న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

కామెంట్రీ బాక్స్‌లో కూర్చొని ఆటగాళ్లను విమర్శించడం నచ్చదు: యువరాజ్

Yuvraj Singh Says not interested in being a commentator

న్యూఢిల్లీ: మైదానంలో విధ్వంసకర బ్యాటింగ్‌తో అభిమానులను అలరించిన భారత మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్.. లాక్‌డౌన్ వేళ అంతకన్నా ఎక్కువ ఎంటర్‌టైన్ చేస్తున్నాడు. అటు ఆటగాళ్లతో లైవ్ సెషన్స్.. ఇటు జర్నలిస్ట్‌లతో ఇంటర్వ్యూలు ఇస్తూ.. క్రికెట్‌కు సంబంధించిన ఆసక్తికర విషయాలతో అభిమానులకు కావాల్సిన మజానందిస్తున్నాడు.

 కైఫ్‌తో ఇన్‌స్టా లైవ్..

కైఫ్‌తో ఇన్‌స్టా లైవ్..

ముఖ్యంగా 2007 టీ20 ప్రపంచకప్‌లో తాను సృష్టించిన 6 బంతుల్లో 6 సిక్సర్ల విధ్వంసం వెనుక ఉన్న రహస్యాన్ని తెలిపిన ఈ సిక్సర్ల సింగ్.. తాజాగా కామెంట్రీ చేయడంపై పెదవి విప్పాడు. తనకు కామెంటరీ అంటే అంతగా ఇష్టం లేదని, అంతసేపు కూర్చుని మాట్లాడుతూ ఉండడమంటే తనవల్ల కాదని చెబుతూనే.. కుదిరితే ఐసీసీ ఈవెంట్లలో మాత్రం ట్రై చేస్తానంటూ తన మనసులోని మాటను బయట పెట్టాడు. తన సహచర ఆటగాడైన మహ్మద్ కైఫ్‌తో యువరాజ్ సింగ్ తాజాగా ఇన్‌స్టాగ్రాం లైవ్ సెషన్ నిర్వహించాడు. ‘కామెంటరీ చేసే ప్రాంతంలో కొందరు వ్యక్తులను నేను ఇష్టపడను. వారితో కలిసి రోజంతా కూర్చుని కామెంటరీ చెప్పడం నావల్ల కాదు. అయితే ఐసీసీ ఈవెంట్లలో కామెంటరీ చెప్పేందుకు నేను ప్రయత్నిస్తా.'అని యువరాజ్ అన్నాడు.

కామెంట్రీ చెప్పకపోవడానికి కారణం ఇదే..

కామెంట్రీ చెప్పకపోవడానికి కారణం ఇదే..

అంతేకాకుండా మైదానంలో ఉండే ఆటగాళ్లకు మాత్రమే అక్కడ ఉండే ఒత్తిడి తెలుస్తుందని, కామెంట్రీ బాక్స్‌లో కూర్చుని యువ ఆటగాళ్లను విమర్శించడం తనకిష్టంలేదని, కామెంట్రీని ఇష్టపడకపోవడానికి ఇది కూడా ఓ కారణమని ఈ మాజీ ఆల్‌రౌండర్ చెప్పుకొచ్చాడు. అయితే కుర్రాళ్లు ఏం చేస్తున్నారో వారికి తెలియాలని, కామెంటరీ చెప్పేవారు ఆటగాళ్లను విమర్శించకుండా వారికి మార్గదర్శనం చేయాలని యువీ అభిప్రాయపడ్డాడు.

సమర్ధించిన కైఫ్..

సమర్ధించిన కైఫ్..

ఇక మహ్మద్ కైఫ్ మాట్లాడుతూ యూవీ అభిప్రాయాన్ని సమర్థించాడు. ‘మనం కూడా ఒకప్పుడు క్రికెటర్లమే. అందుకే ఆటగాళ్లను దృష్టిలో ఉంచుకుని పరిస్థితిని దిగజార్చకుండా బ్యాలెన్స్‌గా కామెంటరీ చేయాల్సి ఉంటుంది'అని పేర్కొన్నాడు. ఈ నేపథ్యంలో 2002 లో ఇంగ్లండ్‌తో జరిగిన నాట్‌వెస్ట్ ఫైనల్ మ్యాచ్‌లో వారిద్దరూ కలిసి ఆడిన తీరును, జట్టు గెలుపులో భాగస్వామ్యమైన తీరును గుర్తు చేసుకున్నారు.

దూరం మరచి.. వైరం పెరిగి.. మైదానంలోనే చితక్కొట్టుకున్న ఆటగాళ్లు!! (వీడియో)

నాట్ వెస్ట్ సిరీస్‌లో యూవీ-కైఫ్..

నాట్ వెస్ట్ సిరీస్‌లో యూవీ-కైఫ్..

2002లో జరిగిన నాట్‌వెస్ట్ సిరీస్ ఫైనల్ మ్యాచ్‌లో భారత్ ముందు ఇంగ్లాండ్ 326 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. అయితే 146/5తో భారత్ పీకల్లోతు కష్టాల్లో నిలిచింది. ఈ సమయంలో యువరాజ్, కైఫ్‌లు నిలకడగా ఆడుతూ 121 పరుగుల భాగస్వామ్యంతో జట్టును విజయానికి చేరువ చేశారు. అయితే 69 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద యువరాజ్ అవుటైనా కైఫ్ చివరివరకు క్రీజులో ఉండి భారత్‌కు విజయాన్ని కట్టబెట్టాడు. చివరి మూడు బంతులు మిగిలుండగా.. రెండు వికెట్ల తేడాతో భారత్ విజయం సాధించింది. మ్యచ్ గెలిచిన వెంటనే స్టాండ్స్‌లో ఉన్న గంగూలీ తన షర్ట్‌ తీసి గాలిలోకి తిప్పుతూ ఆనందాన్ని వెలిబుచ్చాడు. ఇది ప్రతి సగటు భారతీయ క్రికెట్ అభిమానికి ఓ మెమరబుల్ మూమెంట్.

Story first published: Tuesday, April 21, 2020, 11:58 [IST]
Other articles published on Apr 21, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X