Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

పాక్ కోచ్‌ను తప్పించడం వెనుక ఇమ్రాన్‌ ఖాన్ హస్తం!!

PM Imran Khan rejected Mickey Arthurs extension as Pakistan head coach

కరాచీ: పాకిస్తాన్‌ జట్టు ప్రపంచకప్‌లో కనీసం సెమీస్‌కు చేరకుండానే నిష్క్రమించడంతో పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు (పీసీబీ) హెడ్ కోచ్‌ మికీ అర్థర్‌పై వేటు వేసింది. లీగ్ దశ నుండే పాక్ ఇంటిదారి పట్టడంతో పాకిస్థాన్ జట్టు, సెలెక్టర్లు, కోచింగ్‌ బృందంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో పాక్ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌.. కోచ్‌ మికీ ఆర్థర్‌తో పాటు ఇతర సహాయ సిబ్బంది పదవీకాలం పొడిగింపు ప్రతిపాదనను తిరస్కరించారు.

ఇమ్రాన్‌ జోక్యం:

ఇమ్రాన్‌ జోక్యం:

ప్రపంచకప్‌ అనంతరం ఇమ్రాన్‌ ఖాన్‌ను పీసీబీ చైర్మన్‌ ఎహ్‌సాన్‌ మణి కలిశారు. పాకిస్థాన్‌ జట్టును పూర్తిగా ప్రక్షాళన చేయాలని భావిస్తున్న పీసీబీ చీఫ్‌ ప్యాట్రన్‌ అయిన ఇమ్రాన్‌.. ఆర్థర్‌తో పాటు జట్టు సహాయ సిబ్బందిని కూడా మార్చివేయాలని మణికి సూచించారు. ఇక ఆర్థర్‌ మరో రెండేండ్ల పాటు కొనసాగాలనుకున్నా.. ఇమ్రాన్‌ అందుకు అంగీకరించలేదని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఆర్థర్‌కు ఉద్వాసన చెప్పడానికి ఇమ్రానే ప్రధాన కారణమట. ఆర్థర్‌ను కోచ్‌గా కొనసాగించాలని పీసీబీ పెద్దలు భావించినప్పటికీ.. ఇమ్రాన్‌ జోక్యంతో అతనికి గుడ్ బై చెప్పాల్సి వస్తోంది.

కోచ్‌గా స్వదేశీ క్రికెటర్‌:

కోచ్‌గా స్వదేశీ క్రికెటర్‌:

పాక్ చీఫ్‌ కోచ్‌ పదవిపై ఆ దేశ మాజీ బ్యాట్స్‌మన్‌లు మిస్బావుల్‌ హక్‌, మొహసిన్‌ ఖాన్‌ ఆసక్తి చూపుతున్నారు. న్యూజిలాండ్ మాజీ కోచ్ మైక్ హెస్సన్ కూడా పాకిస్తాన్‌ కోచ్‌ పదవికి దరఖాస్తు చేసే అవకాశాలున్నాయి. టీమిండియా, పాకిస్తాన్‌ కోచ్‌లలో ఏదైనా ఒకటి దక్కుతుందనే.. ముందుగా పంజాబ్‌ కోచ్‌ పదవి నుంచి హెస్సన్ తప్పుకున్నట్లు సమాచారం తెలుస్తోంది. అయితే విదేశీ కోచ్‌ ఎంపికకు పీసీబీ సానుకూలంగా లేదని సమాచారం తెలుస్తోంది. కోచ్ పదవిలో మిస్బా ముందు వరుసలో ఉన్నాడట.

ఒంటి చేత్తో భువీ సూపర్ క్యాచ్.. మ్యాచ్‌ మలుపు (వీడియో)

నా మాటలను గుర్తుంచుకోండి:

నా మాటలను గుర్తుంచుకోండి:

ఇంతకుముందు ప్రపంచకప్‌లో పాకిస్తాన్‌ నాకౌట్‌కు చేరకపోవడంపై ఇమ్రాన్‌ తీవ్ర అసహనం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. 'పాకిస్తాన్ క్రికెట్ జట్టును గాడిలో పెట్టాలని నిర్ణయించుకున్నా. నా మాటలను గుర్తుంచుకోండి. వచ్చే ప్రపంచకప్‌లో ప్రొఫెషనల్ పాక్ జట్టును చూస్తారు. జట్టును ఆవిధంగా మారుస్తా. ఇందుకోసం క్షేత్ర స్థాయిలో చర్యలకు శ్రీకారం చుడతాం. అత్యుత్తమ ఆటగాళ్ల ఎంపికే నా లక్ష్యం. ప్రతిభ ఉన్న ఆటగాళ్లకు అవకాశమిస్తా. జట్టులో కూడా మార్పులు చాలా అవసరం' అని ఇమ్రాన్‌ ఖాన్‌ పేర్కొన్నాడు.

Story first published: Monday, August 12, 2019, 13:53 [IST]
Other articles published on Aug 12, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+