ధోనీ భాయ్.. భౌతిక దూరం ఏది..? గిట్లయితే ఐపీఎల్ అయినట్టే.. నెటిజన్ల చురకలు!

హైదరాబాద్: అప్‌కమింగ్ ఐపీఎల్ సీజన్ కోసం చెన్నైకి వచ్చిన చెన్నై సూపర్ కింగ్స్(సీఎస్‌కే) ఆటగాళ్లపై సోషల్ మీడియాలో వీపరితమైన ట్రోలింగ్ జరుగుతుంది. ఆటగాళ్లు కరోనా నిబంధనలు పాటించకపోవడంపై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శనివారం నుంచి 20వ తేదీ వరకు జరగనున్న సీఎస్‌కే ట్రైనింగ్ క్యాంప్‌లో పాల్గొనేందుకు ఆ జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీతో సహా పలువు ఆటగాళ్లు శుక్రవారం చెన్నైలో అడుగుపెట్టిన విషయం తెలిసిందే. సురేశ్ రైనా, అంబటి రాయుడు, కరణ్ శర్మ, పియూష్ చావ్లా, కేదార్ జాద్, దీపక్ చహర్, హర్భజన్ సింగ్ సహా పలువురు ప్రత్యేక విమానంలో చెన్నై ఎయిర్ పోర్టులో దిగి అక్కడి నుంచి టీమ్ హోటల్‌కు చేరుకున్నారు. ఈ జర్నీకి సంబంధించిన ఫొటోలను సురేశ్ రైనాతో పాటు సీఎస్‌కే టీమ్ సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంది.
ధోనీ వచ్చాడనే ఆతృతతో...
ఈ ప్రయాణంలో ఆటగాళ్లంతా నిబంధనల్ని అతిక్రమించినట్లు ఈ ఫొటోల ద్వారా స్పష్టమవుతుంది. మాస్క్ ధరించకపోవడంతో భౌతిక దూరం పాటించకుండా ఒకరిపై ఒకరు కూర్చుని ఫొటోలకు ఫోజులిచ్చారు. ఇక ఫ్లైట్ ఎక్కే ముందు దిగిన తర్వాత మాస్క్ ధరించిన ధోనీ.. ప్రత్యేక విమానంలో మాత్రం పక్కనపడేశాడు. విమానంలోకి మహీ రాగానే ఆటగాళ్లంతా అత్యుత్సాహంతో అతని పక్కన చేరారు. ఈ ఆతృతలో మాస్క్, భౌతిక దూరాన్ని గాలికొదిలేసారు. దీంతో.. నెటిజన్లు తీవ్ర స్థాయిలో ధోనీతో పాటు ఆ ప్లైట్‌లో ప్రయాణించిన ఆటగాళ్లపై మండిపడుతున్నారు.
గిట్లయితే కష్టమే..
కెప్టెన్ అయిన ధోనీనే నిబంధనలు పాటించకుంటే ఎలా? అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ముందే ఇలా ఉంటే ఇక బీసీసీఐ బయో బబుల్ రూల్స్ ఎలా పాటిస్తారని సందేహం వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి ఆటగాళ్లందరికి మూడు రోజుల క్రితమే కరోనా వైరస్ పరీక్షలు నిర్వహించారు. అందరికీ నెగటివ్ రావడంతోనే క్యాంప్‌కు అనుమతించారు.
కానీ.. ఆ ప్లైట్‌లోకి ఎక్కే ముందు వారు తమ కుటుంబ సభ్యులు, డ్రైవర్‌తో కలిసి ప్రయాణించారు. మరి వారి సంగతేంటి..? అని అభిమానులు ప్రశ్నిస్తున్నారు. ధోనీ భాయ్ జర మాస్క్ పెట్టుకో? అని కోరుతున్నారు.
మాస్క్.. భౌతిక దూరం తప్పనిసరి..
బీసీసీఐ ఫ్రాంచైజీలకు అందజేసి ఎస్‌ఓపీలో.. ప్రతి ఆటగాడు మాస్క్‌తో పాటు భౌతికదూరం పాటించాలనే నిబంధనను పెట్టింది. మ్యాచ్ జరిగే సమయంలో మాత్రం ఈ విషయంలో కొంచెం ఊరట కల్పించినా.. ఆఫ్ ఫీల్డ్‌లో మాత్రం ఖచ్చితంగా ఈ రూల్స్ పాటించాలని పేర్కొంది. కానీ ఆటగాళ్లు మాత్రం నిబంధనలను అంత సీరియస్‌గా తీసుకున్నట్లు కనబడటం లేదు. ఇక యూఏఈ వేదికగా సెప్టెంబరు 19 నుంచి నవంబరు 10 వరకూ ఐపీఎల్ 2020 సీజన్ మ్యాచ్‌లు జరగనుండగా.. ప్రాక్టీస్ క్యాంప్ అనంతరం చెన్నై ఆగస్టు 21న దుబాయ్‌కు వెళ్లనుంది.
ఐదు రోజులకోసారి..
బీసీసీఐ నిబంధనల ప్రకారం దుబాయ్‌కు వెళ్లేముందు రెండు సార్లు.. అక్కడికి చేరుకున్న తర్వాత మొదటి రోజు, మూడో రోజు, ఆరో రోజు కరోనా పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ టెస్ట్‌ల్లో నెగటీవ్ వస్తే బయోబబుల్ వాతావరణంలో మ్యాచ్‌లు ఆడేందుకు అనుమతిస్తారు. ఇక టోర్నీ జరుగుతున్నంత కాలం ఐదు రోజులకోసారి బయోబబుల్‌లో ఉన్నందరికి పరీక్షలు నిర్వహిస్తారు. ఈ బయోబబుల్‌లో ఆటగాళ్లంతా మాస్క్‌లు పెట్టుకోవడంతో పాటు భౌతిక దూరం తప్పనిసరి పాటించాలి. ఒకవేళ ఎవరైనా బబుల్ రూల్స్ బ్రేక్ చేస్తే.. వాళ్లు క్వారంటైన్‌లో ఉండాల్సిందే.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications