న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'బుమ్రా చిచ్చా.. అండర్సన్ మామ 600 వికెట్లు తీసిండు..నువ్వు కమ్‌సే‌కమ్ 400 తీయాలి'

Yuvraj Singh Sets A Minimum Target For Japsrit Bumrah After James Anderson’s 600 Test wickets

న్యూఢిల్లీ: పాకిస్థాన్‌తో ముగిసిన మూడు టెస్ట్‌ల సిరీస్‌లో 600 వికెట్ల ఘనతను అందుకున్న ఇంగ్లండ్ పేసర్ జేమ్స్ అండర్సన్‌పై సర్వత్రా ప్రశంసల జల్లు కురుస్తుంది. సంప్రదాయక ఫార్మాట్‌లో ఈ ఘనత అందుకున్న తొలి పేసర్‌గా అండర్సన్ గుర్తింపుపొందాడు. పేస్ దిగ్గజాలు కపిల్ దేవ్(భారత్), కోట్నీ వాల్ష్(వెస్టిండీస్), గ్లేన్ మెక్‌గ్రాత్( ఆస్ట్రేలియా) వల్ల కానీ అసాధరణమైన రికార్డును అండర్సన్ 38 ఏళ్ల వయసులో అందుకొని ఔరా అనిపించాడు. దీంతో జిమ్మీపై అభిమానులు, మాజీ క్రికెటర్లు, సహచర ఆటగాళ్లు, ఇతర దేశ ఆటగాళ్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.

బుమ్రాకు యువీ టార్గెట్..

ఈ నేపథ్యంలో టీమిండియా స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా కూడా అండర్సన్‌ను కొనియాడాడు. ‘జిమ్మీ అద్భుతమైన ఘనతను అందుకున్న నీకు అభినందనలు. ఆటపై నీకు ప్రేమ, మక్కువ, అంకిత భావం అసాధారణం. భవిష్యత్తులో ఇలాంటి ఘనతలు నీవు ఇంకా సాధించాలి'అని బుమ్రా ట్వీట్ చేశాడు. అయితే ఈ ట్వీట్‌పై భారత మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ తనదైన శైలిలో స్పందించాడు. బుమ్రా.. నీ టార్గెట్ మినిమమ్ 400 వికెట్లు అంటూ లక్ష్యాన్ని నిర్ధేశించాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట్ వైరల్ అయింది.

బుమ్రా చిచ్చా నీకు సులువే..

యువీ కామెంట్‌పై నెటిజన్లు ఫన్నీగా స్పందిస్తున్నారు. ‘అండర్సన్ మామ 600 వికెట్లు తీసినప్పుడు నీకు 400 సులువే చిచ్చా'అంటూ ఒకరు కామెంట్ చేస్తే.. ‘యువీ.. నీ కామెంట్ చూస్తుంటే.. ఆ పిల్లాడికి అన్ని మార్కులు వచ్చాయి. నీకు రావాలని తండ్రులు పిల్లలకు చెబుతున్నట్లుంది'అని ఇంకొకరు కామెంట్ చేస్తున్నారు. 400 వికెట్ల ఏమో కానీ.. ఎంటైర్ కెరీర్‌లో 400 పరుగులు మాత్రమే ఇవ్వాలనే టార్గెట్ ఇస్తే అందుకుంటాడని ట్వీట్ చేస్తున్నారు. బుమ్రా 500 వికెట్లు కూడా తీయగలడని ఇంకకరు కామెంట్ చేశారు. ఇప్పటి వరకు 14 టెస్ట్‌లు ఆడిన బుమ్రా 68 వికెట్లు పడగొట్టాడు.

నా జీవితంలో చూస్తానను కోలేదు..

అంతకుముందు యువీ అండర్సన్‌పై ప్రశంసల జల్లు కురిపించాడు. తన జీవితంలో ఓ ఫాస్ట్ బౌలర్ 600 వికెట్లు తీస్తాడనుకోలేదని ట్వీట్ చేశాడు. ‘నా జీవితంలో ఓ ఫాస్ట్ బౌలర్ 600 వికెట్లు తీస్తాడని ఎప్పుడూ అనుకోలేదు. ఇది క్వాంటిటీ మాత్రమే కాదు. అతని బౌలింగ్ క్వాలిటీకి సంబంధించినది. నెమ్మదైన పిచ్‌లు, బౌన్స్, నో బౌన్స్, సీమ్ , నోసీమ్ ఇలా అతని పరిస్థితులతో సంబంధంలేదు. జిమ్మీ సర్ మీరు నిజంగా గ్రేట్. గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్‌టైమ్'అని యువరాజ్ కొనియాడాడు.

పాక్ కెప్టెన్ వికెట్‌తో...

పాక్ కెప్టెన్ వికెట్‌తో...

పాకిస్థాన్‌తో మంగళవారం ముగిసిన మ్యాచ్‌లో అండర్సన్ ఈ అరుదైన ఘనతను అందుకున్న విషయం తెలిసిందే. వర్షం అంతరాయం... అనంతరం అవుట్‌ఫీల్డ్‌ చిత్తడిగా ఉండటంతో చివరిరోజు రెండు సెషన్‌లలో ఆట సాధ్యపడలేదు. దాంతో అండర్సన్‌ ఖాతాలో 600వ వికెట్‌ చేరుతుందా లేదా అని ఉత్కంఠ పెరిగింది. అయితే టీ విరామం తర్వాత ఆట ఆరంభం కావడంతో అండర్సన్‌ వికెట్ల వేటపై గురి పెట్టాడు. తాను వేసిన 14వ బంతికి అండర్సన్‌కు వికెట్‌ దక్కింది. పాకిస్తాన్‌ కెప్టెన్‌ అజహర్‌ అలీ (31; 2 ఫోర్లు) ఇచ్చిన క్యాచ్‌ను ఇంగ్లండ్‌ కెప్టెన్‌ జో రూట్‌ స్లిప్‌లో అందుకోవడంతో అండర్సన్‌ ఖాతాలో 600వ వికెట్‌ చేరింది.

టిక్‌టాకర్లే ముఖ్యమా.. ప్రభుత్వంపై స్టార్ బాక్సర్ ఫైర్!

Story first published: Wednesday, August 26, 2020, 15:43 [IST]
Other articles published on Aug 26, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X