న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కరోనా కష్టం.. ఇంటి అద్దె చెల్లించలేని స్థితిలో భారత అథ్లెట్

House rent haunts special powerlifter Neha Rajak due To Lockdown

జంషెడ్‌పూర్: కరోనా తెచ్చిన కష్టం అంత ఇంతా కాదు. ఈ మహమ్మారి కట్టడికి దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ విధించడంతో ఎంతో మంది అభాగ్యులు రోడ్డున పడ్డారు. పనుల్లేక పస్తులుంటున్నారు. ఈ కరోనా కాటుకు మొదట వలస కూలీలు బలయ్యారు. వారి ధీన గాథలు రోజూ చదువుతూనే ఉన్నాం. బుక్కెడు బువ్వ కోసం వారు పడే కష్టాల గురించి వింటూనే ఉన్నాం. బతుకు జీవుడా అంటూ కాళ్లనే నమ్ముకుని సొంతూళ్లకు పయనమైన దృశ్యాలను చూస్తూనే ఉన్నాం.

కానీ అతంతర్జాతీయ వేదికగా తన సత్తాచాటి మువ్వెన్నల జెండాను రెపరెపలాడించి ఓ క్రీడాకారిణి కూడా ఇదే పరిస్థితిని ఎదుర్కొంటుంది. పవర్ లిప్టింగ్ ఆటలో ఎన్నో బరువులు ఎత్తిన జార్ఖండ్‌కు చెందిన నేహా రజక్.. ఈ కరోనా భారాన్ని మాత్రం మోయలేకపోతుంది. ఆమె ధీన గాథ కరోనా రక్కసిలో క్రీడాకారులు పడుతున్న ఆవేదనను తెలియజేస్తుంది.

ఉపాధిని లాక్కున్న లాక్‌డౌన్

ఉపాధిని లాక్కున్న లాక్‌డౌన్

రజక వృత్తినే నమ్ముకున్న ఆమె తండ్రి ఉపాధిని లాక్‌డౌన్ లాక్కేసు కోవడంతో అతని ఆదాయంపైనే జీవించే ఆ కుటుంబం కష్టాలను ఎదుర్కొంటుంది. ఆమె ధీన స్థితిని వివరిస్తూ టెలిగ్రాఫ్ ఓ కథనం రాయడంతో ఆ కుటుంబానికి కొంతమంది సాయం చేశారు. నిత్యవసర సరకులు అందజేశారు. కానీ అవి ఆమె కష్టాలను తొలగించలేకపోయాయి.

గత మూడు నెలలుగా ఇంటి అద్దె చెల్లించలేకపోవడంతో కుటుంబంతో సహా రోడ్డున పడే పరిస్థితి నెలకొంది. ఎప్పుడూ యాజమాని ఇళ్లు ఖాళీ చేయమంటాడా? అని బిక్కు బిక్కుమంటూ ఆ కుటుంబం తీవ్ర మనోవేదనకు గురవుతుంది. ఇక వచ్చే వారం లాక్‌డౌన్ సడలింపులతో తమకు మేలు జరుగుతుందని నేహా రజక్ తండ్రి వినోద్ ఆశాభావం వ్యక్తం చేశాడు.

 చిల్లి గవ్వలేదు..

చిల్లి గవ్వలేదు..

‘గత మూడు నెలలుగా ఇంటి అద్దె చెల్లించడం లేదు. అద్దె చెల్లించడానికి మే 23 చివరి తేదీ. కానీ నా దగ్గర చిల్లి గవ్వ కూడా లేదు. ఏం చేయాలో అర్థం కావడం లేదు. వచ్చే వారం లాక్ డౌన్‌లో సడలింపులు ఇస్తే షాపులు తెరుచుకోవచ్చు. నా పని నేను చేసుకోవచ్చు. అప్పుడు మా యజమానిని మరో నెల గడువు ఇవ్వమని, జీతం వచ్చాక అద్దె చెల్లిస్తానని బతిమాలాడుకోవచ్చు.'అని బిస్తాపూర్‌లోని ఓ లాండ్రీ షాప్‌లో పనిచేసే వినోద్ చెప్పుకొచ్చాడు.

లాక్ డౌన్ కారణంగా తమ కుటుంబంలో ఎవరికీ పని లేకుండా పోయిందని వినోద్ ఆవేదన వ్యక్తం చేశాడు. నిత్యవసర వస్తువులు కొనుగోలు చేయడానికి కూడా ఇబ్బందిగా ఉందన్నాడు. ‘మేం చాలా క్లిష్ట స్థితిలో ఉన్నాం. డబ్బుల్లేక ఇంటి అద్దెను కూడా చెల్లించలేదు. లాక్‌డౌన్‌తో నా భార్యకు నాకు పనిలేకుండా పోయింది. మాకు సాయంగా అందించిన డబ్బులతో మేం ఎక్కువ రోజులు జీవించలేం. ఈ కరోనా మా జీవితంలో గందరగోళం సృష్టించింది' అని వినోద్ తన బాధను చెప్పుకున్నాడు.

టెలిగ్రాఫ్ కథనం.. ముందుకొచ్చిన దాతలు..

టెలిగ్రాఫ్ కథనం.. ముందుకొచ్చిన దాతలు..

వీరి ధీన స్థితిని తెలియజేస్తూ ఏప్రిల్ 26న టెలిగ్రాఫ్ ఓ కథనం ప్రచురించగా.. దాతలు ముందుకొచ్చి సాయం చేశారు. స్పెషల్ ఒలింపిక్స్ జార్ఖండ్ అసిస్టెంట్ ఏరియా డైరెక్టర్ సత్‌బిర్ సింగ్ సహోట రూ.5000 నగదుతో పాటు నిత్యవసర వస్తువులు అందజేశాడు. లండన్‌కు చెందిన ఓ వ్యాపారి రూ.10 వేలు రూపాయిలిచ్చాడు.

ఇక గతేడాది అబుదాబి వేదికగా జరిగిన స్పెషల్ ఒలింపిక్స్ ఇంటర్నేషనల్ వరల్డ్ సమ్మర్ గేమ్స్‌లో నేహా మొత్తం నాలుగు బ్రాంజ్ మెడల్స్ గెలుచుకుంది. కేంద్ర క్రీడాశాఖ ఆర్థిక సాయంగా ఇస్తానన్న రూ.4 లక్షల కోసం ఎదురు చూస్తుంది. ఇక టెలిగ్రాఫ్‌కు కథనంకు స్పందించిన రాష్ట్ర క్రీడాశాఖ లాక్‌డౌన్ అనంతరం క్రీడా సంక్షేమ శాఖ కింద రూ.2 లక్షలు అందజేస్తామని ప్రకటించింది.

ఐపీఎల్ రద్దయితే భారత క్రికెటర్ల జీతాల్లో కోత తప్పదు: దాదా

Story first published: Friday, May 15, 2020, 14:39 [IST]
Other articles published on May 15, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X