Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అతనే నా ఫేవరేట్ క్రికెటర్ : పూజా హెగ్డే

Pooja Hegde picks her favourite cricketer

హైదరాబాద్: టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్‌గా దూసుకుపోతున్నపూజా హెగ్డే.. తనకిష్టమైన క్రికెటర్ ఎవరో తెలిపింది. 'అరవింద సమేత, మహర్షి, గద్దలకొండ గణేష్' వంటి బ్యాక్ టు బ్యాక్ హిట్ చిత్రాల్లో స్టార్ హీరోలతో రొమాన్స్ చేసిన ఈ భామ.. 2020 ఆరంభంలోనే 'అల వైకుంఠపురములో' మూవీతో భారీ హిట్ ఖాతాలో వేసుకుంది. ప్రస్తుతం ప్రభాస్ సరసన రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న కొత్త సినిమాలో నటిస్తోంది. లాక్‌డౌన్ కారణంగా ఈ మూవీ షూటింగ్ ఆగిపోవడంతో గత రెండు నెలలుగా ఇంటికే పరిమితమైన పూజా తాజాగా సోషల్ మీడియా వేదికగా చిట్ చాట్ చేసింది.

ది వాల్ అంటే పిచ్చి..

ది వాల్ అంటే పిచ్చి..

అభిమానులు అడిగిన పలు ప్రశ్నలకు ఓపిగ్గా సమాధానాలిచ్చింది. ఈ నేపథ్యంలో మీ ఫేవరేట్ క్రికెటర్ ఎవరు? అని ఓ అభిమాని అడగ్గా.. మిస్టర్ డిపెండబుల్ రాహుల్ ద్రవిడ్ అని బదులిచ్చింది. అంతేకాదు క్రికెట్ అంటే తనకు చాలా ఇష్టమని, అందులో రాహుల్ ద్రవిడ్ ఆట తీరంటే పిచ్చని పేర్కొంది.

‘ది వాల్ ద్రవిడ్‌‌కు నేను వీరాభిమానిని. ఈ తరంలో ఎంతమంది గొప్ప ఆటగాళ్లున్నా వారెవరూ రాహుల్ ద్రవిడ్‌కు సాటిరారు. ద్రవిడ్ ఓ కూల్ అండ్ క్లాసిక్ ప్లేయర్..‌ ఈ తరం ఆటగాళ్ల విషయానికొస్తే ధోనీ, కేఎల్ రాహుల్ ఆటతీరంటే ఇష్టం. ఎంత బిజీగా ఉన్నప్పటికీ టీమిండియా మ్యాచ్ జరుగుతుందంటే కనీసం స్కోర్ తెలుసుకోవడానికైనా ప్రయత్నిస్తా. క్రికెట్ పట్ల తనకున్న ఇష్టం అలాంటిది.'అని పూజా తెలిపింది.

సమంత అందంగా లేదని..

సమంత అందంగా లేదని..

ఇటీవల సమంత అందంగా లేదని కామెంట్ చేసిన పూజా హెగ్డే విపరితీమైన ట్రోలింగ్‌కు గురైన విషయం తెలిసిందే. సమంతకు క్షమాపణలు చెప్పాల్సిందేనని ఆమె ఫ్యాన్స్ పుజాను పట్టుబట్టారు. చిన్మయి, నందినీరెడ్డి వంటి వారు ఈ వ్యవహారంలోకి దూరడంతో పూజాకు మద్దతు పెరిగింది. ఇక తాజాగా తన నానమ్మతో దిగిన ఓ కూల్‌ ఫోటోను ఇన్‌స్టాలో షేర్‌ చేసింది ఈ క్రేజీ బ్యూటీ. చూడటానికి ఎంతో ముచ్చటగా ఉన్న ఈ ఫోటో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది.

ప్రభాస్‌తో లవ్‌స్టోరీ..

ప్రభాస్‌తో లవ్‌స్టోరీ..

ఇక పూజా హెగ్డే- ప్రభాస్ కాంబినేషన్‌లో రాబోతున్న సినిమా పీరియాడిక్ లవ్‌స్టోరీ అని తెలుస్తోంది. యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై ప్రభాస్ కెరీర్‌లో 20వ సినిమాగా రూపొందుతున్న ఈ మూవీలో పూజా స్పెషల్ అట్రాక్షన్ కానుందని సినీవర్గాల సమాచారం.

ఇటీవల టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు కూడా తన ఫేవరేట్ క్రికెటర్లు ఎవరో చెప్పిన విషయం తెలిసిందే. ఫ్యాన్స్‌తో చిట్ చాట్ చేసిన మహేశ్ బాబు.. మాజీ కెప్టెన్, సీనియర్ వికెట్ కీపర్ మహేంద్ర సింగ్ ధోనీ, ప్రస్తుత సారథి విరాట్ కోహ్లీలు తన ఫేవరేట్ క్రికెటర్లని తెలిపాడు. అయితే తన ఆల్‌టైమ్ ఫేవరేట్ మాత్రం మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ అని చెప్పుకొచ్చాడు.

ద్రవిడ్‌పై ప్రశంసల జల్లు..

ద్రవిడ్‌పై ప్రశంసల జల్లు..

ఇక ఇటీవల రాహుల్ ద్రవిడ్‌‌ను ప్రశంసించే వారి సంఖ్య ఎక్కువైంది. పాకిస్థాన్ మాజీ క్రికెటర్ రషీద్ లతీఫ్.. ద్రవిడ్ క్రికెట్ కోసమే పుట్టాడని కొనియాడగా.. తాను ఆడిన ఆటగాళ్లలో అత్యంత నిబద్దత కలిగిన ప్లేయర్ ద్రవిడేనని లక్ష్మణ్ ప్రశంసించాడు. ఇక ద్రవిడ్‌ తన అంతర్జాతీయ కెరీర్‌లోభారత్ తరఫున 164 టెస్టుల్లో 13,288.. 344 వన్డేల్లో 10,899.. ఒక టీ20లో 31 పరుగులు చేశాడు. భారత క్రికెట్‌ చరిత్రలో తనకంటూ ఓ స్థానాన్ని సంపాదించుకున్నాడు.

మొసలి కన్నీళ్లు కొన్నాళ్లే అంటూ బోల్డ్ పిక్‌ షేర్ చేసిన షమీ వైఫ్.. మండిపడుతున్న ఫ్యాన్స్!

Story first published: Friday, June 5, 2020, 14:50 [IST]
Other articles published on Jun 5, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+