న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కరోనా తెచ్చిన కష్టం.. ఫుడ్ డెలివరీ బాయ్‌గా మారిన ఒలింపిక్ విజేత

Japanese Olympic Medallist Becomes A Food Delivery Boy

టోక్యో: కరోనా వైరస్‌తో యావత్ ప్రపంచం అతలాకుతలమైంది. ఈ మహమ్మారి ధాటికి అగ్రరాజ్యలే అల్లాడుతున్నాయి. అన్ని రంగాలపై ఈ ప్రాణాంతక వైరస్ ప్రభావం పడింది. క్రీడా టోర్నీలన్నీ పూర్తిగా నిలిచిపోయాయి. ఒలింపిక్స్ వచ్చే ఏడాదికి వాయిదాపడ్డాయి. ప్రపంచం మొత్తం స్వియనిర్భంధంలోకి వెళ్లింది. ఆటగాళ్లంతా ఇళ్లకే పరిమితయ్యారు. ఈ పరిస్థితుల్లో వారి ఫిట్‌నెస్ కాపాడుకోవడం వారికి ఓ సవాల్‌గా మారింది. చాలా మంది ఆటగాళ్లు ఇంట్లోనే అందుబాటులో ఉన్న వస్తువులతోనే ఫిట్‌నెస్ కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు.

ఒలిపింక్ విజేత ఫుడ్ డెలివరీ చేస్తూ..

ఒలిపింక్ విజేత ఫుడ్ డెలివరీ చేస్తూ..

కానీ జపాన్‌కు చెందిన ఫెన్సింగ్ క్రీడాకారుడు, ఒలింపిక్‌ విజేత ర్యో మియాకే మాత్రం డెలివరీ బాయ్‌గా అవతారమెత్తాడు. దీనివల్ల తన ఫిట్‌నెస్ కాపాడుకోవడంతో పాటు ఈ క్లిష్ట పరిస్థితుల్లో రోజువారి ఖర్చులకు కావాల్సిన డబ్బు సంపాందించుకోవచ్చని ఈ నిర్ణయం తీసుకున్నాడు. 2012 లండన్ ఒలింపిక్స్‌లో సిల్వర్ మెడల్ సాధించిన జపాన్ ఫెన్సింగ్ టీమ్‌లో రియోమైకల్ ఒకడు.

ఈ ఏడాది జరగాల్సిన టోక్యో ఒలిపింక్స్ అతను సిద్దమైనప్పటికీ.. ఈ జపాన్ ఫెన్సర్ ఆశలపై కరోనా నీళ్లు చల్లింది.

ఒలింపిక్స్ వాయిదా పడటంతో..

ఒలింపిక్స్ వాయిదా పడటంతో..

ఈ మహమ్మారి దెబ్బకు ఈ ఏడాది జరగాల్సిన ఈ మెగా ఈవెంట్‌ను వచ్చే ఏడాదికి వాయిదా వేసారు. అలాగే కరోనా కారణంగా దేశంలో లాక్‌డౌన్ విధించిడంతో తన ప్రిపరేషన్ ఆగిపోయింది. జిమ్‌లు మూతపడ్డాయి. దీంతో తన ఫిట్‌నెస్‌ను కాపాడుకోవడం అతనికి ఓ సవాల్‌గా మారింది. ఈ క్రమంలో ఉబర్ ఈట్స్ డెలివరీ బాయ్‌గా ఉద్యోగం చేస్తూ.. సైకిల్‌పై ఫుడ్ డెలివరీ చేస్తున్నాడు. సైకిల్ తొక్కుతూ ఫిట్‌నెస్‌తో పాటు తనకు కావాల్సిన ఆదాయాన్ని పొందుతున్నాడు.

నా మనస్సాక్షి అంగీకరించలేదు..

నా మనస్సాక్షి అంగీకరించలేదు..

తనకు స్పాన్సర్స్‌గా వ్యవహరించిన కంపెనీల నుంచి ఈ క్లిష్ట పరిస్థితుల్లో డబ్బు తీసుకోవడానికి తన మనస్సాక్షి అంగీకరించడలేదని ర్యో మియాకే తెలిపాడు. అందుకే డబ్బు తీసుకోవడం ఆపేసి సొంత ఖర్చుల కోసం కష్టపడుతున్నానని తెలిపాడు.

‘ఈ విపత్కర పరిస్థితుల్లో స్పాన్సర్ల నుంచి డబ్బు తీసుకోవడానికి నా మనస్సాక్షి ఒప్పుకోవడం లేదు. ప్రస్తుతానికి స్పాన్సర్షిప్‌ను ఆపేయాలని నా స్పాన్సర్లకు చెప్పాను. కరోనా కారణంగా లాక్‌డౌన్ విధించడంతో జిమ్‌లు మూతపడ్డాయి. దీంతో ఫిట్‌నెస్ కాపాడుకోవడంతో పాటు డబ్బుల సంపాదించే మార్గం గురించి ఆలోచిస్తుంటే ఈ డెలివరీ బాయ్ ఐడీయా వచ్చింది. సైకిల్‌పై ఫుడ్ డెలివరీ చేస్తే డబ్బులతో పాటు నా ఫిట్‌నెస్ కాపాడుకోవచ్చని భావించా. కరోనా వైరస్ భారిన పడే ప్రమాదం కూడా తక్కువ. నేను డెలివరీ వస్తువులను కస్టమర్ల డోర్ల ముందే ఉంచుతాను. వారితో కాంటాక్ట్ అవ్వను'అని రాయిటర్స్‌కు తెలిపాడు.

రోజుకు రూ.1400

రోజుకు రూ.1400

ఇక ఫుడ్ డెలివరీ ద్వారా తాను రోజుకు 18.60 అమెరికన్ డాలర్లు(రూ.1403) సంపాదిస్తున్నాని ఈ జపాన్ ఫెన్సర్ చెప్పుకొచ్చాడు. కానీ స్పాన్సర్లను కాదని తాను జీవించడానికి ఇది సరిపోదని, మరిన్నీ డబ్బులు సంపాదించడానికి ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నానని తెలిపాడు.

ముంబై- చెన్నై ఆల్ టైమ్ ఎలెవన్‌లో అసలు చాంపియన్‌ను మర్చిపోయాం: రోహిత్

Story first published: Thursday, May 14, 2020, 21:42 [IST]
Other articles published on May 14, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X