత మ్యాచ్ హీరో జోస్ బట్లర్ చేతి వేలి గాయంతో ఈ మ్యాచ్‌కు దూరం కాగా అతని స్థానంలో జట్టుకు వచ్చి జానీ బెయిర్ స్టో అద్భుత ప్రదర్శన కనబర్చాడు. ఫస్ట్ డౌన్ బ్యాట్స్‌ మలన్(21) సాయంతో ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. అయితే మలన్‌ను జంపా క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చడంతో రెండో వికెట్‌కు నమోదైన 49 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. తర్వాత క్రీజులోకి వచ్చిన బిల్లింగ్స్(4) దారుణంగా విఫలమయ్యాడు.

రాణించిన అలీ, డెన్లీ..

రాణించిన అలీ, డెన్లీ..

కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ గైర్హాజరీతో తాత్కాలిక సారథ్య బాధ్యతలు తీసుకున్న మోయిన్ అలీ(23) ఫర్వాలేదనిపించాడు. ఈ క్రమంలోనే బెయిర్ స్టో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అనంతరం అగర్ బౌలింగ్‌లో రిట్నర్ క్యాచ్‌గా వెనుదిరిగాడు. మరికొద్ది సేపటికే మోయిన్ అలీ కూడా ఔటవ్వగా.. డెన్లీ(29) ధాటిగా ఆడటంతో ఇంగ్లండ్ 145 పరుగులు చేయగలిగింది.

డేవిడ్ వార్నర్ దూరం..

డేవిడ్ వార్నర్ దూరం..

ఈ మ్యాచ్‌కు మూడు మార్పులతో బరిలోకి దిగిన ఆసీస్.. డేవిడ్ వార్నర్, ప్యాట్ కమిన్స్‌లకు విశ్రాంతి ఇవ్వడంతో పాటు అలెక్స్ క్యారీపై వేటు వేసింది. వీరి స్థానంలో మాథ్యూ వేడ్, మిచెల్ మార్ష్, జోష్ హజల్‌వుడ్‌లను తుది జట్టులోకి తీసుకుంది. వార్నర్ స్థానంలో ఓపెనింగ్ చేపట్టిన మాథ్యూ వేడ్(14) విఫలమయ్యాడు. ఇంగ్లండ్ ఫీల్డింగ్ వైఫల్యంతో లభించిన అవకాశాలను కూడా అందుకోలేకపోయాడు. మరోవైపు కెప్టెన్ ఆరోన్ ఫించ్ ధాటిగా ఆడాడు. మార్కస్ స్టోయినిస్(26) సాయంతో జట్టు స్కోర్‌ను పరుగెత్తించాడు.

దెబ్బతీసిన రషీద్..

ఇక నిలకడగా సాగుతున్న ఆసీస్ ఇన్నింగ్స్‌ను సామ్ కరన్.. స్టోయినిస్‌ను ఔట్ చేసి దెబ్బతీశాడు. అతనికి తోడుగా ఆదిల్ రషీద్.. ఫించ్, మ్యాక్స్‌వెల్, స్టీవ్ స్మిత్‌లను ఔట్ చేసి మ్యాచ్‌ను ఇంగ్లండ్ వైపు తిప్పాడు. ఈ పరిస్థితుల్లో మార్ష్ అద్భుత బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడు. అగర్(19 నాటౌట్) సాయంతో నిదానంగా ఆడుతూ విజయాన్నందించాడు. జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన మిచెల్ మార్ష్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ దక్కగా.. సిరీస్ ఆద్యాంతం అదరగొట్టిన జోస్ బట్లర్‌కు మ్యాన్ ఆఫ్ ది సిరీస్ దక్కింది.

Story first published: Wednesday, September 9, 2020, 10:28 [IST]
Other articles published on Sep 9, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X