Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

క్రికెట్‌‌ చరిత్రలో నమోదైన ఆ అద్భుతానికి ఎనిమిదేళ్లు!!

On this day, 8 years ago Sachin Tendulkar scored his historic 100th international hundred

హైదరాబాద్: మార్చి 16.. యావత్ క్రికెట్ ప్రపంచానికి ఓ అద్భుతమైన దినం. సరిగ్గా 8 ఏళ్ల క్రితం ఇదే రోజు అత్యద్భుతం జరిగింది. యావత్ క్రికెట్ ప్రపంచంలోనే అప్పటి వరకు కనీవినీ ఎరుగని రికార్డు నమోదైంది. ఈ అద్భుతాన్ని కూడా క్రికెట్ దేవుడు, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కరే నమోదు చేశాడు.

ఇంతకీ ఆ రికార్డు ఏంటని అనుకుంటున్నారా?

ఇంతకీ ఆ రికార్డు ఏంటని అనుకుంటున్నారా?

అభిమానులను ఊరించిన... సచిన్‌ను నీడలా వెంటాడిన 100వ శతకం. అవునూ 8 ఏళ్ల క్రితం 2012లో ఇదే రోజు సచిన్ అంతర్జాతీయ క్రికెట్‌లో 100వ సెంచరీ నమోదు చేశాడు. ఆసియా‌కప్‌లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరిగిన వన్డే మ్యాచ్‌లో 114 పరుగులతో ఈ ఘనతను అందుకున్నాడు. ఈ సెంచ‌రీతో వ‌న్డేల్లో 49 శ‌త‌కాలను పూర్తి చేసిన స‌చిన్‌.. టెస్టుల్లో 51 సెంచరీలతో మొత్తం 100 శతకాల మార్కును దాటాడు. అయితే స‌చిన్ వందో సెంచ‌రీ చేసిన మ్యాచ్‌లో భార‌త్ మాత్రం ఓడిపోయింది. ఈ మ్యాచ్‌ల తొలుత టీమిండియా 290 ప‌రుగులు చేయ‌గా.. బంగ్లా నాలుగు బంతులు మిగిలి ఉండ‌గానే లక్ష్యాన్ని పూర్తి చేసింది. సౌతాఫ్రికాపై 99వ సెంచరీ సాధించిన సచిన్.. 100వ శతకానికి దాదాపు ఏడాది సమయం తీసుకున్నాడు. మధ్యలో రెండు సార్లు 90,99 పరుగుల వద్ద ఔటయ్యాడు.

ప్రతీ ఒక్కరు అడిగేవారు..

ప్రతీ ఒక్కరు అడిగేవారు..

ఇక 99 సెంచరీల తర్వాత తనపై తీవ్ర ఒత్తిడి నెలకొందని అప్పట్లో సచిన్ తెలిపాడు. ఎక్కడికి వెళ్లినా.. 100వ సెంచరీ ఎప్పుడని అడుగుతున్నారనీ, అసలు తానెప్పుడు ఆ మైలు రాయి గురించి ఆలోచించలేదన్నాడు. దీనివల్ల తన 99వ సెంచరీకి విలువే లేకుండా పోయిందని అసహనం వ్యక్తం చేశాడు.

‘నేనేప్పుడు ఆ మైలురాయి గురించి ఆలోచించలేదు. కానీ మీడియానే 100వ సెంచరీ అంటూ హడావిడి చేసింది. నేనెక్కడకు వెళ్లినా.. అది రెస్టారెంట్ అయినా, రూమ్ సర్వీస్ అయినా.. ప్రతీ ఒక్కరు 100వ సెంచరీ ఎప్పుడు? అని ప్రశ్నిస్తున్నారు. ఏ ఒక్కరు నా 99వ సెంచరీ గురించి మాట్లాడటం లేదు. ఇది నన్ను మానసికంగా ఇబ్బంది పెట్టేది'అని అప్పట్లో సచిన్ అసహనం వ్యక్తం చేశాడు.

ఆ మరుసటి ఏడాదే..

ఆ మరుసటి ఏడాదే..

వంద సెంచ‌రీల రికార్డును దాటిన మరుసటి ఏడాదికే సచిన్ అంత‌ర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు. 2013లో వెస్టిండీస్‌తో జ‌రిగిన రెండు టెస్టుల సిరీస్ స‌చిన్ కెరీర్‌లో ఆఖ‌రి అంత‌ర్జాతీయ సిరీస్‌. ముంబై వేదికగా జ‌రిగిన రెండో టెస్ట్.. త‌న చివరి ఇంట‌ర్నేష‌న‌ల్ క్రికెట్ మ్యాచ్. ఇక సచిన్ 24 ఏళ్ల‌ సుదీర్ఘ కెరీర్‌లో 164 అంత‌ర్జాతీయ హాఫ్ సెంచ‌రీలు ఉండ‌టం విశేషం. ఓవరాల్‌గా 34,357 అంత‌ర్జాతీయ ప‌రుగులు సాధించాడు. ఇక అత్య‌ధిక సెంచ‌రీల జాబితాలో 71తో రికీ పాంటింగ్ రెండో స్థానంలో నిలిచాడు. భార‌త కెప్టెన్ విరాట్ కోహ్లీ 70 శ‌త‌కాలతో మూడో స్థానం‌లో ఉన్న విషయం తెలిసిందే.

Story first published: Monday, March 16, 2020, 19:46 [IST]
Other articles published on Mar 16, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+