Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

బుమ్రా నా దగ్గరే బౌలింగ్ నేర్చుకున్నాడు: పాక్ బౌలర్

భారత స్టార్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా బౌలింగ్ అంటే క్రికెట్ అభిమానులు ఎంతగానో ఇష్టపడతారు. బుమ్రా తన యార్కర్లు, స్లో బంతులతో బ్యాటర్లకు ముచ్చెమటలు పట్టిస్తాడు. స్లోయర్ డెలివరీలతో ప్రపంచంలోని మేటి బ్యాటర్లను కూడా ఇబ్బంది పెట్టిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అయితే జస్ప్రీత్ బుమ్రా ఈ విద్యను తన దగ్గరే నేర్చుకున్నాడని పాకిస్థాన్ సంతతికి చెందిన యూఏఈ ఫాస్ట్ బౌలర్ జహూర్ ఖాన్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో సెన్సేషనల్ కామెంట్స్ చేశాడు.

ఐపీఎల్ 2019లో జరిగిన అసలు కథ
నెట్టింట వైరల్ అవుతున్న ఓ వీడియోలో జహూర్ ఖాన్ మాట్లాడుతూ.. 2019 ఐపీఎల్ సమయంలో తాను ముంబై ఇండియన్స్‌కు నెట్ బౌలర్‌గా ఉన్నానని గుర్తు చేసుకున్నాడు. ఆ సమయంలోనే జస్ప్రీత్ బుమ్రా తన దగ్గర స్లోయర్ డెలివరీలు వేయడం నేర్చుకున్నాడని చెప్పుకొచ్చాడు. బుమ్రా అంతకు ముందు కూడా స్లోయర్ బంతులు వేసేవాడని.. కానీ ఆ యాక్షన్ సాదాసీదాగా ఉండేదని పేర్కొన్నాడు. అబుదాబీలో జరిగిన ఓ మ్యాచ్‌లో జస్‌ప్రీత్ బుమ్రా, ట్రెంట్ బౌల్ట్, నాథన్ కౌల్టర్-నైల్ భారీగా పరుగులు సమర్పించుకున్నారని.. అప్పుడు ముంబై ఇండియన్స్ తనను పిలిపించుకున్నారని జహూర్ ఖాన్ వెల్లడించాడు.

Doc Did Jasprit Bumrah Learn His Slower Balls from Zahoor Khan The Viral Claim Explained

ప్రాక్టీస్ సెషన్లో ఏం జరిగింది?
నెట్స్ ప్రాక్టీస్ లో బుమ్రా తన వద్దకు వచ్చి స్లోయర్ బాల్స్ రహస్యం అడిగాడని జహూర్ ఖాన్ వివరించాడు. బౌలింగ్ యాక్షన్ మార్చకుండానే స్లోయర్ బాల్స్ ఎలా వేయాలో తాను బుమ్రాకు చూపించానని జహూర్ ఖాన్ చెప్పుకొచ్చాడు. తాను వేసిన స్లోయర్ డెలివరీలను చూసి అప్పటి ముంబై బౌలింగ్ కోచ్ షేన్ బాండ్, హెడ్ కోచ్ మహేల జయవర్దనే ఆశ్చర్యపోయారని.. అది క్రికెట్లో సరికొత్త టెక్నిక్ అంటూ వారు మెచ్చుకున్నారని జహూర్ ఖాన్ పేర్కొన్నాడు.

Story first published: Wednesday, March 11, 2026, 10:36 [IST]
Other articles published on Mar 11, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+