న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ముంబై- చెన్నై ఆల్ టైమ్ ఎలెవన్‌లో అసలు చాంపియన్‌ను మర్చిపోయాం: రోహిత్

Rohit Sharma We missed out real champion in MI-CSK combined XI

ముంబై: ఇటీవల ఇన్‌స్టా లైవ్ సెషెన్ నిర్వహించిన టీమిండియా సీనియర్ క్రికెటర్లు రోహిత్ శర్మ, సురేశ్ రైనా క్రికెట్‌కు సంబంధించిన చాలా విషయాలను అభిమానులతో పంచుకున్నారు. ధోనీ భవితవ్యంపై చర్చించారు. ముంబై-చెన్నై ఆల్‌టైమ్ టీమ్‌ను ఎంపిక చేశారు. ఈ జట్టులో తమ పేర్లు ప్రకటించుకోకుండా ముందే ఒప్పందం కుదుర్చుకున్న ఈ స్టార్ క్రికెటర్లు.. కోచ్, అసిస్టెంట్ కోచ్‌ పదవులకే తమ పేర్లను పరిమితం చేశారు.

ఐపీఎల్‌లో అత్యంత విజయవంతమైన ఈ రెండు జట్ల నుంచి ఆల్‌టైమ్ సూపర్ టీమ్‌ను ఎంపిక చేశారు. దీనికి వరల్డ్ బెస్ట్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీనే సారథని ప్రకటించారు. ఈ టీమ్ వివరాలను ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ తన ట్విటర్ అకౌంట్‌లో కూడా షేర్ చేసింది.

నలుగురు ఆల్‌రౌండర్లు..

నలుగురు ఆల్‌రౌండర్లు..

ఓపెనర్లుగా సచిన్ టెండూల్కర్, మాథ్యూ హెడెన్ ఎంపిక చేసిన ఈ క్రికెటర్లు.. మూడు, నాలుగు స్థానాల్లో ఫాఫ్ డూప్లెసిస్, అంబటి రాయుడులను తీసుకున్నారు. వికెట్ కీపర్‌గా మహేంద్ర సింగ్ ధోనీని ఎంపిక చేసిన రైనా-రోహిత్.. ఆశ్చర్యకరంగా.. మొత్తం నలుగురు ఆల్‌రౌండర్లను తీసుకున్నారు. కీరన్ పోలార్డ్, హార్దిక్ పాండ్యా, డ్వేన్ బ్రావో, రవీంద్ర జడేజాలను ఎంపికచేశారు. స్పెషలిస్ట్ బౌలర్లుగా జస్‌ప్రీత్ బుమ్రా, హర్భజన్ సింగ్‌లను తీసుకున్నారు.

రియల్ చాంప్‌ను మిస్సయ్యాం..

అంతా బాగానే ఉంది. కానీ ముంబై ఇండియన్స్ ట్వీట్ చూసిన తర్వాత రోహిత్ మెదళ్లో ఓ విషయం వెలిగింది. తాము రియల్ చాంపియన్ పేరు మర్చిపోయామని గుర్తు‌కు వచ్చింది. వెంటనే తాము చేసిన తప్పును రోహిత్ తెలియజేశాడు.

ముంబై ఇండియన్స్ ట్వీట్‌కు బదులిస్తూ.. ‘మేం రియల్ చాంపియన్‌ను మిస్సయ్యాం. మలీ నాదే తప్పు' అంటూ ట్వీట్ చేశాడు. ఇంతకీ ఈ మలీ ఎవరనుకుంటున్నారా? గతేడాది చెన్నైతో జరిగిన టైటిల్‌ ఫైట్‌లో ఆఖరి బంతికి విజయాన్నందించిన ఆ జట్టు స్టార్ పేసర్ లసిత్ మలింగా. అవును ఈ శ్రీలంక పేసర్‌ను రోహిత్ ముద్దుగా మలీ అని పిలుస్తాడు.

ఇద్దరే స్పెషలిస్ట్ బౌలర్లు..

ఇద్దరే స్పెషలిస్ట్ బౌలర్లు..

ఆల్‌టైమ్‌ టీమ్‌‌లో ఏకంగా నలుగురు ఆల్‌రౌండర్లను తీసుకున్న రోహిత్-రైనా ఇద్దరే స్పెషలిస్ట్ బౌలర్లను ఎంచుకున్నారు. అది కడా జస్‌ప్రీత్ బుమ్రా, హర్భజన్ సింగ్‌లను తీసుకున్నారు. కానీ తమ జట్టుకు ఎన్నో విజయాలందించిన మలింగాను మాత్రం రోహిత్ విస్మరించాడు. దీంతో తన తప్పును తెలుసుకున్న హిట్ మ్యాన్ ఇదే విషయాన్ని క్రికెట్ ప్రపంచానికి తెలియజేశాడు.

చెన్నై-ముంబై ఆల్‌టైమ్ టీమ్..

చెన్నై-ముంబై ఆల్‌టైమ్ టీమ్..

మాథ్యూ హెడెన్, సచిన్ టెండూల్కర్, ఫాఫ్ డూప్లెసిస్, అంబటి రాయుడు, ఎంఎస్ ధోనీ (కీపర్, కెప్టెన్), కీరన్ పోలార్డ్, హార్దిక్ పాండ్యా, డ్వేన్ బ్రావో, రవీంద్ర జడేజా, హర్భజన్ సింగ్, జస్‌ప్రీత్ బుమ్రా

అప్పులు తీర్చాలంటే ఆటంబాంబు అమ్ముకోవాలి: పాకిస్థాన్ మాజీ క్రికెటర్

Story first published: Thursday, May 14, 2020, 16:16 [IST]
Other articles published on May 14, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X