న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

కోహ్లీ సంబరాలు చూస్తే.. ఈ సెంచరీ ఎంత అవసరమో అర్థమవుతుంది

After hundred Virat Kohlis expression you know he badly wanted to score a hundred says Bhuvneshwar Kumar

ట్రినిడాడ్‌: భారత కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ సంబరాలు చూస్తే.. ఈ సెంచరీ అతని ఎంత అవసరమో అర్థమవుతుంది అని పేసర్‌ భువనేశ్వర్‌ కుమార్‌ తెలిపాడు. ఐదు నెలల సుదీర్ఘ కాలం, 11 ఇన్నింగ్స్‌లు ఒక్క సెంచరీ కోసం విరాట్‌ కోహ్లీ ఎదురుచూసాడు. ప్రపంచక్‌పలో హాఫ్ సెంచరీలు చేసినా.. వాటిని భారీ స్కోర్లుగా మలచకలేకపోయాడు. ఎట్టకేలకు విండీస్‌తో జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో గర్జించాడు. సూపర్‌ షాట్లతో అలరిస్తూ కెరీర్‌లో 42వ సెంచరీ అందుకున్నాడు. సెంచరీ అనంతరం ఎగిరి గంతులేస్తూ సంబరాలు చేసుకున్నాడు.

<strong>పాక్ కోచ్‌ను తప్పించడం వెనుక ఇమ్రాన్‌ ఖాన్ హస్తం!!</strong>పాక్ కోచ్‌ను తప్పించడం వెనుక ఇమ్రాన్‌ ఖాన్ హస్తం!!

అంత సులువు కాదు:

అంత సులువు కాదు:

మ్యాచ్ అనంతరం భువనేశ్వర్‌ మాట్లాడుతూ... ' కోహ్లీ సంబరాలు చూస్తే.. ఈ సెంచరీ అతని ఎంత అవసరమో అర్థమవుతుంది. అయితే కోహ్లీ ఫామ్‌లో లేడని కాదు. ప్రపంచకప్‌లో కోహ్లీ 70, 80 పరుగులకే పరిమితమయ్యాడు. భారీ స్కోర్లు చేయలేదు. అతను ఎంతో దాహంతో ఉన్నాడు. ఈ పిచ్‌పై బ్యాటింగ్‌ చేయడం అంత సులువు కాదు. ఓపెనర్లు ఔటయ్యాక ఆ బాధ్యతను కోహ్లీ తన భుజాలపై వేసుకున్నాడు' అని భువీ పేర్కొన్నాడు.

ఫలితం గురించి ఆలోచించలేదు:

ఈ మ్యాచ్‌లో భువీ అద్భుతంగా బౌలింగ్ చేసాడు. మ్యాచ్‌లో మొత్తం 8 ఓవర్లు వేసిన భువీ.. 31 పరుగులిచ్చి నాలుగు కీలక వికెట్లు తీసాడు. దీనిపై మాట్లాడుతూ... 'ఫలితం గురించి ఆలోచించలేదు. పొదుపుగా బౌలింగ్‌ చేయడంపైనే దృష్టిసారించా. ఒకటీ, రెండు వికెట్లు పడితే.. మ్యాచ్ మన చేతుల్లోకి వస్తుందని తెలుసు. క్రిస్‌ గేల్‌ 300 వన్డేలు ఆడటం గ్రేట్. ఇలాంటి ఘనత సాధించడం గొప్ప అనుభూతి. మూడో వన్డేలోనూ విజయం సాధించి సిరీస్ కైవసం చేసుకుంటామని' భువీ ధీమా వ్యక్తం చేసాడు.

సూపర్ క్యాచ్‌:

సూపర్ క్యాచ్‌:

రెండో వన్డే మ్యాచ్‌లో భువనేశ్వర్‌ అద్భుత బౌలింగ్‌తో పాటు ఓ సూపర్ క్యాచ్‌ పట్టాడు. ఇన్నింగ్స్ 35వ ఓవర్‌లో భువీ బౌలింగ్‌కు వచ్చాడు. ఆ ఓవర్ ఐదో బంతిని విండీస్‌ బ్యాట్స్‌మన్‌ ఛేజ్‌ షాట్ ఆడగా.. బంతి బౌలర్ పక్కనుంచి వెళుతుంది. బంతి తనవైపు వస్తుండటాన్ని గమనించిన భువీ.. వెంటనే స్పందించి ఎడమ వైపు డైవ్‌ చేస్తూ ఒంటి చేత్తో బంతిని అందుకున్నాడు. దీంతో ఛేజ్‌(18) రిటర్న్‌ క్యాచ్‌తో భువీకి దొరికిపోయాడు. ఛేజ్ నిష్క్రమణతో మ్యాచ్ భారత్ చేతుల్లోకి వచ్చింది.

అద్భుత గణాంకాలు:

అద్భుత గణాంకాలు:

బ్యాట్‌తో కెప్టెన్ విరాట్ కోహ్లీ (120; 125 బంతుల్లో 14×4, 1×6), బంతితో పేసర్ భువనేశ్వర్‌ కుమార్‌ (4/31) చెలరేగడంతో వెస్టిండీస్‌తో జరిగిన రెండో వన్డేలో భారత్‌ 59 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భారత్‌ 1-0తో బోణీ కొట్టింది. మొదటి వన్డే వర్షంతో రద్దయిన విషయం తెలిసిందే. చివరిదైన మూడో వన్డే ఈ నెల 14న జరగనుంది.

Story first published: Monday, August 12, 2019, 14:29 [IST]
Other articles published on Aug 12, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X