న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

యువరాజ్ సింగ్‌కు మళ్లీ పిలుపు..!

Yuvraj Singh Asked To Come Out Of Retirement By Punjab Cricket Association

న్యూఢిల్లీ: అన్ని ఫార్మాట్ల క్రికెట్‌కు గుడ్ బై చెప్పిన భారత మాజీ ఆల్ రౌండర్ యువరాజ్‌ సింగ్‌కు మళ్లీ పిలుపొచ్చింది. దేశవాళీ క్రికెట్‌లో పంజాబ్ తరపున మళ్లీ ఆడాలని, దానికోసం రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని పంజాబ్ క్రికెట్ అసోసియేషన్(పీసీఏ) యువీని కోరింది. అయితే ఈ విషయం ఆలస్యంగా వెలుగుచూసింది. కానీ ఈ ఆఫర్‌పై యువరాజ్ సింగ్ ఇంకా స్పందించలేదని తెలుస్తోంది.

 యూటర్న్ తీసుకోవాలనుకున్నా..?

యూటర్న్ తీసుకోవాలనుకున్నా..?

ఇక యువీ రిటైర్మెంట్ తర్వాత రెండు విదేశీ ప్రైవేట్ లీగ్స్‌ కూడా ఆడాడు. దాంతో.. ఇప్పుడు ఆ రిటైర్మెంట్‌ని వెనక్కి తీసుకోవాలనుకున్నా? ఈ విదేశీ లీగ్స్‌ యువీకి అడ్డంకిగా మారనున్నాయి. భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) నిబంధనల ప్రకారం.. భారత క్రికెటర్ ఎవరూ రిటైర్మెంట్ ప్రకటించకుండా విదేశీ ప్రైవేట్ లీగ్స్‌లో ఆడటానికి వీల్లేదు. రిటైర్మెంట్ తర్వాత విదేశీ లీగ్స్‌లో ఆడిన క్రికెటర్.. మళ్లీ ఎట్టి పరిస్థితుల్లో బీసీసీఐ ఆధ్వర్యంలో నడిచే టోర్నీల్లో ఆడేందుకు అనుమతించరు.

ప్రవీణ్ తాంబే సైతం..

ప్రవీణ్ తాంబే సైతం..

యూఏఈ వేదికగా టీ10 లీగ్‌ ఆడిన భారత మాజీ స్పిన్నర్ ప్రవీణ్ తంబే ఇటీవల రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని ఐపీఎల్ 2020 సీజన్‌లో ఆడాలని ప్రయత్నించాడు. అతడ్ని ఐపీఎల్ వేలంలో రూ.20 లక్షలకి కోల్‌కతా నైట్‌రైడర్స్ ఫ్రాంఛైజీ కొనుగోలు చేసింది. కానీ బీసీసీఐ ఆధ్వర్యంలో జరిగే ఐపీఎల్‌లో ఆడేందుకు అతను అనర్హుడిగా బీసీసీఐ తేల్చి చెప్పేసింది. ఈ టీ10 లీగ్‌లో యువరాజ్ సింగ్ కూడా ఆడిన విషయం తెలిసిందే.

 రెండు ప్రపంచకప్‌ల్లో..

రెండు ప్రపంచకప్‌ల్లో..

2007 టీ20 ప్రపంచకప్, 2011 వన్డే ప్రపంచకప్‌ను భారత్ గెలవడంలో క్రియాశీలక పాత్ర పోషించిన యువరాజ్ సింగ్.. కెరీర్ చరమాంకంలో మాత్రం ఊహించని అవమానాలు ఎదుర్కొన్నాడు. 2011 వన్డే ప్రపంచకప్‌లో 362 పరుగులు, 15 వికెట్లు పడగొట్టిన యువరాజ్ సింగ్.. క్లిష్ట సమయాల్లోనూ సాహసోపేతంగా పోరాడి టీమిండియాకి విజయాన్ని అందించి ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ అవార్డు కూడా అందుకున్నాడు. కానీ.. ఆ వరల్డ్‌కప్ తర్వాత క్యాన్సర్ బారిన పడిన యువీ.. కొన్నిరోజులు ఆటకి దూరంగా ఉన్నాడు.

 యోయోతో..

యోయోతో..

ఆ తర్వాత రీఎంట్రీ ఇచ్చినా.. మునుపటిలా ఆడలేకపోవడంతో అతనికి 2015 వన్డే ప్రపంచకప్‌లోనూ చోటు దక్కలేదు. అయితే 2017లో సెంచరీతో మళ్లీ ఫామ్ అందుకున్నా.. గాయాలు యువీ కెరీర్‌ని దెబ్బతీశాయి. ముఖ్యంగా.. టీమిండియా మేనేజ్‌మెంట్ ప్రవేశపెట్టిన యో-యో ఫిట్‌నెస్ టెస్టులో తొలుత ఫెయిలైన ఈ ఆల్‌రౌండర్.. కొన్ని రోజుల తర్వాత అందులో పాసైనా అప్పటికే ఆలస్యమైపోయింది. 2019 వన్డే ప్రపంచకప్‌ జట్టులో చోటు దక్కకపోవడంతో ఆ టోర్నీ జరుగుతుండగానే యువీ కెరీర్‌కి గుడ్‌బై చెప్పేశాడు. భారత్ తరఫున మొత్తం 40 టెస్ట్ మ్యాచ్‌లు ఆడి 3 సెంచరీలు, 11 హాఫ్ సెంచరీలతో 1900 పరుగులు చేసిన ఈ సిక్సర్ల సింగ్.. 304 వన్డే మ్యాచ్‌ల్లో 8701 పరుగులు చేశాడు. ఇందులో 14 సెంచరీలు, 52 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇక 58 టీ20 మ్యాచ్‌లు ఆడిన యువీ.. 1177 పరుగులు చేశాడు. ఇందులో 8 ఆఫ్ సెంచరీలు ఉన్నాయి.

ధోనీ భాయ్.. భౌతిక దూరం ఏది..? గిట్లయితే ఐపీఎల్ అయినట్టే.. నెటిజన్ల చురకలు!

Story first published: Saturday, August 15, 2020, 15:55 [IST]
Other articles published on Aug 15, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X