న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

పోలీస్ కేసుపై స్పందించిన యువరాజ్ సింగ్!

Yuvraj Singh issues clarification for casteist remark on Yuzvendra Chahal

న్యూఢిల్లీ: ఓ కులాన్ని కించపరిచే వ్యాఖ్యలు చేశాడని టీమిండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్‌పై పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. రెండు నెలల క్రితం స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మతో ఇన్‌స్టా లైవ్ సెషన్‌లో పాల్గొన్న యూవీ.. యుజ్వేంద్ర చహల్‌ను ఉద్దేశించి దళితులకు వ్యతిరేకంగా అనుచిత వ్యాఖ్యలు చేశాడని హర్యానాకు చెందిన ఓ న్యాయవాది పోలీసులకు ఫిర్యాదు చేశారు.

గత మూడురోజులుగా సోషల్ మీడియా వేదికగా తీవ్ర దుమారం రేపుతున్న ఈ వివాదంపై తాజాగా యువరాజ్ సింగ్ స్పందించాడు. ఉద్దేశపూర్వకంగా ఆ వ్యాఖ్యలు చేయలేదని, తనను తప్పుగా అర్థం చేసుకున్నారని, తన వల్ల ఎవరైనా బాధపడి ఉంటే వారికి క్షమాపణలు తెలియజేస్తున్నానని ట్విటర్ వేదికగా ఓ సుదీర్ఘ పోస్టులో వెల్లడించాడు.

తప్పుగా అర్థం చేసుకున్నారు..

‘కులం, రంగు, మతం, జెండర్ వంటి వ్యత్యాస్యాలను నేను పట్టించుకోను. విశ్వసించను. నేనెప్పుడు ప్రజల సంక్షేమం కోసమే పరితపిస్తాను. ప్రతీ ఒక్కరికి గౌరవం ఇవ్వాలని, ఒకరికొకరం మర్యాదగా నడుచుకోవాలని భావిస్తా. నా సహచరులతో నేను చేసిన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారని నాకు అర్థమైంది. ఏది ఏమైనా బాధ్యాతాయుతమైన భారతీయుడిగా నా వ్యాఖ్యల పట్ల ఎవరి మనోభావాలైన దెబ్బతీంటే వారందరికి క్షమాపణలు తెలియజేస్తున్నా. నా కామెంట్స్ పట్ల పశ్చాతాపం వ్యక్తం చేస్తున్నా. దేశం, ప్రజల పట్ల నా ప్రేమ తగ్గదు.' అని ఆ ట్వీట్‌లో యూవీ పేర్కొన్నాడు.

అసలేం జరిగిందంటే..

అసలేం జరిగిందంటే..

రెండు నెలల క్రితం రోహిత్ శర్మతో యువరాజ్ సింగ్ ఇన్‌స్టా లైవ్ సెషన్‌ నిర్వహించాడు. వీరి లైవ్ సెషన్‌ మధ్యలో దూరి కామెంట్ చేసిన టీమిండియా లెగ్ స్పిన్నర్ చహల్‌ను ఉద్దేశించి ఈ ఇద్దరు స్టార్ క్రికెటర్లు సరదాగా మాట్లాడుకున్నారు. ముఖ్యంగా అతని టిక్ టాక్ వీడియోల గురించి ప్రస్తావించారు. ఈ క్రమంలో యువరాజ్‘ఈ బాంగీ మనషుల్లా యూజీ(చహల్‌)కు పనిపాట లేనట్లుంది. అతని కుటుంబంతో చేసిన వీడియోలు చూశావా?'అని రోహిత్‌ను ప్రశ్నించాడు. అయితే హిందీలో అట్టుడగు వర్గాలను బాంగీ అనే పదంతో పిలుస్తారని నెటిజన్లు యువరాజ్‌పై మండిపడ్డారు. రెండు నెలల క్రితానికి సంబంధించిన ఈ వీడియో క్లిప్‌ను తెగ వైరల్ చేశారు. యూవీ క్షమాపణలు చెప్పాలంటూ #युवराज_सिंह_माफी_मांगो హాష్ ట్యాగ్‌ను ట్రెండ్ చేశారు.

రోహిత్ నవ్వాడని..

రోహిత్ నవ్వాడని..

యువరాజ్‌పై హరియానాలోని దళితుల హక్కుల నేత, న్యాయవాది రజత్ కలశన్ హిస్సార్‌లోని హన్సిలో పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంతేకాకుండా రోహిత్ శర్మపైనా విమర్శలు గుప్పించారు. యూవీ తన అభిప్రాయం చెప్పినప్పుడు హిట్ మ్యాన్ వ్యతిరేకించాల్సిందని అన్నారు. అతడు ఉపయోగించిన పదం దళితుల సెంటిమెంట్‌ను గాయపరిచిందని పేర్కొన్నారు. దీనికి సంబంధించిన సీడీలు, వివరాలను పోలీసులకు అందజేశానన్నారు. ఈ కేసు విచారణను డీఎస్పీకి అప్పగించామని ఎస్పీ లోకేంద్ర సింగ్ తెలిపారు. అన్ని కోణాల్లో విచారణ జరిపి చర్యలు తీసుకుంటామన్నారు.

యూవీ.. వరల్డ్‌కప్ హీరో

యూవీ.. వరల్డ్‌కప్ హీరో

గతేడాదే అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన యువరాజ్.. తన కెరీర్‌లో 40 టెస్ట్ మ్యాచ్‌లు ఆడి 1,900 పరుగులు చేశాడు. ఇందులో 3 సెంచరీలు, 11 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 304 వన్డే మ్యాచ్‌ల్లో 14 సెంచరీలు, 52 హాఫ్ సెంచరీలతో 8,701 పరుగులు చేశాడు. ఇక 58 టీ20 మ్యాచ్‌లు ఆడిన యువీ.. 1,177 పరుగులు చేశాడు. 8 ఆఫ్ సెంచరీలు నమోదు చేశాడు. ధోనీ సారథ్యంలో భారత్ గెలిచిన రెండు ప్రపంచకప్‌ల్లో యూవీ కీలక పాత్ర పోషించాడు.

అతనే నా ఫేవరేట్ క్రికెటర్ : పూజా హెగ్డే

Story first published: Friday, June 5, 2020, 16:31 [IST]
Other articles published on Jun 5, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X