న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

నా బయోపిక్‌లో ఆ హీరోనే నటించాలి: యువరాజ్ సింగ్

Yuvraj Singh reveals which Bollywood actor he would like to see in his biopic
Yuvraj Singh Wants This Actor To Act In His Biopic

ముంబై: టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ తన బయోపిక్‌లో నటించాలనుకుంటున్న హీరో ఎవరో తెలియజేశాడు. గతేడాదే అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన ఈ సిక్సర్ల సింగ్ భారత క్రికెట్‌కు ఎనలేని సేవలు అందించాడు. ముఖ్యంగా 2011 ప్రపంచకప్‌‌లో ధోనీ సేన టైటిల్ నెగ్గడం‌లో కీలకపాత్ర పోషించాడు. అటు బ్యాటింగ్.. ఇటు బౌలింగ్‌లో రాణించి మ్యాన్ ఆఫ్ ది టోర్నీగా నిలిచాడు. అనంతరం ప్రాణాంతక క్యాన్సర్‌ను జయించిన యువరాజ్.. మళ్లీ బ్యాట్ పట్టి మెరుపులు మెరిపించాడు. ఇలా భారత్ క్రికెట్‌లో తన ఆటతో అభిమానుల గుండెల్లో చెరుగని ముద్రవేసుకున్నాడు. ఎంతోమందికి స్పూర్తిగా నిలిచాడు.

బయోపిక్ ట్రెండ్..

బయోపిక్ ట్రెండ్..

అయితే ప్రస్తుతం బయోపిక్స్ ట్రెండ్ నడుస్తున్న కాలంలో యువీ బయోపిక్ కూడా ఆసక్తికరమే.. స్పూర్తిదాయకమే. ఇప్పటికే ధోనీ, సచిన్, మేరీకోమ్ బయోపిక్ చిత్రాలు విడుదలై బాక్సాఫిస్ వద్ద కాసుల వర్షాన్ని కురిపించాయి. ధోనీ బయోపిక్‌లో సుషాంత్ సింగ్ రాజ్‌పుత్ ప్రధాన పాత్ర షోషించగా.. మేరీ కోమ్‌లో ప్రియాంక చోప్రా నటించింది. ఈ చిత్రాల విజయంతో మరికొన్ని తెరకెక్కుతున్నాయి. కపిల్ దేవ్, మిథాలీ రాజ్, సైనా నెహ్వాల్ బయోపిక్స్ కూడా రానున్నాయి. సిక్సర్ల సింగ్ యువరాజ్ సింగ్ బయోపిక్‌ కూడా వచ్చే అవకాశం ఉంది.

ఈ గడ్డం ఇలానే ఉంచితే ముద్దిస్తా!!

గల్లీబాయ్ నటుడు..

గల్లీబాయ్ నటుడు..

ఈ నేపథ్యంలోనే ఓ కార్యక్రమంలో పాల్గొన్న యువరాజ్‌ను ‘మీ బయోపిక్‌లో ఏ బాలీవుడ్ హీరో నటించాలనుకుంటున్నారు?'అని ప్రశ్నించగా.. యువ రాజ్ తనదైన శైలిలో సమాధానమిచ్చాడు. తన పాత్రను తనే పోషిస్తానని చమత్కరించాడు. హీరో పేరును చెప్పాలని పట్టుబట్టగా.. గల్లీబాయ్ నటుడు సిద్దాంత్ చతుర్వేది పేరును సూచించాడు.

‘వాస్తవానికి నా బయోపిక్‌లో నేనే నటిస్తాను. కానీ దీన్ని బాలీవుడ్ చిత్రంగా తెరకెక్కిస్తారు కనుక.. హీరోను డైరెక్టర్ సెలెక్ట్ చేస్తాడు. నాకైతే సిద్దాంత్ చతుర్వేది మంచి ఆప్షన్. ‘గల్లీబాయ్' చిత్రంలో అతను చేసిన షేర్ పాత్ర అద్భుతంగా ఉంది. ఆ చిత్రంలో అతన్ని అలా చూడటం బాగా నచ్చింది.'అని యువీ తెలిపాడు. ‘గల్లీ బాయ్‌' చిత్రంతో సిద్ధాంత్‌కు దేశవ్యాప్తంగా విపరీతమైన పాపులారిటీ వచ్చింది. ఐపీఎల్‌ నేపథ్యంలో తెరకెక్కిన ఇన్‌సైడ్ ఎడ్జ్ వెబ్ సిరీస్‌లో కూడా సిద్దాంత్ నటించాడు. ఈ సిరీస్‌లో టీమిండియా వెటరన్ బౌలర్ శ్రీశాంత్‌ను పోలి ఉండే ప్రశాంత్ కనుజ పాత్ర పోషించాడు. ఇది కూడా అతనికి మంచి పేరు తెచ్చిపెట్టింది. ముఖ్యంగా క్రికెట్ అభిమానులకు దగ్గర చేసింది.

క్రికెట్‌‌ చరిత్రలో నమోదైన ఆ అద్భుతానికి ఎనిమిదేళ్లు!!

ఆ విధ్వంసం మరిచిపోలేనిది..

ఆ విధ్వంసం మరిచిపోలేనిది..

ఇక యువరాజ్ తన ఇంటర్నేషనల్ కెరీర్‌లో 40 టెస్ట్‌లు, 304 వన్డేలు, 58 టీ20లు ఆడాడు. టెస్టుల్లో 1900, వన్డేల్లో 8701, టీ20ల్లో 1177 పరుగులు చేశాడు. తన కెరీర్‌లో మొత్తం 148 వికెట్లు పడగొట్టాడు. 2011 ప్రపంచకప్‌లో ఆడిన 9 మ్యాచ్‌ల్లో 90.50 సగటుతో 362 పరుగులు చేసి మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అందుకున్నాడు. ఈ మెగా టోర్నీలో 15 వికెట్లు కూడా పడగొట్టాడు. ఇక 2007 టీ20 ప్రపంచకప్‌లో స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్‌లో అతను కొట్టిన 6 బంతుల్లో 6 సిక్స్‌లు అతని కెరీర్‌కే కాదు.. టీ20 ఫార్మాట్‌కే హైలైట్. యువరాజ్ అనగానే ప్రతీ ఒక్కరికి గుర్తొచ్చేది ఇదే.

Story first published: Tuesday, March 17, 2020, 13:53 [IST]
Other articles published on Mar 17, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X