న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

వన్డే ప్రపంచకప్‌ ఓటమికి కోహ్లీసేన అనాలోచిత నిర్ణయాలే కారణం: యువరాజ్

Yuvraj Singh defends Rishabh Pant and slams Virat Kohli-led team management for 2019 World Cup debacle

న్యూఢిల్లీ: గతేడాది ఇంగ్లండ్ వేదికగా జరిగిన ప్రపంచకప్‌లో భారత ఓటమికి టీమిండియా మేనేజ్‌మెంట్ తీసుకున్న అనాలోచిత నిర్ణయాలే కారణమని భారత మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ అన్నాడు. క్లిష్ట సమయంలో అనవసర షాట్ ఆడిన యువ క్రికెటర్ రిషభ్ పం‌త్‌ది తప్పు కాదని, అనుభవారాహిత్యమే అతన్ని అలా ఆడాలే చేసిందని యూవీ చెప్పుకొచ్చాడు. ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్సన్‌తో ఆదివారం ఇన్‌స్టాగ్రామ్ లైవ్ సెషన్‌లో పాల్గొన్న ఈ సిక్సర్ల సింగ్ పలు ఆసక్తికర విషయాలను అభిమానులతో పంచుకున్నాడు.

ఆ ఆలోచనే చెత్త..

ఆ ఆలోచనే చెత్త..

ఈ సందర్భంగా ప్రపంచకప్‌లో రిషభ్ పంత్ ఆట గురించి పీటర్సన్ ప్రస్తావించగా.. యూవీ ఈ యువవికెట్ కీపర్‌ను వెనకేసుకొచ్చాడు. ‘న్యూజిలాండ్‌తో జరిగిన నాటి సెమీఫైనల్ మ్యాచ్ పంత్‌కు తన కెరీర్‌లో 5వ అంతర్జాతీయ వన్డే మాత్రమే. అలా 5,7 వన్డేలు ఆడిన ఆటగాళ్లను మెగాటోర్నీకి ఎంపిక చేయడం కోచింగ్ స్టాఫ్, టీమ్ మేనేజ్‌మెంట్ చేసిన చెత్త ఆలోచన. నేనేం పంత్, విజయ్ శంక‌ర్‌కు వ్యతిరేకంగా మాట్లాడటం లేదు.

బ్యాకప్ ప్లాన్ లేదు..

బ్యాకప్ ప్లాన్ లేదు..

కానీ అనుభవం కలిగిన ఆటగాళ్లు అవసరం. రోహిత్, విరాట్ ఔటైన తర్వాత ఏమైంది. అప్పుడు.. ఓ 40,45 మ్యాచ్‌లు ఆడిన ఆటగాళ్లుంటే.. పంత్‌లా నిర్లక్ష్యంగా షాట్ ఆడకుండా సింగిల్ తీసేవారు. కానీ సరైన ప్రణాళికలు లేవు. కోహ్లీ, రోహిత్ విఫలమైతే పరిస్థితి ఏందనే బ్యాకప్ ప్లాన్ లేదు. అంతేకాకుండా టోర్నీ ఆసాంతం మిడిలార్డర్‌లో అనేక మార్పులు చేస్తూ చేసిన ప్రయోగాలు జట్టును దెబ్బతీసింది. పూర్తిగా టీమ్‌మేనే‌జ్‌మెంట్ ప్రణాళిక లోపంతో భారత్ ఓటమిపాలైంది'అని యూవీ తెలిపాడు.

ధోనీ, జడేజా పోరాడినా..

ధోనీ, జడేజా పోరాడినా..

న్యూజిలాండ్ నిర్దేశించిన 240 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించలేక భారత్ చేతులెత్తేసింది. టాపార్డర్ అంతా కట్టుకోని విఫలమైన వేళ మహేంద్ర్ సింగ్ ధోనీ, రవీంద్ర జడేజా అద్బుత పోరాటంతో ఆశలు రేకిత్తించారు. కానీ పరుగుల వ్యత్యాసాన్ని తగ్గించే క్రమంలో భారీ షాట్ ఆడబోయి జడేజా ఔటవ్వగా.. ధోనీ రనౌట్ కావడంతో భారత్ ఆశలు అడియాశలయ్యాయి. అప్పట్లోనే ధోనీని ముందుకు పంపించాల్సిందని టీమ్‌‌మేనేజ్‌మెంట్‌పై తీవ్ర విమర్శలు వచ్చాయి. మెగా టోర్నీ అనంతరం బ్యాటింగ్ కోచ్‌పై వేటు కూడా పడింది.

 కోచ్‌గా మారుతా..

కోచ్‌గా మారుతా..

మాజీ ఆటగాళ్లంతా క్రికెట్‌ కామెంట్రీ వైపు దృష్టి సారిస్తుంటే.. యువరాజ్‌ సింగ్‌ మాత్రం కోచ్‌గా మారుతానని పీటర్సన్‌కు తెలిపాడు. ఆటగాళ్లకు శిక్షణ ఇవ్వడమే తనకు ఇష్టమన్నాడు.‘వ్యాఖ్యాతగా ఉండడంకన్నా కోచ్‌గా మారేందుకే ఇష్టపడతా. ముఖ్యంగా వన్డే ఫార్మాట్‌లో మిడిలార్డర్‌ ఆటగాళ్లకు విలువైన సలహాలివ్వాలనుకుంటున్నా' అని యూవీ తన మనసులోని మాటను చెప్పుకొచ్చాడు.

మహేశ్ బాబు ‘మైండ్‌బ్లాక్' పాటకు డ్యాన్స్ చేయలేనన్న వార్నర్.. ఎందుకంటే?

Story first published: Monday, May 18, 2020, 10:20 [IST]
Other articles published on May 18, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X