న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఈ గడ్డం ఇలానే ఉంచితే ముద్దిస్తా!!

I will kiss you if you keep it, Jimmy Neesham reacts after Ben Cuttings wife says goodbye to his beard


కరాచీ:
సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ జోకులు పేల్చే న్యూజిలాండ్ ఆల్‌రౌండర్ జిమ్మీ నీషమ్ మరోసారి తనదైన శైలిలో ఆకట్టుకున్నాడు. అభిమానులను అలరించే విషయంలో సోషల్ మీడియా వేదికగా ఏ మాత్రం అవకాశం దొరికినా.. వదలని ఈ న్యూజిలాండ్ స్టార్ ఆస్ట్రేలియా క్రికెటర్ బెన్ కట్టింగ్ సతీమణి పోస్ట్‌కు సరదా క్యాప్షన్ ఇచ్చాడు.
I will kiss you if you keep it, Jimmy Neesham reacts after Ben Cuttings wife says goodbye to his beard

బెన్ కట్టింగ్ పాకిస్థాన్ ప్రీమియర్ లీగ్ (పీఎస్‌ఎల్) 2020‌ సీజన్‌లో క్వెట్టా గ్లాడియేటర్స్ తరఫున బరిలోకి దిగాడు. ఈ సీజన్‌లో ఈ ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ రాణించినా.. తన జట్టు నాకౌట్‌కు అర్హత సాధించలేకపోయింది. అయితే అతని సతీమణి ఎరిన్ హోలాండ్ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా.. బెన్ కట్టింగ్ గడ్డం పట్టుకొని ఉన్న ఫొటోను షేర్ చేసింది. దీనికి 'బై బై బియర్డ్(గడ్డం).. బెన్ కట్టింగ్'అనే సరదా క్యాప్షన్ ఇచ్చింది. ఈ ఫొటోకు జిమ్మీ.. 'ఈ గడ్డం ఇలానే ఉంచితే ముద్దిస్తా'అని సరదాగా క్యాప్షన్‌తో కామెంట్ చేశాడు. ప్రస్తుతం ఈ ఫొటో నెట్టింట హల్‌చల్ చేస్తోంది.

View this post on Instagram

BYE BYE BEARD 😍👏🏻 @cuttsy_31

A post shared by ERIN HOLLAND (@erinvholland) on

ఇక కరాచీ కింగ్స్‌తో ఆదివారం జరిగిన ఆఖరి లీగ్ మ్యాచ్‌లో క్వెట్టా గ్లాడియేటర్స్ 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన కరాచీ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 150 పరుగులు చేసింది. కామెరన్ డెల్పార్ట్ (62), బాబర్ ఆజమ్ (32) రాణించారు. ప్రత్యర్థి బౌలర్లలో నసీమ్ షా (2/17) రెండు వికెట్లు తీశాడు.

అనంతరం ఛేజింగ్‌కు దిగిన క్వెట్టా గ్లాడియేటర్స్ 22 బంతులు మిగిలుండగానే లక్ష్యాన్ని అందుకొని 5 వికెట్లతో గెలుపొందింది. వాట్సన్(66), మంజూర్ (63) హాఫ్ సెంచరీలతో చెలరేగారు. ఇక కరోనా నేపథ్యంలో పీఎస్‌ఎల్ నాకౌట్ మ్యాచ్‌లు ప్రేక్షకుల్లేకుండా జరగనున్నాయి.

Story first published: Monday, March 16, 2020, 21:53 [IST]
Other articles published on Mar 16, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X