న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'వచ్చే ప్రపంచకప్‌ కోసం ఇప్పటి నుంచే సన్నద్ధమవుతున్నా'

World Cup snub was disappointing but had to move on says Ajinkya Rahane

ఢిల్లీ: ప్రపంచకప్-2019లో చోటు దక్కకపోవడం నిరాశపరిచింది. కానీ ముందుకు సాగాల్సిన అవసరం ఉంది. పంచకప్ 2019లో పాల్గొనకపోయినా.. కౌంటీ క్రికెట్ నుండి చాలా నేర్చుకున్నా. వచ్చే ప్రపంచకప్‌ కోసం ఇప్పటి నుంచే సన్నద్ధమవుతున్నా అని భారత టెస్ట్ వైస్ కెప్టెన్ అజింక్య రహానే పేర్కొన్నాడు. 2015 ప్రపంచకప్‌లో నాలుగో స్థానంలో బరిలోకి దిగిన రహానే.. ప్రపంచకప్‌ 2019లో చోటు కోల్పోయాడు.

పాక్ కోచ్‌ను తప్పించడం వెనుక ఇమ్రాన్‌ ఖాన్ హస్తం!!

తాజాగా అజింక్య రహానే మీడియాతో మాట్లాడుతూ... 'ప్రపంచకప్‌ జట్టులో స్థానం కోసం ప్రతి క్రీడాకారుడు కలలుకంటాడు. నేనే కూడా అంతే. ప్రపంచకప్‌ జట్టులో ఎంపికవ్వకపోవడం నిరాశ కలిగించింది. కానీ వాటిని అధిగమించి ముందుకు సాగాల్సిన అవసరం ఉంది. వచ్చే ప్రపంచకప్‌ కోసం ఇప్పటి నుంచే సన్నద్ధమవుతున్నా. ప్రపంచకప్‌లో పాల్గొనకపోయినా.. కౌంటీ క్రికెట్ నుండి చాలా నేర్చుకున్నా. ప్రస్తుతం టెస్టు ఛాంపియన్‌షిప్‌పై దృష్టి సారిస్తున్నా. టీ20, వన్డేలల్లో అవకాశమిస్తే సత్తా చాటుతా' అని రహానే ఆశాభావం వ్యక్తం చేశాడు.

కోహ్లీ సంబరాలు చూస్తే.. ఈ సెంచరీ ఎంత అవసరమో అర్థమవుతుంది

ప్రపంచకప్‌కు ఎంపికకాకపోవడంతో రహానే ఇంగ్లీష్‌ కౌంటీ క్రికెట్‌లో పాల్గొన్నాడు. కౌంటీ క్రికెట్‌లో హాంప్‌షైర్‌ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. అరంగ్రేట మ్యాచ్‌లోనే సెంచరీ చేసి రికార్డు సృష్టించాడు. త్వరలో వెస్టిండీస్‌తో జరగనున్న టెస్టు సిరీస్‌కు రహానే ఎంపిక అయిన విషయం తెలిసిందే. ఈ మధ్య కాలంలో టెస్టుల్లో కనిపిస్తున్న రహానే.. పరిమిత ఓవర్ల ఫార్మాట్లో మాత్రం చోటు దక్కించుకోలేకపోతున్నాడు. 2018లో దక్షిణాఫ్రికాపై వన్డే, 2016లో వెస్టిండీస్‌పై టీ20 చివరిసారిగా ఆడాడు.

Story first published: Monday, August 12, 2019, 15:34 [IST]
Other articles published on Aug 12, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X