న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఓహో.. టేలర్ ప్రతీసారి నాలుక బయపెట్టేది అందుకేనా?

Why Do You Put Tongue Out Every Time You Score 100: Harbhajan Singh Takes Dig At Ross Taylor

హైదరాబాద్ : భారత్‌తో జరిగిన తొలి వన్డేలో న్యూజిలాండ్ నాలుగు వికెట్ల తేడాతో గెలుపొందిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో రాస్ టేలర్ (109 నాటౌట్) అజేయ సెంచరీతో చెలరేగగా.. టామ్ లాథమ్, హెన్రీ నికోలస్ హాఫ్ సెంచరీలతో రాణించారు. వరుస ఓటములకు చెక్ పెడ్తూ.. కోహ్లీసేన జోరుకు బ్రేక్‌లు వేసిన ఆతిథ్య జట్టు అద్భుత విజయంతో మూడు వన్డేల సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలో నిలిచింది.

అయితే సెంచరీ అనంతరం నాలుక బయటపెడ్తూ టేలర్ ఇచ్చిన ఓ పోజ్ మ్యాచ్ చూసిన అందరికి గుర్తుండే ఉంటుంది. అతను ఎందుకలా నాలుక బయటపెట్టడాని చాలా మందికి డౌట్ వచ్చింది. సాధారణంగానే పెట్టుంటాడులే అందులో స్పెషల్ ఏముందనుకున్నారంతా.. కానీ సెంచరీ చేసిన ప్రతీసారి టేలర్ ఇలానే నాలుక బయటపెడ్తాడని టీమిండియా వెటరన్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ చెప్పేదాక ఎవరూ గుర్తించలేదు.

అలా ఎందుకో చెప్పరాదు..

అలా ఎందుకో చెప్పరాదు..

అంతేకాకుండా అలా ప్రతీసారి నాలుక ఎందుకు బయపెడ్తావో చెప్పవా? అంటూ కూడా భజ్జీ ట్విటర్ వేదికగా టేలర్‌ను ప్రశ్నించాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ క్రికెట్ సర్కిల్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ‘ఒక అద్భుతమైన ఇన్నింగ్స్‌ ఆడావ్ టేలర్‌. అత్యద్భుతం. కానీ సెంచరీ చేసిన ప్రతీసారి నాలుక ఎందుకు బయట పెడ్తావో చెప్పవా? అంటూ ఫన్నీ ఎమోజీతో క్రికెట్‌లో మంచి గేమ్'అంటూ ట్వీట్ చేశాడు.

కూతురు కోసమే..

కూతురు కోసమే..

ఇక 2015లో cricket.com.au ప్రచురించిన ఓ కథనంలో కూతురు మెకెన్జీ సంతోషం కోసమే సెంచరీ చేసినప్పుడల్లా నాలుకను బయటపెడ్తానని రాస్ టేలర్ తెలిపాడు.

‘నేను ఏజ్ క్రికెట్ క్రికెట్ ఆడుతున్నప్పుడు సెంచరీలు చేసినా జట్టులో నుంచి తప్పించేవారు. ఆస్ట్రేలియాపై నా రెండో శతకం చేసిన తర్వతా కూడా జట్టులో చోటు దక్కలేదు. అప్పుడు నా నాలుకను బయటపెట్టాను. అలా చేసినప్పుడు నా కూతురు సంతోషంతో చప్పట్లు కొట్టింది. ఆ తర్వాత ఆమె కోసం అలా చేసేవాడిని' అని టేలర్ చెప్పినట్లు ఆ కథనం పేర్కొంది.

అరుదైన రికార్డుకు చేరువలో..

అరుదైన రికార్డుకు చేరువలో..

భారత్‌తో జరుగుతున్న మ్యాచ్‌ల్లో అద్భుత ఆటతీరుతో ప్రపంచ రికార్డులను సొంతం చేసుకుంటున్న రాస్ టేలర్.. మరో అరుదైన రికార్డుకు చేరువలో ఉన్నాడు. ఇటీవల టీమిండియాతో జరిగిన టీ20 సిరీస్‌లో తన వందో మ్యాచ్‌ను పూర్తి చేసుకున్న టేలర్‌.. ఆ ఘనత సాధించిన తొలి న్యూజిలాండ్ ప్లేయర్‌గా గుర్తింపు పొందాడు. ఇక టెస్టుల్లో ఇప్పటికే 99 మ్యాచ్‌లు ఆడిన టేలర్.. మరో మ్యాచ్ ఆడితే సాంప్రదాయక ఫార్మాట్‌లో కూడా ‘సెంచరీ' కొడ్తాడు. ఇది కూడా భారత్‌తో జరగనున్న రెండు టెస్ట్‌ల సిరీస్‌లోనే పూర్తికానుంది. ఇదే జరిగితే అంతర్జాతీయంగా మూడు ఫార్మాట్లలో వంద మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న తొలి క్రికెటర్‌గా టేలర్ చరిత్ర సృష్టిసాడు.

నువ్వేం అంపైర్ సామీ.. ఇంత బిత్తిరి నిర్ణయమా?

హమిల్టన్‌లో రికార్డుల మోత..

హమిల్టన్‌లో రికార్డుల మోత..

హమిల్టన్‌లోని సెడన్ పార్క్‌ మైదానంలో 17 ఇన్నింగ్స్‌ల్లో టేలర్‌కు ఇది నాలుగో వన్డే సెంచరీ. ఇక న్యూజిలాండ్‌లో ఒక వేదికపై ఎక్కువ వన్డే సెంచరీలు చేసిన క్రికెటర్‌గా తనపేరిట ఉన్న రికార్డును తానే అధిగమించాడు. నపియర్‌లోని మెక్‌లీన్ పార్క్‌లో టేలర్ మూడు సెంచరీలు చేశాడు.

 టేల‌ర్‌కు ఇది 10వ సెంచరీ.

టేల‌ర్‌కు ఇది 10వ సెంచరీ.

ఇక అంతర్జాతీయ క్రికెట్‌లో హమిల్టన్‌ వేదికగా టేల‌ర్‌కు ఇది 10వ సెంచరీ. ఒకే వేదికపై అత్యధిక సెంచరీలు చేసిన తొలి న్యూజిలాండ్ బ్యాట్స్‌మన్ కాగా.. ఓవరాల్‌గా 5వ క్రికెటర్. ఈ జాబితాలో మహేల జయవర్ధనే (కొలంబో-11), రికీ పాంటింగ్ ( ఎంసీజీ-11), హషీమ్ ఆమ్లా (సెంచూరియన్-11) జాక్వస్ కల్లీస్ (కేప్ టౌన్-10) ముందున్నారు.

2015- హమిల్టన్ మైదానంలో టేలర్ చేసిన మొత్తం పరుగులు. న్యూజిలాండ్ తరఫున ఈ ఫీట్ అందుకున్న తొలి క్రికెటర్ టేలర్. ఈ వేదికపై వన్డేల్లో 871 పరుగులు చేసి నపియర్‌ వేదికగా ఉన్న 779 పరుగుల రికార్డు అధిగమించాడు.

Story first published: Thursday, February 6, 2020, 20:40 [IST]
Other articles published on Feb 6, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X